MoneyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money-ru-416-adatho-ru-64-lakshalu-sontham-vari-kosam-matrame538be667-da5a-4f7b-b139-fadc242c7834-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money-ru-416-adatho-ru-64-lakshalu-sontham-vari-kosam-matrame538be667-da5a-4f7b-b139-fadc242c7834-415x250-IndiaHerald.jpgసుకన్య సమృద్ధి యోజన పథకం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆడపిల్లల కోసం మాత్రమే ప్రత్యేకించి తీసుకొచ్చిన ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన డబ్బులను ఆడపిల్లల విద్య, పెళ్లి అవసరాలకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలంలో మంచి లాభాలను సొంతం చేసుకోవాలని భావించే తల్లిదండ్రులు ఈ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే మంచిది. ఇక ప్రతి నెల తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసి భారీ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన డబ్బులు మెచ్యూరిటీ పీరియడ్ కి ముందే విత్ డ్రా చేసుకోవడం మాతMONEY{#}Sukanya;central government;Parents;marriageMoney: రూ.416 ఆదాతో రూ.64 లక్షలు సొంతం.. వారి కోసం మాత్రమే..!Money: రూ.416 ఆదాతో రూ.64 లక్షలు సొంతం.. వారి కోసం మాత్రమే..!MONEY{#}Sukanya;central government;Parents;marriageSat, 23 Sep 2023 11:00:00 GMTసుకన్య సమృద్ధి యోజన పథకం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆడపిల్లల కోసం మాత్రమే ప్రత్యేకించి తీసుకొచ్చిన ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన డబ్బులను ఆడపిల్లల విద్య, పెళ్లి అవసరాలకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలంలో మంచి లాభాలను సొంతం చేసుకోవాలని భావించే తల్లిదండ్రులు ఈ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే మంచిది. ఇక ప్రతి నెల తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసి భారీ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన డబ్బులు మెచ్యూరిటీ పీరియడ్ కి ముందే విత్ డ్రా చేసుకోవడం మాత్రం సాధ్యం కాదు.

ఆడపిల్లలకు 10 సంవత్సరాల లోపు ఈ స్కీంలో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కనీసం 15 సంవత్సరాల పాటు ఇందులో ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో భారీ బెనిఫిట్స్ పొందవచ్చు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ పథకంలో వడ్డీరేట్లను కేంద్ర ప్రభుత్వం మారుస్తుంది అని అందరికీ తెలిసిందే. ఇక ఆడపిల్లకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత అత్యవసరం అనుకుంటే 50% మొత్తాన్ని విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.  ఉదాహరణకు రోజుకు రూ.416 ఇన్వెస్ట్ చేస్తే 21 సంవత్సరాలు తర్వాత ఏకంగా రూ.64 లక్షలు పొందే అవకాశం ఉంటుంది.

ఇకపోతే ఈ సుకన్య సమృద్ధి యోజన పథకం.  ఆడపిల్లలకు ఒక వరం లాంటిది అని చెప్పవచ్చు ముఖ్యంగా 22 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే 40లక్షల రూపాయల పొందే అవకాశం ఉంటుంది.  ముఖ్యంగా పొదుపు విషయంలో కాస్త జాగ్రత్త పడితే మంచిదని చెప్పాలి . ముఖ్యంగా ఆడపిల్లలకు ఉన్న ఇతర స్కీములతో పోల్చుకుంటే ఈ స్కీం బెస్ట్ స్కీమ్ అని వీరికి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ స్కీం కాపాడుతుందని చెప్పవచ్చు. మొత్తానికి అయితే సుకన్య సమృద్ధి యోజన పథకం ఆడపిల్లలకే కాదు వారి తల్లిదండ్రులకు కూడా మంచి ఆర్థిక భరోసాను ఇస్తుందని చెప్పవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బాలయ్య- తమన్నా కాంబోలో మిస్ అయిన.. సూపర్ హిట్ మూవీ ఏదో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>