PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/is-election-commission-did-not-allot-tumbler-to-janasena83cc142d-4bb2-46da-982a-9386ee8306e1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/is-election-commission-did-not-allot-tumbler-to-janasena83cc142d-4bb2-46da-982a-9386ee8306e1-415x250-IndiaHerald.jpgఅందుకనే గాజుగ్లాసు గుర్తును రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఫ్రీ సింబల్ గా ప్రకటించింది. తర్వాత జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో జనసేన అభ్యర్ధుల్లో చాలామంది ఏ గుర్తు దొరికితే ఆ గుర్తుపైనే పోటీచేశారు. అలాగే ఒక ఎంపీ, రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికల్లో ఇండిపెండెంటు అభ్యర్ధులు గాజుగ్లాసు గుర్తుపై పోటీచేశారు. రాబోయే ఎన్నికల్లో గాజుగ్లాసు గుర్తు జనసేనకు వచ్చే అవకాశం లేదని అందరికీ తెలిసిందే. janasena glass {#}Pawan Kalyan;Janasena;Hanu Raghavapudi;Assembly;central government;News;Partyఅమరావతి : గాజుగ్లాసుపై సరికొత్త వివాదం ?అమరావతి : గాజుగ్లాసుపై సరికొత్త వివాదం ?janasena glass {#}Pawan Kalyan;Janasena;Hanu Raghavapudi;Assembly;central government;News;PartySat, 23 Sep 2023 03:00:00 GMT

జనసేనకు కేంద్ర ఎన్నికల కమీషన్ ఎన్నికల గుర్తుగా గాజుగ్లాసు కేటాయించలేదా ? కేటాయించలేదనే చెబుతున్నారు నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రమణ్యం. రాబోయే ఎన్నికల్లో జనసేన ఎన్నికల గుర్తుగా గాజుగ్లాసును కేంద్ర ఎన్నికల కమీషన్ కేటాయించిందని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. అయితే ఇక్కడే కొందరికి అనుమానాలు మొదలయ్యాయి. ఏమిటంటే 2019 ఎన్నికల్లో జనసేనకు వచ్చిన ఓట్లు, సీట్లు ప్రాతిపదికగా ఎన్నికల గుర్తు గాజుగ్లాసును కమీషన్ రద్దుచేసింది.




అందుకనే గాజుగ్లాసు గుర్తును రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఫ్రీ సింబల్ గా ప్రకటించింది. తర్వాత జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో జనసేన అభ్యర్ధుల్లో చాలామంది ఏ గుర్తు దొరికితే ఆ గుర్తుపైనే పోటీచేశారు. అలాగే ఒక ఎంపీ, రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికల్లో ఇండిపెండెంటు అభ్యర్ధులు గాజుగ్లాసు గుర్తుపై పోటీచేశారు. రాబోయే ఎన్నికల్లో గాజుగ్లాసు గుర్తు జనసేనకు వచ్చే అవకాశం లేదని అందరికీ తెలిసిందే.


 


సరిగ్గా ఈ నేపధ్యంలోనే గాజుగ్లాసు గుర్తును పార్టీకి కేటాయించినట్లు కమీషన్ చెప్పిందని పవన్ ట్విట్టర్లో చెప్పారు. దాంతో అప్పుడు గాజుగ్లాసు గుర్తును కమీషన్ ఎందుకు రద్దుచేసింది రాబోయే ఎన్నికల్లో ఎందుకు కేటాయించిందన్నది ఎవరికీ అర్ధంకాలేదు. దాంతో ఏమోలే కమీషన్ కేటాయించిందని అందరు అనుకున్నారు. ఇంతలో నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రమణ్యం సీన్లోకి వచ్చారు. జనసేనకు గాజుగ్లాసు కేటాయిస్తున్నట్లు కమీషన్ ఎప్పుడు చెప్పిందని రావు అడిగారు. ఇక్కడ రావు అడిగినదాంట్లో లాజిక్ ఉంది. ఇదే సమయంలో సమాచారం రానపుడు పవన్ మాత్రం ధన్యవాదాలు ఎందుకు చెబుతారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.





 గాజుగ్లాసు గుర్తును జనసేనకు కేటాయిస్తున్నట్లు కమీషన్ ఇచ్చిన సమాచారాన్ని చూపించమని రావు డిమాండ్ చేశారు. గాజుగ్లాసు గుర్తు తమకు కమీషన్ కేటాయించేసిందని పవన్ అనవసరంగా జనాలను అయోమయానికి గురిచేస్తున్నట్లు మండిపడ్డారు. తనకున్న సమాచారం ప్రకారం గాజుగ్లాసు గుర్తును జనసేనకు కేంద్ర ఎన్నికల కమీషన్  కేటాయించలేదని ప్రకటించారు. ఒకవేళ అలాంటి ఉత్తర్వులు ఉంటే చూపించాలని చాలెంజ్ చేశారు. దాంతో ఇపుడు జనసేన ఎన్నికల గుర్తు మరోసారి వివాదంలోకి ఎక్కేట్లుంది. పవన్ అన్నా సమాచారాన్ని చూపించాలి లేదా కమీషన్ నుండి ప్రకటిస్తన వస్తే కానీ వివాదానికి ముగింపు పడేట్లు లేదు. 




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గోదావరి : ఇద్దరిలో భయం పెరిగిపోతోందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>