Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/sehwag4ab899e3-bc50-4b35-a9e2-7455e2f758a1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/sehwag4ab899e3-bc50-4b35-a9e2-7455e2f758a1-415x250-IndiaHerald.jpgఐసీసీ వన్ డే ప్రపంచ కప్ త్వరలో మొదలవ్వబోతోంది. ఐతే దీనికి ముందు ఇండియా, ఆస్ట్రేలియా జట్లు వన్ డే సిరీస్ లో తలపడుతున్నాయి. ఈ సిరీస్ లో మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 22 న మొహాలీలో జరిగింది. ప్రపంచ కప్ దగ్గరలో, కప్ కు ప్రధమ పోటీదారులు ఇండియా, ఆస్ట్రేలియా మధ్య సిరీస్ కావడంతో , ఈ సిరీస్ పై అందరి దృష్టి ఉంది. మొదటి మ్యాచ్ లో ఆస్ట్రేలియా పై ఇండియా అద్భుత విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ లో ఇండియా ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీ అద్భుతమైన బౌలింగ్ తో అదరగొట్టాడు. తన పేస్ ఎటాక్ తో ఆస్ట్రేలియా బ్యాట్టింగ్ లైన్ అప్ ను దెSehwag{#}VIRAT KOHLI;surya sivakumar;rahul;Rahul Sipligunj;Mohammed Shami;Australia;september;India;historyచరిత్ర సృష్టించిన షమీ..16 ఏళ్లలో మొదటి సారి?చరిత్ర సృష్టించిన షమీ..16 ఏళ్లలో మొదటి సారి?Sehwag{#}VIRAT KOHLI;surya sivakumar;rahul;Rahul Sipligunj;Mohammed Shami;Australia;september;India;historySat, 23 Sep 2023 16:00:00 GMTఐసీసీ వన్ డే ప్రపంచ కప్ త్వరలో మొదలవ్వబోతోంది. ఐతే దీనికి ముందు ఇండియా, ఆస్ట్రేలియా జట్లు వన్ డే సిరీస్ లో తలపడుతున్నాయి. ఈ సిరీస్ లో మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 22 న మొహాలీలో జరిగింది. ప్రపంచ కప్ దగ్గరలో, కప్ కు ప్రధమ పోటీదారులు ఇండియా, ఆస్ట్రేలియా మధ్య సిరీస్ కావడంతో , ఈ సిరీస్ పై అందరి దృష్టి ఉంది. మొదటి మ్యాచ్ లో ఆస్ట్రేలియా పై ఇండియా అద్భుత విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ లో ఇండియా ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీ అద్భుతమైన బౌలింగ్ తో అదరగొట్టాడు. తన పేస్ ఎటాక్ తో ఆస్ట్రేలియా బ్యాట్టింగ్ లైన్ అప్ ను దెబ్బతీశాడు. షమీ ఈ మ్యాచ్ లో ఒక అరుదయిన రికార్డును కూడా నెల్కొలిపాడు.

మొహాలీ లో జరిగిన మొదటి మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఇండియా టీం. తొలుత బ్యాట్టింగ్ కు దిగిన ఆస్ట్రేలియా, 50 ఓవర్లకు 276 పరుగులు చేసింది. మోహ్హమ్మద్ షమీ, 10 ఓవర్లకు 51 పరుగులు సమర్పించి 5 వికెట్లు పడగొట్టాడు. మార్ష్, స్మిత్, స్టోఇనిస్, వంటి స్టార్ బ్యాటర్లను పెవిలియన్ కు చేర్చి, ఆస్ట్రేలియా స్కోర్ ను కట్టడి చెయ్యడంలో ముఖ్య పాత్ర పోషించాడు. దీంతో సుమారు 16 ఏళ్ళ తరువాత సొంతగడ్డ పై ఐదు వికెట్లు పడగొట్టిన తోలి భారత పేసర్ గా చరిత్ర సృష్టించాడు షమీ. అదే సమయంలో ఆస్ట్రేలియా పై అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా కపిల్ దేవ్ తరువాత రెండో స్థానం సంపాదించాడు షమీ. షమీ ఇప్పటివరకు ఆస్ట్రేలియా పై 37 వికెట్లు పడగొట్టాడు. 45 వికెట్లు పడగొట్టి మొదటి స్థానంలో ఉన్నాడు కపిల్ దేవ్.

ప్రపంచ కప్ దగ్గరలో ఉన్న కారణంగా రోహిత్, విరాట్ లకు విశ్రాంతి ఇచ్చింది టీం ఇండియా. ఆస్ట్రేలియా తో జరిగిన మొదటి వన్ డే మ్యాచ్ కు వీరిద్దరూ దూరమయ్యారు. 277 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన టీం ఇండియా కు శుభమన్ గిల్, ఋతురాజ్ గాయిక్వాడ్ మంచి ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ మొదటి వికెట్ కు 140 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. తరువాత బ్యాట్టింగ్ కు వచ్చిన రాహుల్ (58) , సూర్య కుమార్ (50) అర్ధ శతకాలతో చెలరేగడంతో, టీం ఇండియా 48.4  ఓవర్లకు 281 పరుగులు సాధించి విజయం సొంతం చేసుకుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

లియో: లోకేష్ బ్రిలియంట్ డెసిషన్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>