Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/india6f3d7e37-2e59-44ca-b74e-47c171debd4a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/india6f3d7e37-2e59-44ca-b74e-47c171debd4a-415x250-IndiaHerald.jpgఅక్టోబర్ 5వ తేదీ నుంచి భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. ఇక ఈ ప్రపంచం కోసం అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. అయితే భారత జట్టు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగపోతుంది. అయితే ఇటీవలే ఆసియా కప్ లో భాగంగా అద్భుతమైన ప్రదర్శన చేసి ఏకంగా టైటిల్ విన్నర్ గా నిలిచింది. దీంతో భారత జట్టు ఆత్మవిశ్వాసంతో ఉంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో అటు వన్డే సిరీస్ ఆడటానికి సిద్ధమైంది టీం ఇండియా. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ నేటి నుంచి ప్రారIndia{#}Cricket;Winner;Australia;World Cup;Indiaభారత్ పై ఆసిస్ దే పైచేయి.. మరి ఇప్పుడేం జరుగుతుందో?భారత్ పై ఆసిస్ దే పైచేయి.. మరి ఇప్పుడేం జరుగుతుందో?India{#}Cricket;Winner;Australia;World Cup;IndiaFri, 22 Sep 2023 07:29:00 GMTఅక్టోబర్ 5వ తేదీ నుంచి భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. ఇక ఈ ప్రపంచం కోసం అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. అయితే భారత జట్టు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగపోతుంది. అయితే ఇటీవలే ఆసియా కప్ లో భాగంగా అద్భుతమైన ప్రదర్శన చేసి ఏకంగా టైటిల్ విన్నర్ గా నిలిచింది. దీంతో భారత జట్టు ఆత్మవిశ్వాసంతో ఉంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో అటు వన్డే సిరీస్ ఆడటానికి సిద్ధమైంది టీం ఇండియా. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ నేటి నుంచి ప్రారంభం కాబోతుంది. మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు మొదలవుతుంది.


 ఈ క్రమంలోనే రెండు పటిష్టమైన టీమ్స్ తలబడుతూ ఉండడం.. అది కూడా వరల్డ్ కప్ కి ముందు జరుగుతున్న మ్యాచ్ కావడంతో ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఆస్ట్రేలియా, భారత్ ఎప్పుడు తలపడిన కూడా ఇక పోరు హోరాహోరీ గానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. నువ్వా నేనా అన్నట్లుగానే చివరి వరకు మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు వన్డే ఫార్మాట్లో ఈ రెండు టీమ్స్ మధ్య సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో పాత గణాంకాలు ఎలా ఉన్నాయి అన్నది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.


 అయితే ఒకసారి పాత గణాంకాలు చూసుకుంటే.. వన్డే ఫార్మాట్లో టీమ్ ఇండియా పై ఆస్ట్రేలియా ఆదిపత్యం కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. ఇప్పటివరకు ఇరుజట్ల మధ్య 146 వన్డే మ్యాచ్లు జరిగాయి. అయితే వీటిలో ఆస్ట్రేలియా 82 మ్యాచ్లలో విజయం సాధిస్తే.. భారత్ కేవలం 54 మ్యాచ్ లలో మాత్రమే విజయం సాధించింది. మరో 10 మ్యాచ్లు ఫలితం తేలలేదు. అయితే భారత్ వేదికగా ఇరు జట్లు కూడా 67 సార్లు తలపడగా.. కంగారులు 32 సార్లు విజయం సాధిస్తే.. టీమ్ ఇండియా 30 సార్లు విజయం సాధించింది అని చెప్పాలి. ఐదు మ్యాచ్ లలో ఫలితం తేలలేదు. ఇలా మొత్తంగా భారత్ పై ఆస్ట్రేలియాదే పైచేయి ఉంది. మరి ఆసియా కప్ గెలిచిన ఆత్మవిశ్వాసంతో ఉన్న టీమిండియా ఇప్పుడు ఆస్ట్రేలియాపై ఎలాంటి ప్రదర్శన చేయబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మరో ఫ్లాప్ దర్శకుడికి.. ఛాన్స్ ఇచ్చిన గోపీచంద్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>