Politicsmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/janasenanagababuf8b08937-434d-44eb-9138-af015a48f3b5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/janasenanagababuf8b08937-434d-44eb-9138-af015a48f3b5-415x250-IndiaHerald.jpgసినీ నటుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. టీడీపీని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో కలకలం రేపాయి.టీడీపీతో పొత్తులో మెజార్టీ సీట్లు సాధిస్తే సీఎం పవన్ కళ్యాణే అవుతారని స్పష్టం చేశారు. జనసేన కిందనే టీడీపీ పని చేయాల్సి ఉంటుందని కామెంట్ చేశారు.చిత్తూరు పర్యటనలో ఉన్న జనసేన నేత నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరులో జనసేన కార్యకర్తలతో సమావేశమయ్యారు. కార్యకర్తలు టీడీపీతో జనసేన పొత్తును ప్రస్తావించారు. టీడీపీ నేతలు తమను వేధించారని నాగబాబు ముందు janasenanagababu{#}Nagababu;kalyan;TDP;Janasena;Party;Telangana Chief Minister;Bharatiya Janata Party;CM;Assemblyవైరల్ గా మారిన నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు...!!వైరల్ గా మారిన నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు...!!janasenanagababu{#}Nagababu;kalyan;TDP;Janasena;Party;Telangana Chief Minister;Bharatiya Janata Party;CM;AssemblySun, 24 Sep 2023 21:41:00 GMTసినీ నటుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. టీడీపీని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి.టీడీపీ తో పొత్తులో మెజార్టీ సీట్లు సాధిస్తే సీఎం పవన్ కళ్యాణే అవుతారని స్పష్టం చేశారు. జనసేన కిందనే టీడీపీ పని చేయాల్సి ఉంటుందని కామెంట్ చేశారు.చిత్తూరు పర్యటన లో ఉన్న జనసేన నేత నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరులో జనసేన కార్యకర్తలతో సమావేశమయ్యారు. కార్యకర్తలు టీడీపీతో జనసేన పొత్తును ప్రస్తావించారు. టీడీపీ నేతలు తమను వేధించారని నాగబాబు ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కార్యకర్తలకు నాగబాబు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. గతాన్ని మరచి మంచి భవిష్యత్ కోసం ముందుకు సాగాలని సూచించారు. అంతేకాదు, టీడీపీ మన కిందే పని చేయాలి అని పేర్కొనడం గమనార్హం. పొత్తు ఉన్నప్పటికీ టీడీపీ నేతలు మన కిందనే పని చేయాల్సి ఉంటుందని వివరంచారు.

టీడీపీతో పొత్తులో ఉన్నప్పటి కీ జనసేన నేతలు మాత్రం మన పార్టీ అజెండానే ముందుకు తీసుకెళ్లాలని సూచనలు చేశారు. అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్లుతామని ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచే టీడీపీ, జనసేన పొత్తుపై చర్చలు జరుగుతున్నాయి. ఈ రెండు పార్టీల క్యాడర్ మధ్య కూడా అసంతృప్తులు బయటపడుతున్నాయి. మొన్నటి వరకు టీడీపీతోనే జనసేన పొత్తు కుదరదనే అభిప్రాయాలు కనిపించాయి. బీజేపీతో తమకు బలమైన సంబంధాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ తరుచూ చెప్పేవారు. అయితే.. టీడీపీని కూడా తమతో పొత్తులోకి తీసుకోవడానికి పని చేస్తామన్న పవన్ కళ్యాణ్ ఏకంగా టీడీపీతో కలిసి వెళ్లుతామని ప్రకటించడం సంచలనమైంది. బీజేపీ నుంచి ఇంకా ఈ అంశంపై స్పష్టత లేదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మద్యం సేవిస్తూ ప్యాంటు లేకుండా అందాలతో అరాచకం చేస్తున్న లహరి..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>