DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/war231b46e3-d011-4f74-afc6-3e409cbb81a1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/war231b46e3-d011-4f74-afc6-3e409cbb81a1-415x250-IndiaHerald.jpgరష్యా ఉక్రెయిన్ యుద్ధం ఏడాదిన్నరగా కొనసాగుతూనే ఉంది. బాగుపుత్ అనే కీలక ప్రాంతాన్ని రష్యా చాలా రోజుల కిందటే స్వాధీనం చేసుకుంది. అక్కడ ఉక్రెయిన్, రష్యా సేనలకు భీకర యుద్ధం సాగింది. చివరకు ఆ దేశం రష్యా దాడులకు తలవంచక తప్పలేదు. ఉక్రెయిన్ లో అన్ని ప్రాంతాలకు మధ్యలో ఉండడం వల్ల బాగ్ పుత్ కీలకంగా మారింది. ఎలాగైనా దాన్ని స్వాధీనం చేసుకోవాలని రష్యా భావించింది. ఉక్రెయిన్ తో యుద్దం తర్వాత ఎక్కువ మంది సైనికుల్ని కూడా ఈ ప్రాంతంలోనే పోగోట్టుకోవాల్సి వచ్చింది. అంతటి భీకర యుద్ధం సాగింది. అనంతరం బాగ్ పుత్ ప్రాంతWAR{#}Russia;Ukraine;Success;Europe countries;warఊహించని విధంగా రష్యాకు దెబ్బకొట్టిన ఉక్రెయిన్‌?ఊహించని విధంగా రష్యాకు దెబ్బకొట్టిన ఉక్రెయిన్‌?WAR{#}Russia;Ukraine;Success;Europe countries;warSat, 23 Sep 2023 05:00:00 GMTరష్యా ఉక్రెయిన్ యుద్ధం ఏడాదిన్నరగా కొనసాగుతూనే ఉంది. బాగుపుత్ అనే కీలక ప్రాంతాన్ని రష్యా చాలా రోజుల కిందటే స్వాధీనం చేసుకుంది. అక్కడ ఉక్రెయిన్, రష్యా సేనలకు భీకర యుద్ధం సాగింది. చివరకు ఆ దేశం రష్యా దాడులకు తలవంచక తప్పలేదు. ఉక్రెయిన్ లో అన్ని ప్రాంతాలకు మధ్యలో ఉండడం వల్ల బాగ్ పుత్ కీలకంగా మారింది.


ఎలాగైనా దాన్ని స్వాధీనం చేసుకోవాలని రష్యా భావించింది. ఉక్రెయిన్ తో యుద్దం తర్వాత ఎక్కువ మంది సైనికుల్ని కూడా ఈ ప్రాంతంలోనే పోగోట్టుకోవాల్సి వచ్చింది. అంతటి భీకర యుద్ధం సాగింది. అనంతరం బాగ్ పుత్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నామని రష్యా ఎప్పుడో ప్రకటించింది. అయితే దీనికి భిన్నంగా ఉక్రెయిన్ బాగ్ పుత్ ప్రాంతంలోని కొన్ని ఊర్లను తిరిగి మా అధీనంలోకి తెచ్చుకున్నామని ప్రకటించారు.


బాగ్ పుత్ లోని చాలా గ్రామాలు తమ అధీనంలోనే ఉన్నాయని వీడియోలను ఉక్రెయిన్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. దీంతో రష్యా కంగుతింది. ఉక్రెయిన్ అబద్ధాలు చెబుతోందని బాగ్ పుత్ ప్రాంతం మొత్తం మా ఆధీనంలోనే ఉందని తెలిపారు. అయితే రష్యా అధీనంలో ఉంటే అక్కడ మళ్లీ ఆయుధాలు, యుద్ధ సామగ్రి ఎందుకు కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యుద్ధం ప్రారంభం అయిన ఆరు నెలల వరకు ఉక్రెయిన్ పై రష్యా దే పై చేయి.


కానీ ప్రస్తుతం అమెరికాతో పాటు యూరప్ దేశాలు సరికొత్త నూతన ఆయుధాలు అందిస్తుండటంతో వాటితో ఏకంగా రష్యాలోని భూ భాగాలపై ఉక్రెయిన్ రివర్స్ ఎటాక్ చేస్తోంది. దీంతో ఇన్ని రోజులు తమ దేశ భూభాగాలను కాపాడుకునేందుకు ప్రయత్నించిన ఉక్రెయిన్ రివర్స్ ఎటాకింగ్ విధానంతో సక్సెస్ అవుతోంది. రష్యా స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో తిరిగి దాడులు చేస్తూ ముందుకు సాగుతోంది. బాగ్ పుత్ ను ఉక్రెయిన్ పూర్తిగా  మళ్లీ స్వాధీనం చేసుకుంటుందో లేదో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గోదావరి : ఇద్దరిలో భయం పెరిగిపోతోందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>