Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/murder-0fb698ea-dbb6-4824-955d-a4da36442e71-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/murder-0fb698ea-dbb6-4824-955d-a4da36442e71-415x250-IndiaHerald.jpgనేటి ఆధునిక సమాజంలో మనిషి జీవనశైలిలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇక టెక్నాలజీకి అలవాటు పడిపోయిన మనిషి.. ప్రతి పనిని కూడా సులభంగా మార్చుకుంటున్నాడు. అయితే అంతా బాగానే ఉంది. కానీ అటు మనిషిలో మార్పు రావడం.. మానవత్వాన్ని పూర్తిగా కనుమరుగ అయ్యేలా చేస్తూ ఉందా అంటే వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా అవును అనే భావన కలుగుతుంది. ఎందుకంటే ఒకప్పుడు ముక్కు ముఖం తెలియని మనిషికి.. కష్టం వస్తేనే అయ్యో పాపం అంటూ సహాయం చేయడానికి సిద్ధపడేవాడు మనిషి. కానీ ఇప్పుడు సొంత వారి విషయంలో కూడా కాస్తయMurder {#}Ananthapuram;Petrol;Avunu;Andhra Pradesh;Hyderabad;Father;job;News;bhavana;policeతల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించి చంపిన కొడుకు.. కారణం ఏంటో తెలుసా?తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించి చంపిన కొడుకు.. కారణం ఏంటో తెలుసా?Murder {#}Ananthapuram;Petrol;Avunu;Andhra Pradesh;Hyderabad;Father;job;News;bhavana;policeFri, 22 Sep 2023 10:15:00 GMTనేటి ఆధునిక సమాజంలో మనిషి జీవనశైలిలో  ఎన్నో మార్పులు వచ్చాయి. ఇక టెక్నాలజీకి అలవాటు పడిపోయిన మనిషి.. ప్రతి పనిని కూడా సులభంగా మార్చుకుంటున్నాడు. అయితే అంతా బాగానే ఉంది. కానీ అటు మనిషిలో మార్పు రావడం.. మానవత్వాన్ని పూర్తిగా కనుమరుగ అయ్యేలా చేస్తూ ఉందా అంటే వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా అవును అనే భావన కలుగుతుంది. ఎందుకంటే ఒకప్పుడు ముక్కు ముఖం తెలియని మనిషికి.. కష్టం వస్తేనే అయ్యో పాపం అంటూ సహాయం చేయడానికి సిద్ధపడేవాడు మనిషి.


 కానీ ఇప్పుడు సొంత వారి విషయంలో కూడా కాస్తయినా జాలీ దయ మానవత్వం చూపించకుండా కర్కశంగా ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత సొంతవారి నుంచి కూడా ప్రాణహాని ఉంటుందేమో అనే భయం లోనే ప్రతి ఒక్కరు కూడా బ్రతుకుతున్నారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. కంబదూరులో ఉభయ కాలనీకి చెందిన గోపీనాథ్, సుజాతమ్మా దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నాడు.


 అయితే ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు అయ్యాయి. ఇక వారు ఉద్యోగం చేస్తూ స్థిరపడ్డారు. అయితే కొడుకు ప్రణీత్ ఇంటర్ తర్వాత చదువు మానేసి హైదరాబాద్ నుండి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. ఈ క్రమంలోనే మద్యానికి బానిసగా మారాడు. ఇటీవలే ఉద్యోగం మానేసి ఇంటికి వచ్చాడు. ప్రతిరోజు మద్యం తాగుతూ ఉండేవాడు. ఇటీవల మద్యం కోసం డబ్బులు కావాలని తల్లిదండ్రులను వేధించడం మొదలుపెట్టాడు. కాగా మంచంలో అనారోగ్యంతో పడి ఉన్న తల్లిని మద్యం కోసం డబ్బు అడిగాడు. ఆమె తన వద్ద లేవు అంటూ చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయిన కొడుకు.. తల్లి పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. చుట్టుపక్కల వారు గమనించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించిన అప్పటికే సుజాతము మృతి చెందింది. ఈ విషయం తెలిసి తండ్రి కన్నీరు మున్నీరుగా రోదించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిందితున్ని అరెస్టు చేశారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మరో ఫ్లాప్ దర్శకుడికి.. ఛాన్స్ ఇచ్చిన గోపీచంద్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>