Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle3d5632dc-fd67-4e10-b409-27b142cfbaab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle3d5632dc-fd67-4e10-b409-27b142cfbaab-415x250-IndiaHerald.jpgమహేష్ బాబు కెరీర్లో దూకుడు భారీ బ్లాక్ బస్టర్ గా ఉంది. 2011 సెప్టెంబర్ 23న విడుదలైన ఈ చిత్రం 12 ఏళ్ళు పూర్తి చేసుకుంది. పోకిరి మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన మహేష్ బాబుకు వరుస ప్లాప్స్ పడ్డాయి.సైనికుడు, అతిథి, ఖలేజా చిత్రాలు పరాజయం పొందాయి. ఆ టైం లో వచ్చిన దూకుడు ఆయన్ని సక్సెస్ ట్రాక్ ఎక్కింది. దర్శకుడు శ్రీను వైట్ల కామెడీ, యాక్షన్, రొమాన్స్, ఎమోషన్ కలగలిపి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ తెరకెక్కించారు.బ్రహ్మానందం కామెడీ ట్రాక్ సినిమాకే హైలెట్. ఎంఎస్ నారాయణ సైతం చెలరేగిపోయాడు. సమంతతో కెమిస్ట్రీ బాగానsocialstars lifestyle{#}Badshah;Prakash Raj;srinu vytla;Pokiri;Dookudu;Khaleja;srihari;Father;Darsakudu;Comedy;thaman s;Director;Hero;CBN;Annayya;Success;Blockbuster hit;Industry;september;Chitram;Cinemaఆ కారణంగా దూకుడు మూవీను రిజెక్ట్ చేసిన శ్రీహరి...!!ఆ కారణంగా దూకుడు మూవీను రిజెక్ట్ చేసిన శ్రీహరి...!!socialstars lifestyle{#}Badshah;Prakash Raj;srinu vytla;Pokiri;Dookudu;Khaleja;srihari;Father;Darsakudu;Comedy;thaman s;Director;Hero;CBN;Annayya;Success;Blockbuster hit;Industry;september;Chitram;CinemaSun, 24 Sep 2023 15:00:00 GMTమహేష్ బాబు కెరీర్లో దూకుడు భారీ బ్లాక్ బస్టర్ గా ఉంది. 2011 సెప్టెంబర్ 23న విడుదలైన ఈ చిత్రం 12 ఏళ్ళు పూర్తి చేసుకుంది. పోకిరి మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన మహేష్ బాబుకు వరుస ప్లాప్స్ పడ్డాయి.సైనికుడు, అతిథి, ఖలేజా చిత్రాలు పరాజయం పొందాయి. ఆ టైం లో వచ్చిన దూకుడు ఆయన్ని సక్సెస్ ట్రాక్ ఎక్కింది. దర్శకుడు శ్రీను వైట్ల కామెడీ, యాక్షన్, రొమాన్స్, ఎమోషన్ కలగలిపి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ తెరకెక్కించారు.బ్రహ్మానందం కామెడీ ట్రాక్ సినిమాకే హైలెట్. ఎంఎస్ నారాయణ సైతం చెలరేగిపోయాడు. సమంతతో కెమిస్ట్రీ బాగానే వర్క్ అవుట్ అయ్యింది. థమన్ సాంగ్స్ అలరించాయి. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. దర్శకుడు శ్రీను వైట్ల హీరో తండ్రి పాత్రకు శ్రీహరిని అనుకున్నాడట. హీరోగా నెమ్మదించిన శ్రీహరి అప్పటికే సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. దీంతో కీలకమైన ఫాదర్ రోల్ చేయాలని శ్రీహరిని అడిగారట.

అయితే సపోర్టింగ్ రోల్స్ చేస్తున్న శ్రీహరి ఒప్పుకోలేదట. ఈ వయసులో ఫాదర్ రోల్ చేస్తే ఇకపై తనకు అలాంటి పాత్రలే వస్తాయి. సపోర్టింగ్ రోల్స్, సెకండ్ హీరో స్థాయి నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్థాయికి పడిపోతానని శ్రీను వైట్ల ఆఫర్ రిజెక్ట్ చేశారట. మీరు చేస్తాను అంటే తండ్రి పాత్రను అన్నయ్య పాత్రగా మారుస్తాను అన్నాడట. అయినా శ్రీహరి ఒప్పుకోలేదట. శ్రీను వైట్ల కూడా అన్నయ్యగా మారిస్తే సెంటిమెంట్ అంతగా వర్క్ అవుట్ కాదనుకున్నారట. దాంతో శ్రీహరిని తీసుకోవాలనే ఆలోచన వదిలేశారట.

శ్రీహరి రిజెక్ట్ చేయడంతో ఆ పాత్రకు ప్రకాష్ రాజ్ ని తీసుకున్నారు. ఇక ప్రకాష్ రాజ్ నటన గురించి తెలిసిందే. ఆయన వంద శాతం ఆ పాత్రకు న్యాయం చేశాడు. దూకుడు రివెంజ్ డ్రామా అన్న విషయం తెలిసిందే. తన తండ్రిని చంపాలని చూసిన వ్యక్తులను హీరో ఎలా అంతం చేశాడన్నదే కథ. దూకుడు బాక్సాఫీస్ దుమ్ము దులిపి మహేష్ కి కఠిన సమయంలో అవసరమైన హిట్ హిట్ ఇచ్చింది. దూకుడుతో మహేష్ మరోసారి బాక్సాఫీస్ బాద్షా అని నిరూపించాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

Animal: రష్మిక పోస్టర్ పై విపరీతమైన ట్రోల్స్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>