MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood9115f6c0-1c76-4808-8c65-c3cf4802e649-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood9115f6c0-1c76-4808-8c65-c3cf4802e649-415x250-IndiaHerald.jpgతెలుగు ఓటీటీ ఆహా ప్రేక్షకులను ఎంతలా అలరిస్తుందో అందుకీ తెలిసిందే. కొత్త సినిమాలను రిలీజ్ చేయడమే కాకుండా కంటెంట్ ఉన్న సిరీస్లను సైతం నిర్మిస్తోంది. డాన్స్ సింగింగ్ రియాలిటీ షోలు ప్లాన్ చేస్తూ ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఇప్పటికే 'ఆహా' నిర్మాణంలో రూపొందిన పలు వెబ్ సిరీస్ లు మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి. ఇప్పుడు త్వరలోనే ఆహా లో మరో సిరీస్ రాబోతోంది. 'పాపం పసివాడు' అనే పేరుతో ఓ సిరీస్ ని రూపొందిస్తున్నట్లు ఆహా ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్లే బ్యాక్ సింగర్, ఇండియన్ ఐడల్ 5విన్నర్ tollywood{#}Sreerama Chandra;maharshi;raasi;Maharshi;NTR Kathanayakudu;Indian Idol;Kurradu;Play back;prema;Romantic;Love;september;Audience'పాపం పసివాడు' ఒరిజినల్ సిరీస్ నుండి సాంగ్ రిలీజ్..!?'పాపం పసివాడు' ఒరిజినల్ సిరీస్ నుండి సాంగ్ రిలీజ్..!?tollywood{#}Sreerama Chandra;maharshi;raasi;Maharshi;NTR Kathanayakudu;Indian Idol;Kurradu;Play back;prema;Romantic;Love;september;AudienceFri, 22 Sep 2023 13:20:22 GMTఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఇప్పటికే 'ఆహా' నిర్మాణంలో రూపొందిన పలు వెబ్ సిరీస్ లు మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి. ఇప్పుడు త్వరలోనే ఆహా లో మరో సిరీస్ రాబోతోంది. 'పాపం పసివాడు' అనే పేరుతో ఓ సిరీస్ ని రూపొందిస్తున్నట్లు ఆహా ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్లే బ్యాక్ సింగర్, ఇండియన్ ఐడల్ 5విన్నర్ శ్రీరామచంద్ర ఈ సిరీస్ లో ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. రాశి సింగ్, గాయత్రి చాగంటి, శ్రీవిద్య, మహర్షి కీలకపాత్రలు పోషిస్తున్నారు. 

ఫుల్ ఫన్ తో సాగే ఈ సిరీస్ సెప్టెంబర్ 29న ఆహా ఓటీటీలో విడుదల కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ఈ సిరీస్ పై ఆసక్తిని కలిగించింది. తాజాగా 'పాపం పసివాడు' ఒరిజినల్ లోని సాంగ్ ను రిలీజ్ చేశారు. ది వీకెండ్ షో నిర్మాణంలో రూపొందిన ఈ సిరీస్ లో మొత్తం ఐదు ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రేమలో చిక్కుకున్న ఓ యువకుడి జీవితంలో ఎలాంటి గందరగోళం క్రియేట్ అయింది అనే విషయాన్ని ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసేలా తెరకెక్కించారు. అంతేకాకుండా సిరీస్ లోని పాత్రలను చూపిస్తూనే భావోద్వేగ ప్రయాణాన్ని ఈ పాటలో ఆవిష్కరించారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ ని అందుకుంటుంది. 

సెప్టెంబర్ 29న నుంచి 'ఆహా' లో స్ట్రీమింగ్ కాబోయే ఈ సిరీస్ కచ్చితంగా ప్రేక్షకులకు కావాల్సినంత భావోద్వేగాలు, నవ్వులను తప్పకుండా అలరిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. 'పాపం పసివాడు' సిరీస్ విషయానికొస్తే.. ఇందులో ఓ పాతికేళ్ల కుర్రాడు అయినా మన కథానాయకుడు క్రాంతి ప్రేమ కోసం హృదయమంత బాధతో పరిసపిస్తూ ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే ఉన్నట్టుండి ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు అమ్మాయిలు అతని జీవితంలో ప్రవేశిస్తారు. దీంతో అతని జీవితంలో ఊహించని సంఘటనలు జరుగుతాయి. అతని జీవితం అనేక మలుపులు తిరుగుతుంది. వీళ్ళ రొమాంటిక్ జర్నీ చుట్టూ కథ నడుస్తున్నప్పుడు తెలియని గందరగోళం క్రియేట్ అవుతుంది. 





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సలార్: ఫ్యాన్స్ కి గుండె పగిలే న్యూస్.. ఇప్పట్లో నో రిలీజ్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>