MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood26267a3d-e822-47cc-a645-aee4971caae4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood26267a3d-e822-47cc-a645-aee4971caae4-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రస్తుతం అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. ఇటీవల షారుక్ తో కలిసి జవాన్ సినిమాతో బాలవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. ఈ క్రమంలోనే జవాన్ సక్సెస్ తో నయనతార సినిమాలకు ఇప్పుడు మరింత డిమాండ్ పెరిగింది. ఇటీవల 'జవాన్' తో ప్రేక్షకులను అలరించిన నయనతార ఇప్పుడు త్వరలోనే 'ఇరైవన్'(Iraivan) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇందులో తమిళ స్టార్ హీరో జయం tollywood{#}zero;shankar;Jawaan;Kollywood;Tamil;Darsakudu;Director;Chitram;Thriller;Music;september;Heroine;Fashion;nayantara;Hero;Cinemaనయనతార సినిమాకి 'A' సర్టిఫికెట్..!!నయనతార సినిమాకి 'A' సర్టిఫికెట్..!!tollywood{#}zero;shankar;Jawaan;Kollywood;Tamil;Darsakudu;Director;Chitram;Thriller;Music;september;Heroine;Fashion;nayantara;Hero;CinemaSun, 24 Sep 2023 19:30:00 GMTకోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రస్తుతం అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. ఇటీవల షారుక్ తో కలిసి జవాన్ సినిమాతో బాలవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. ఈ క్రమంలోనే జవాన్ సక్సెస్ తో నయనతార సినిమాలకు ఇప్పుడు మరింత డిమాండ్ పెరిగింది. ఇటీవల 'జవాన్' తో ప్రేక్షకులను అలరించిన నయనతార ఇప్పుడు త్వరలోనే 'ఇరైవన్'(Iraivan) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇందులో తమిళ స్టార్ హీరో జయం రవికి జోడిగా నయనతార నటిస్తోంది. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. 

సెప్టెంబర్ 28న విడుదల కాబోతున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేస్తుంది. ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాకి సెన్సార్ టీం 'A' సర్టిఫికెట్ ఇవ్వడం ఇప్పుడు షాకింగ్ గా మారింది. అంతేకాదు సినిమాలో ఎటువంటి కట్స్ లేకుండా జీరో కట్స్ తో సెన్సార్ 'A' సర్టిఫికెట్ జారీ చేసినట్లు సమాచారం. సాధారణంగా నయనతార సినిమాలకు ప్రతిసారి క్లీన్ యూ సర్టిఫికెట్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. కానీ మొదటిసారి నయన్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాకు మాత్రం 'A' సర్టిఫికెట్ రావడం సర్వత్ర ఆసక్తికరంగా మారింది. సినిమాకి సెన్సార్ టీం 'A' సర్టిఫికెట్ ఇవ్వడానికి ప్రధాన కారణం సినిమాలో హింస ఎక్కువగా ఉందట. 

అందుకే సెన్సార్ బోర్డు 'A' సర్టిఫికెట్ ఇచ్చిందంటూ కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఫ్యాషన్ స్టూడియోస్ బ్యానర్ పై దర్శకుడు అహ్మద్ ఈ చిత్రాన్ని సైకాలజీకల్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ గారు రూపొందించాడు. సినిమాలో క్రైమ్ సీన్స్ ని చాలా భయంకరంగా, హింసాత్మకంగా చూపించడంతో ఈ మూవీకి 'A' సర్టిఫికెట్ వచ్చినట్లు తెలుస్తోంది. సినిమాలో అలాంటి సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ఇప్పటికే ట్రైలర్ లో శాంపిల్ గా కొన్ని షాట్స్ చూపించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని తమిళం తో పాటు తెలుగులోనూ విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మద్యం సేవిస్తూ ప్యాంటు లేకుండా అందాలతో అరాచకం చేస్తున్న లహరి..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>