MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood15aa54fd-5d7a-491b-8055-a2983aaeda07-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood15aa54fd-5d7a-491b-8055-a2983aaeda07-415x250-IndiaHerald.jpgమంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాను ఇటివల అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు నెలలో శ్రీకాళహస్తిలో పూజా కార్యక్రమాలతో లాంచనంగా ప్రారంభించారు. సీనియర్ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ ప్రాజెక్టుని స్వయంగా నిర్మిస్తున్నారు. అంతేకాదు ఒక కీలకపాత్రలో సైతం ఆయన కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. శివ భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. హిందీ మహాభారతం సీరియల్ కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ మంచి విష్ణు డ్రీం ప్రాజెక్టు 'కన్నప్ప' ను తెరకెక్కిస్తున్నారు. tollywood{#}jeevitha rajaseskhar;lord siva;Shiva;manchu vishnu;Pooja Hegde;Mukesh;Dussehra;Vijayadashami;Prabhas;CBN;vishnu;king;King;Hindi;Ravi;ravi teja;bollywood;Tollywood;Chitram;media;Cinema;Heroine;India;Newsమంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' నుండి తప్పుకున్న కృతి సనన్ సోదరి..ఎందుకంటే..?మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' నుండి తప్పుకున్న కృతి సనన్ సోదరి..ఎందుకంటే..?tollywood{#}jeevitha rajaseskhar;lord siva;Shiva;manchu vishnu;Pooja Hegde;Mukesh;Dussehra;Vijayadashami;Prabhas;CBN;vishnu;king;King;Hindi;Ravi;ravi teja;bollywood;Tollywood;Chitram;media;Cinema;Heroine;India;NewsFri, 22 Sep 2023 15:35:00 GMTపూజా కార్యక్రమాలతో లాంచనంగా ప్రారంభించారు. సీనియర్ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ ప్రాజెక్టుని స్వయంగా నిర్మిస్తున్నారు. అంతేకాదు ఒక కీలకపాత్రలో సైతం ఆయన కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.  శివ భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. హిందీ మహాభారతం సీరియల్ కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ మంచి విష్ణు డ్రీం ప్రాజెక్టు 'కన్నప్ప' ను తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో పాన్ ఇండియా హీరో ప్రభాస్ సైతం ఓ ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ నుపుర్ సనన్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే కదా. రీసెంట్ గా జరిగిన పూజా కార్యక్రమాలకు కూడా నుపుర్ సనన్ హాజరయ్యారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు ఈ ప్రాజెక్టు నుండి ఆమె తప్పుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మంచు విష్ణు స్వయంగా తెలియజేశారు. ఈ మేరకు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.." దురదృష్టం. లవ్లీ లేడీ నుపుర్ సనన్ కన్నప్ప ప్రాజెక్టు నుండి తప్పుకున్నారు. మరొక హీరోయిన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. షెడ్యూల్స్ కి నుపుర్ సనన్ డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడమే కారణం. ఆమె ఇతర ప్రాజెక్టుకి ఆల్ ది బెస్ట్" అని తన సోషల్ మీడియా  లో పేర్కొన్నారు మంచు విష్ణు. 

దీంతో ఈ   పోస్ట్   కాస్త నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో నుపుర్ సనన్ స్థానంలో ఏ హీరోయిన్ ని మేకర్స్ ఫైనల్ చేస్తారనేది చూడాలి. రవితేజ నటిస్తున్న 'టైగర్ నాగేశ్వరావు' సినిమాతో నుపుర్ సనన్ టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. దసరా కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరోవైపు 'కన్నప్ప'లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కీలకపాత్ర పోషిస్తున్నారనే విషయంతో ఈ ప్రాజెక్టుపై ఒక్కసారిగా హైప్ పెరిగింది. సినిమాలో ప్రభాస్ శివుడిగా కనిపించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అదే కనుక నిజమైతే కన్నప్ప సినిమాకు ఇది చాలా ప్లస్ అవుతుందని అంటున్నారు. 





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సలార్: ఫ్యాన్స్ కి గుండె పగిలే న్యూస్.. ఇప్పట్లో నో రిలీజ్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>