Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayyafb661926-3281-4146-97c9-201a447fcae6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayyafb661926-3281-4146-97c9-201a447fcae6-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో తొలితరం నటుల్లో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు భౌతికంగా చిత్ర పరిశ్రమకు దూరమైనప్పటికీ ఇంకా తెలుగు ప్రేక్షకుల హృదయాలకు మాత్రం దగ్గరగానే ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఆయన సినిమాలు మాత్రం ఇంకా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. అయితే ఇటీవల అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలను ఆయన తనయుడు అక్కినేని నాగార్జున ఎంతో ఘనంగా నిర్వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏఎన్ఆర్ విగ్రహావిష్కరణతో ఇక ఈ శత జయంతి వేడుకలకు శ్రీకారం చుట్టారు అని చెప్పాలి. కాగా అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకBalayya{#}venkaiah naidu;Akkineni Nagarjuna;Jayanthi;Akkineni Nageswara Rao;annapurna;Telugu;Tollywood;Event;Balakrishnaఅక్కినేని ఈవెంట్ కు రాని బాలయ్య.. కారణం అదేనా?అక్కినేని ఈవెంట్ కు రాని బాలయ్య.. కారణం అదేనా?Balayya{#}venkaiah naidu;Akkineni Nagarjuna;Jayanthi;Akkineni Nageswara Rao;annapurna;Telugu;Tollywood;Event;BalakrishnaFri, 22 Sep 2023 10:30:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో తొలితరం నటుల్లో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు భౌతికంగా చిత్ర పరిశ్రమకు దూరమైనప్పటికీ ఇంకా తెలుగు ప్రేక్షకుల హృదయాలకు మాత్రం దగ్గరగానే ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఆయన సినిమాలు మాత్రం ఇంకా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. అయితే ఇటీవల అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలను ఆయన తనయుడు అక్కినేని నాగార్జున ఎంతో ఘనంగా నిర్వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏఎన్ఆర్ విగ్రహావిష్కరణతో ఇక ఈ శత జయంతి వేడుకలకు శ్రీకారం చుట్టారు అని చెప్పాలి.


 కాగా అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఏఎన్ఆర్ పంచలోహ విగ్రహ ఆవిష్కరణ వెంకయ్య నాయుడు చేతుల మీదుగానే జరిగింది. అయితే ఇక ఈవెంట్ కి అటు సినీ రాజకీయ ప్రముఖులందరూ కూడా హాజరయ్యారు అని చెప్పాలి. ఇక టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఉన్న అన్ని ఫ్యామిలీల నుంచి కుటుంబ సభ్యులు వచ్చారు. కానీ ఒక్క నందమూరి ఫ్యామిలీ నుంచి మాత్రం ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో కనిపించలేదు. ముఖ్యంగా అన్ని ఈవెంట్స్ కి హాజరయ్యే బాలయ్య.. అక్కినేని ఈవెంట్ కి మాత్రం హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారిపోయింది.


 దీంతో బాలయ్య ఎందుకు రాలేదు అన్న చర్చ తెరమిదికి రాగా ఒక ఆసక్తికర కారణం వైరల్ గా మారిపోయింది. బాలయ్య అక్కినేని విగ్రహావిష్కరణకు హాజరు కాకపోవడానికి నాగార్జునతో ఉన్న విభేదాలు కారణం అంటూ ప్రచారం జరుగుతుంది. బాలయ్య, నాగార్జున ఎప్పుడు ఎక్కడ కలిసి మాట్లాడుకుంది లేదు. వీరిద్దరి మధ్య ఇంత వైరం ఎందుకు వచ్చింది అసలు ఎక్కడ వీరిద్దరికి చెడింది అనే అంశంపై ఎవరికి క్లారిటీ లేదు. అయితే ఇటీవల వీర సింహారెడ్డి ఈవెంట్లో బాలయ్య అక్కినేని తొక్కినేని అని కామెంట్ చేయడం పెద్ద వివాదం అయింది. బాలయ్య ఈవెంట్స్ కి నాగార్జున.. నాగార్జున ఈవెంట్స్ కి బాలయ్య చాలా రోజుల నుంచి హాజరు కావట్లేదు. ఇప్పుడు బాలయ్య రాకపోవడంతో మరోసారి ఈ వార్త వైరల్ గా మారింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మరో ఫ్లాప్ దర్శకుడికి.. ఛాన్స్ ఇచ్చిన గోపీచంద్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>