Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iccf911361c-8511-479c-88fb-d30626adca01-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iccf911361c-8511-479c-88fb-d30626adca01-415x250-IndiaHerald.jpgవరల్డ్ కప్ సమరానికి సమయం ఆసన్నమవుతుంది. అక్టోబర్ 5వ తేదీ నుంచి ఐసీసీ మెగా టోర్నర్ జరగబోతుంది. అయితే ఈసారి ఈ ప్రపంచ కప్ కి అటు భారత్ ఆతిథ్యం ఇస్తూ ఉండడం గమనార్హం. అయితే ఇప్పటికే అన్ని జట్లు కూడా వరల్డ్ కప్ కోసం సిద్ధమైపోతున్నాయి. వరల్డ్ కప్ లో పాల్గొనబోయే జట్టు వివరాలను కూడా ఆయా దేశాల క్రికెట్ బోర్డులు ప్రకటించాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఇక ఈ ప్రపంచ కప్ కు సంబంధించిన చర్చ జరుగుతూ ఉంది. వరల్డ్ కప్ లో ఈసారి టైటిల్ విజేతగా నిలిచిన టీం ఏది అనేIcc{#}Currency;World Cup;INTERNATIONAL;Prize;Hanu Raghavapudi;Cricket;India;Event;Octoberప్రైస్ మనీ భారీగా తగ్గించిన ఐసీసీ.. వరల్డ్ కప్ విజేతకు ఎంతో తెలుసా?ప్రైస్ మనీ భారీగా తగ్గించిన ఐసీసీ.. వరల్డ్ కప్ విజేతకు ఎంతో తెలుసా?Icc{#}Currency;World Cup;INTERNATIONAL;Prize;Hanu Raghavapudi;Cricket;India;Event;OctoberSat, 23 Sep 2023 09:00:00 GMTవరల్డ్ కప్ సమరానికి సమయం ఆసన్నమవుతుంది. అక్టోబర్ 5వ తేదీ నుంచి ఐసీసీ మెగా టోర్నర్ జరగబోతుంది. అయితే ఈసారి ఈ ప్రపంచ కప్ కి అటు భారత్ ఆతిథ్యం ఇస్తూ ఉండడం గమనార్హం. అయితే ఇప్పటికే అన్ని జట్లు కూడా వరల్డ్ కప్ కోసం సిద్ధమైపోతున్నాయి. వరల్డ్ కప్ లో పాల్గొనబోయే జట్టు వివరాలను కూడా ఆయా దేశాల క్రికెట్ బోర్డులు ప్రకటించాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఇక ఈ ప్రపంచ కప్ కు సంబంధించిన చర్చ జరుగుతూ ఉంది.


 వరల్డ్ కప్ లో ఈసారి టైటిల్ విజేతగా నిలిచిన టీం ఏది అనే విషయంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు రివ్యూల మీద రివ్యూలు ఇచ్చేస్తున్నారు. అంతేకాదు ఇక ప్రపంచ క్రికెట్లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయంపై కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇదిలా ఉంటే ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వన్డే వరల్డ్ కప్ లో భాగంగా విజేతలకు ఇచ్చే ప్రైజ్ మనీ ఎంత అనే విషయాన్ని ప్రకటించింది. పూర్తి వివరాలను వెల్లడించింది. ఈ మెగా ఈవెంట్ కోసం కోటి డాలర్లను అంతర్జాతీయ క్రికెట్ మండలి కేటాయించినట్లు తెలిపింది.



 అంటే భారత కరెన్సీ ప్రకారం 82 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ లో విజేతగా నిలిచిన టీం కి 40 లక్షల డాలర్లు అంటే 33 కోట్ల రూపాయలు.. రన్నరపుగా నిలిచిన జట్టుకు 20 లక్షల డాలర్లు అంటే భారత కరెన్సీ లో 16.5 కోట్ల రూపాయలు ఇవ్వనున్నారు. సెమి ఫైనల్లో ఓడిన రెండు జట్లకు కూడా చెరో 13 కోట్లు అందజేయబోతున్నారు అని చెప్పాలి. సూపర్ సిక్స్ దశలోనే ఇంటి ముఖం పట్టిన టీమ్స్ కి ₹4.9 కోట్లు ఇవ్వబోతున్నారు. ఇక గ్రూప్ దశలో గెలిచిన జట్లకు ప్రైజ్ మనీ అనౌన్స్ చేశారు. ఒక్కో మ్యాచ్ కి  33 లక్షలు ఇవ్వనున్నట్లు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. అయితే 2019 వరల్డ్ కప్ కి 39 కోట్ల ప్రైస్ మనీ ఇవ్వగా ఇక ఇప్పుడు మాత్రం ఏకంగా ప్రైజ్ మనీ తగ్గించింది ఐసిసి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బాలయ్య- తమన్నా కాంబోలో మిస్ అయిన.. సూపర్ హిట్ మూవీ ఏదో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>