Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyledd9c623e-3b0c-484b-b480-d212234d1346-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyledd9c623e-3b0c-484b-b480-d212234d1346-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ బెదురులంక 2012.ఫన్ థ్రిల్లర్‌ గా రూపొందిన ఈ సినిమాతో క్లాక్స్ డైరెక్టర్‌ గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆగస్ట్ 25న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజైన బెదురులంక 2012 మూవీ కమర్షియల్ సక్సెస్‌ గా నిలిచింది.నాలుగు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ సినిమా ఏడు కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు మంచి లాభాల్ని తెచ్చిపెట్టింది.చాలా రోజుల తర్వాత హీరో కార్తికేయ ఈ సినిమాతో మంచి హిట్‌ ను అందుకున్నాడు.అయితే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా శుకsocialstars lifestyle{#}ajay;mani sharma;neha shetty;satya;Friday;srikanth;Comedy;Shiva;lord siva;Leader;News;Director;Hero;Cinemaసైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న మూవీ...!!సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న మూవీ...!!socialstars lifestyle{#}ajay;mani sharma;neha shetty;satya;Friday;srikanth;Comedy;Shiva;lord siva;Leader;News;Director;Hero;CinemaFri, 22 Sep 2023 23:39:00 GMTటాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ బెదురులంక 2012.ఫన్ థ్రిల్లర్‌ గా రూపొందిన ఈ సినిమాతో క్లాక్స్ డైరెక్టర్‌ గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆగస్ట్ 25న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజైన బెదురులంక 2012 మూవీ కమర్షియల్ సక్సెస్‌ గా నిలిచింది.నాలుగు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ సినిమా ఏడు కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు మంచి లాభాల్ని తెచ్చిపెట్టింది.చాలా రోజుల తర్వాత హీరో కార్తికేయ ఈ సినిమాతో మంచి హిట్‌ ను అందుకున్నాడు.అయితే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా శుక్రవారం అమెజాన్ ప్రైమ్‌ లో ఈ మూవీ రిలీజైంది.అయితే థియేటర్లలో విడుదలై నెల రోజులు కూడా కాకముందే బెదురులంక 2012 మూవీ ఓటీటీ లోకి రావడం విశేషం.

విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో యంగ్ హీరో కార్తికేయ సరసన నేహా శెట్టి హీరోయిన్‌గా నటించింది.అలాగే ఈ సినిమాలో అజయ్ ఘోష్‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, సత్య ముఖ్య పాత్రల్ని పోషించారు.2012 లో యుగాంతం పుకార్ల కారణం గా బెదురులంక అనే ఊరి ప్రజలు బాగా భయాందోళనలకు గురవుతుంటారు. ప్రజల్లోని భయం, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని భూషణం (అజయ్ ఘోష్‌) అనే లీడర్ ఊరిని దోచుకోవాలని పక్కా ప్లాన్ చేస్తాడు. అతడి ప్లాన్ ను శివ (కార్తికేయ) ఎలా ఎదురించాడు..ఈ క్రమంలో అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. అలాగే ఊరి ప్రెసిడెంట్ కూతురు చిత్ర తో (నేహాశెట్టి) శివ ప్రేమాయణం ఎలా మొదలైందన్నదే బెదురులంక 2012 మూవీ కథ.

ఈ సినిమాలో కామెడీతో పాటు  ఓ చిన్న మెసేజ్‌ను కూడా డైరెక్టర్ క్లాక్స్ బెదురులంక 2012 మూవీని అద్భుతంగా తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా కు  మణిశర్మ సంగీతాన్ని అందించాడు.థియేటర్స్ లో మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీలో ఏవిధంగా అదరగొడుతుందో చూడాలి..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గోదావరి : ఇద్దరిలో భయం పెరిగిపోతోందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>