Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle06fdd6d2-a142-4d34-9cb9-a82d475207b3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle06fdd6d2-a142-4d34-9cb9-a82d475207b3-415x250-IndiaHerald.jpgమనం కొన్ని ఫోటోలు చూసినప్పుడు మన జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకు వస్తాయి, పదే పదే అదే పిక్ని చూడాలనిపిస్తుంది, అదొక అద్భుతం లా కనిపిస్తుంది. అలాంటి మూడు లక్షణాలు ఉన్న ఈ పై పిక్ చూడండి.ఆకాశం, సముద్రం, పడవలతో కూడిన ఈ పిక్ ను కాన్సన్ట్రేషన్ చేసి చూస్తే టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన ఎన్టీఆర్ ముఖంల కనిపిస్తుంది. గమనించారా? ఎస్ ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట అందరినీ ఆకట్టుకుంటుంది.. ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నెటిజన్లు, ఎన్టీఆర్ అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ ఫోటోకు ఆకర్షితులయ్యారు. ఈ ఫోటో రూపకరsocialstars lifestyle{#}srinivas;Aly Khan;media;NTR;bollywood;Bahubali;Hero;Tollywood;Cinemaయంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్ ని పోలి ఉన్న సముద్రతీరం....!!యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్ ని పోలి ఉన్న సముద్రతీరం....!!socialstars lifestyle{#}srinivas;Aly Khan;media;NTR;bollywood;Bahubali;Hero;Tollywood;CinemaFri, 22 Sep 2023 23:09:00 GMTమనం కొన్ని ఫోటోలు చూసినప్పుడు మన జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకు వస్తాయి, పదే పదే అదే పిక్ని చూడాలనిపిస్తుంది, అదొక అద్భుతం లా కనిపిస్తుంది. అలాంటి మూడు లక్షణాలు ఉన్న ఈ పై పిక్ చూడండి.ఆకాశం, సముద్రం, పడవలతో కూడిన ఈ పిక్ ను కాన్సన్ట్రేషన్ చేసి చూస్తే టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన ఎన్టీఆర్ ముఖంల కనిపిస్తుంది. గమనించారా? ఎస్ ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట అందరినీ ఆకట్టుకుంటుంది.. ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నెటిజన్లు, ఎన్టీఆర్ అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ ఫోటోకు ఆకర్షితులయ్యారు.

ఈ ఫోటో రూపకర్త మరెవరో కాదు ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ శ్రీనివాస్ మోహన్. ఈయన గతంలో టు ఓ, బాహుబలి ది బిగినింగ్, రోబో, ఆర్‌ఆర్ఆర్ లాంటి ఎన్నో భారీ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ పర్యవేక్షకుడుగా వ్యవహరించాడు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇల్యూషన్ టూల్స్ సహాయంతో సముద్రపు తీరాన పడవలు.. ఆకాశం తో ఎన్టీఆర్ చాయ కనిపించే విధంగా ఈ పిక్ని తీర్చిదిద్దాడు. సోషల్ మీడియా వేదికగా ఈ పిక్ షేర్ చేయగా నిమిషాల్లోనే లక్షల్లో లైక్స్ సొంతం చేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాలశివ కాంబోలో దేవర సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.

సముద్రతీరం బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న ఈ సినిమాలో తీసిన ఓ సంబంధిత లొకేషన్ పిక్ ను ఏఐ సాంకేతికత ద్వారా ఎన్టీఆర్ ఫేస్ కనిపించేలా శ్రీనివాస్ మోహన్ క్రియేట్ చేసినట్లు సమాచారం. ఫోటోనే ఇంత ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది అంటే ఇంక మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో అనే ఆసక్తి ఎన్టీఆర్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మొదలైంది. ఇక ఈ సినిమాలో భయం తెలియని వాళ్లకు భయాన్ని చూపించే ఓ శక్తివంతమైన క్యారెక్టర్ లో ఎన్టీఆర్ నటించబోతున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్గా, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ వాలన్ రోల్‌లో నటించబోతున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక భారీ హైప్‌తో రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రేక్షకుల్లో ఎటువంటి రెస్పాన్స్ సంపాదించుకుంటుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సైలెంట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న మూవీ...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>