MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dulkar-salmaneba30961-34ea-43d9-ad17-9d4156796f63-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dulkar-salmaneba30961-34ea-43d9-ad17-9d4156796f63-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో వెంకి అట్లూరి ఒకరు. ఈయన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన తొలిప్రేమ అనే మూ వీతో దర్శకుడుగా తన కెరీర్ ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత ఈయన మిస్టర్ మజ్ను , రంగ్ దే అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం అందుకున్నాయి. ఇకపోతే కొంత కాలం క్రితమే ఈయన తమిళ నటుడు ధనుష్ హీరోగా రూపొందిన సార్ అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా అద్భుతమైన విజయం అందుకుంది. ఈ మూవీ తో ఈ దర్శకుడిDulkar salman{#}bhaskar;choudary actor;dulquer salmaan;seetha;sithara;varun tej;Baba Bhaskar;Mahanati;Darsakudu;Tholi Prema;Mr Majnu;Venky Atluri;Pooja Hegde;Music;V;dhanush;Kumaar;Industry;Telugu;Tamil;Box office;Director;Cinema"లక్కీ భాస్కర్" మూవీ కి సంబంధించిన క్రేజీ విషయాలు ఇవే..!"లక్కీ భాస్కర్" మూవీ కి సంబంధించిన క్రేజీ విషయాలు ఇవే..!Dulkar salman{#}bhaskar;choudary actor;dulquer salmaan;seetha;sithara;varun tej;Baba Bhaskar;Mahanati;Darsakudu;Tholi Prema;Mr Majnu;Venky Atluri;Pooja Hegde;Music;V;dhanush;Kumaar;Industry;Telugu;Tamil;Box office;Director;CinemaMon, 25 Sep 2023 08:30:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో వెంకి అట్లూరి ఒకరు. ఈయన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన తొలిప్రేమ అనే మూ వీతో దర్శకుడుగా తన కెరీర్ ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత ఈయన మిస్టర్ మజ్ను , రంగ్ దే అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం అందుకున్నాయి. ఇకపోతే కొంత కాలం క్రితమే ఈయన తమిళ నటుడు ధనుష్ హీరోగా రూపొందిన సార్ అనే మూవీ కి దర్శకత్వం వహించాడు.

సినిమా అద్భుతమైన విజయం అందుకుంది. ఈ మూవీ తో ఈ దర్శకుడి కి తెలుగు తో పాటు తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే ఈ దర్శకుడు తన తదుపరి మూవీ ని మలయాళ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి దుల్కర్ సల్మాన్ తో చేయబోతున్నాడు. ఈ మూవీ కి లక్కీ భాస్కర్ అనే టైటిల్ ను కూడా ఇప్పటికే మూవీ మేకర్స్ ఫిక్స్ చేశారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో అధికారికంగా లాంచ్ చేశారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ వివరాలను తెలుసుకుందాం. ఈ మూవీ లో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తూ ఉండగా ... ఈయనకు జోడిగా ఈ మూవీ లో మీనాక్షి చౌదరి కనిపించబోతుంది.

ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనుండగా ... జీ వి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. నవీన్ నోలి ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయనుండగా ... సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు పర్చూర్ ఫోర్ సినిమాస్ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఇకపోతే దుల్కర్ సల్మాన్ ఇప్పటికే మహానటి ,  సీత రామం అనే మూవీ లతో మంచి విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పలుచటి శారీలో అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన దివ్య భారతి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>