PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-assembly-chandrababub8cc7a9c-da9b-41d3-9d71-a4203d0da9e6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-assembly-chandrababub8cc7a9c-da9b-41d3-9d71-a4203d0da9e6-415x250-IndiaHerald.jpgఅయితే ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయటం అన్న అంశం ప్రముఖంగా చర్చనీయాంశం కాకుండా జాగ్రత్తపడుతున్నారు. రాజీనామా అంశం ఆచరణలో కాకుండా కేవలం ప్రచారంలో మాత్రం ఉండేట్లుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎందుకంటే నిజంగానే రాజీనామాలు చేస్తే మొదటికే మోసం వస్తుందేమో అన్న భయం కూడా చాలామందిలో ఉంది. షెడ్యూల్ ఎన్నికలు మరో తొమ్మిదినెలల్లోకి వచ్చేసింది. ఈ దశలో రాజీనామాలు అంటే కష్టమనే అభిప్రాయం చాలామందిలో ఉందట.tdp assembly chandrababu{#}రాజీనామా;sub elections;Sasanamandali;Elections;MP;Government;Lokesh;Lokesh Kanagaraj;TDP;Assembly;CBN;Partyఅమరావతి : సింపతి కోసం తమ్ముళ్ళ ప్లాన్అమరావతి : సింపతి కోసం తమ్ముళ్ళ ప్లాన్tdp assembly chandrababu{#}రాజీనామా;sub elections;Sasanamandali;Elections;MP;Government;Lokesh;Lokesh Kanagaraj;TDP;Assembly;CBN;PartyFri, 22 Sep 2023 09:00:00 GMT



గురువారం నుండి జరగబోతున్న అసెంబ్లీ సమావేశాలను అడ్డంపెట్టుకుని టీడీపీ నేతలు సింపతి కోసం ప్లాన్ చేస్తున్నారు. అసెంబ్లీ, శాసనమండలి సమావేశాల్లో చంద్రబాబునాయుడు అరెస్టునే ప్రధాన అజెండాగా తీసుకోవాలని లోకేష్ ఆదేశించారు. పార్టీ ఆఫీసులో ఎంఎల్ఏలు, ఎంఎల్సీలతో లోకేష్ జూమ్ మీటింగులో పాల్గొన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై చర్చనే ఏకైక అజెండాగా చేసుకోవాలని చెప్పారు. ఇందుకు ప్రభుత్వం వైపు నుండి అభ్యంతరాలు వచ్చినాసరే పట్టించుకోకూడదని కూడా చెప్పారు.





లోకేష్ చెప్పిందాని ప్రకారం చూస్తే ఉభయసభలను సజావుగా జరిగేందుకు టీడీపీ ఏమాత్రం సహకరించదన్న విషయం అర్ధమైపోయింది. కావాలనే సభల్లో గలబాచేసి, సస్పెండ్ చేయించుకుని అప్పుడు రోడ్లపైకి ఎక్కాలన్నది అసలు వ్యూహంగా అర్ధమవుతోంది. అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశార్నన పాయింట్ మీద  ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు జనాల్లోకి వెళ్ళేట్లుగా కార్యాచరణ రెడీ అవుతోందని పార్టీవర్గాలు చెప్పాయి. చంద్రబాబు అరెస్టు, రిమాండ్ అంశం ఆధారంగానే ఎంఎల్ఏలు, ఎంఎల్సీలతో పాటు ఎంపీలు కూడా రాజీనామాలు చేస్తే ఎలాగుంటుందన్న ఆలోచన కూడా ఉందని పార్టీ వర్గాలు చెప్పాయి.





అయితే  ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయటం అన్న అంశం ప్రముఖంగా చర్చనీయాంశం కాకుండా జాగ్రత్తపడుతున్నారు. రాజీనామా అంశం ఆచరణలో కాకుండా కేవలం ప్రచారంలో మాత్రం ఉండేట్లుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎందుకంటే నిజంగానే రాజీనామాలు చేస్తే మొదటికే మోసం వస్తుందేమో అన్న భయం కూడా చాలామందిలో ఉంది. షెడ్యూల్ ఎన్నికలు మరో తొమ్మిదినెలల్లోకి వచ్చేసింది. ఈ దశలో రాజీనామాలు అంటే కష్టమనే అభిప్రాయం చాలామందిలో ఉందట.





మామూలుగా అంటే ఇంతకుముందే రాజీనామాలు చేసుంటే అప్పుడు ఉపఎన్నికలు వచ్చుండేవి కానీ ఇపుడు రాజీనామాలు అంటే ఉపఎన్నికలు అనుమానమే అని పార్టీలో చర్చ జరుగుతున్నది. తొమ్మిది నెలల్లో షెడ్యూల్ ఎన్నికలు పెట్టుకుని ఇపుడు రాజీనామాలు చేసినా ఉపఎన్నికలు రావని, వచ్చినా గెలుపు కూడా అనుమానమే అనే చర్చ నడుస్తోందని పార్టీవర్గాలు చెప్పాయి. కాబట్టి రాజీనామాల దాకా విషయం వెళ్ళకుండా చంద్రబాబు అరెస్టును ఎంతవీలుంటే అంత రాజకీయంగా ప్రచారం కోసం ఉపయోగించుకోవాలని మాత్రమే పార్టీ పెద్దలు డిసైడ్ చేశారు. దానికి అసెంబ్లీ సమావేశాలను వేదికగా చేసుకోబోతున్నారు.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మరో ఫ్లాప్ దర్శకుడికి.. ఛాన్స్ ఇచ్చిన గోపీచంద్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>