EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/modib9e3dc66-a94c-4906-aff9-081b03003f07-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/modib9e3dc66-a94c-4906-aff9-081b03003f07-415x250-IndiaHerald.jpgపార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు సందర్బంగా ఇటీవల పలువురు ఎంపీలు మాట్లాడారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ సోనియా గాంధీ మాట్లాడుతూ.. ఇది రాజీవ్ గాంధీ కలలు కన్న బిల్లు అని ఎప్పుడో రాజీవ్ గాంధీ ఈ బిల్లును ప్రవేశపెట్టాలని అనుకున్నారని చెప్పారు. అయితే రాజీవ్ గాంధీకి 400కు పైగా ఎంపీలు ఉన్న సమయంలో ఎందుకు ప్రవేశ పెట్టలేదు. పోనీ సోనియా గాంధీ 2004, 2009 లో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మహిళా బిల్లు ప్రవేశపెట్టలేదని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. కేవలం రాజకీయాలు మాత్రమే MODI{#}SoniaGandhi;Laloo Prasad Yadav;rajeev;Kerala;Rahul Gandhi;Mohandas Karamchand Gandhi;Rajiv Gandhi;Mulayam Singh Yadav;Hyderabad;politics;Congress;Bharatiya Janata Party;MP;rahul;Rahul Sipligunj;Minister;central government;Partyమోడీ అమ్ములపొదిలో ఇంకెన్ని అస్త్రాలో?మోడీ అమ్ములపొదిలో ఇంకెన్ని అస్త్రాలో?MODI{#}SoniaGandhi;Laloo Prasad Yadav;rajeev;Kerala;Rahul Gandhi;Mohandas Karamchand Gandhi;Rajiv Gandhi;Mulayam Singh Yadav;Hyderabad;politics;Congress;Bharatiya Janata Party;MP;rahul;Rahul Sipligunj;Minister;central government;PartySun, 24 Sep 2023 09:00:00 GMTపార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు సందర్బంగా ఇటీవల పలువురు ఎంపీలు మాట్లాడారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ సోనియా గాంధీ మాట్లాడుతూ.. ఇది రాజీవ్ గాంధీ కలలు కన్న బిల్లు అని ఎప్పుడో రాజీవ్ గాంధీ ఈ బిల్లును ప్రవేశపెట్టాలని అనుకున్నారని చెప్పారు. అయితే రాజీవ్ గాంధీకి 400కు పైగా ఎంపీలు ఉన్న సమయంలో ఎందుకు ప్రవేశ పెట్టలేదు. పోనీ సోనియా గాంధీ 2004, 2009 లో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మహిళా బిల్లు ప్రవేశపెట్టలేదని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.


కేవలం రాజకీయాలు మాత్రమే సోనియా గాంధీ మాట్లాడుతున్నారని అంటున్నారు. అయితే కాంగ్రెస్ హయాంలో బీజేపీ మద్దతిచ్చిన కూడా కాంగ్రెస్ మిత్ర పక్షాలైన లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేజీ, ఎస్పీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ లు మహిళ బిల్లును అడ్డుకున్న విషయాన్ని మరిచిపోయారు. కాంగ్రెస్ 50 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్నా కూడా ప్రవేశపెట్టని బిల్లును బీజేపీ ప్రవేశపెడితే మాత్రం దానిపై అనేక రకాలుగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు విమర్శలు చేస్తున్నారు.


అయితే మహిళా బిల్లును తక్షణమే అమల్లోకి తీసుకురావాలని రాహుల్ గాంధీ కోరారు. అయితే దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ..  రాజ్యాంగం ప్రకారం వచ్చే నాలుగేళ్లలో నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. పునర్విభజన జరిగిన తర్వాత మహిళా బిల్లు అమల్లోకి వస్తుందని తెలిపారు.


ఒక వేళ ముందే ప్రవేశపెడితే హైదరాబాద్ లో ఓవైసీ స్థానం, కేరళ వయనాడ్ లో రాహుల్ స్థానం మహిళలకు వస్తే మళ్లీ బీజేపీ ప్రభుత్వం కావాలనే కుట్ర పన్ని చేసిందని అంటారు. కాబట్టి నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మహిళా బిల్లు అమల్లోకి వస్తుందని ప్రస్తుతం ఈ బిల్లును రాష్ట్రాల్లోని అసెంబ్లీలు కూడా ఆమోదించాల్సిన అవసరం ఉంది తర్వాత చివరిగా రాష్ట్రపతి ఆమోదం తెలుపుతారు. మొత్తానికి మహిళల దశాబ్దాల కల మోడీ నెరేవర్చారని చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

డేట్ లను అడ్జస్ట్ చేయలేక ఆ ఇద్దరు క్రేజీ హీరోల మూవీలను వదులుకున్న శ్రీ లీల..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>