Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleb4d765dd-adf1-4863-9c4b-a1139fcc7a46-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleb4d765dd-adf1-4863-9c4b-a1139fcc7a46-415x250-IndiaHerald.jpgఅక్కినేని నాగేశ్వరరావు 100 వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సాధించిన ఎన్నో విశేషాలు గురించి అందరూ మాట్లాడుతున్నారు. అయితే అక్కినేని వంటి హీరో ఎంతో యంగ్ వయసులో ఉండి కూడా ముసలి పాత్రలో నటించి ఎవరు ఊహించని విధంగా అవార్డులను సొంతం చేసుకున్నాడు.ఆ ఒక్క సినిమాకు గాను ఫిలింఫేర్ అవార్డ్, నేషనల్ అవార్డు, నంది అవార్డు కూడా దక్కడం విశేషం. పైగా ఈ సినిమాలో నాగార్జున చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు. ఇంతకీ అక్కినేని తీసిన ఆ గొప్ప సినిమా ఏమిటి ! దానికి సంబంధించిన విశేషాల గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చsocialstars lifestyle{#}Thota Chandrasekhar;June;Darsakudu;Akkineni Nageswara Rao;Yevaru;Akkineni Nagarjuna;Director;Andhra Pradesh;Hero;Chitram;Cinemaఅక్కినేనికి మాత్రమే సాధ్యమైన రికార్డు....!!అక్కినేనికి మాత్రమే సాధ్యమైన రికార్డు....!!socialstars lifestyle{#}Thota Chandrasekhar;June;Darsakudu;Akkineni Nageswara Rao;Yevaru;Akkineni Nagarjuna;Director;Andhra Pradesh;Hero;Chitram;CinemaThu, 21 Sep 2023 12:45:00 GMTఅక్కినేని నాగేశ్వరరావు 100 వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సాధించిన ఎన్నో విశేషాలు గురించి అందరూ మాట్లాడుతున్నారు. అయితే అక్కినేని వంటి హీరో ఎంతో యంగ్ వయసులో ఉండి కూడా ముసలి పాత్రలో నటించి ఎవరు ఊహించని విధంగా అవార్డులను సొంతం చేసుకున్నాడు.ఆ ఒక్క సినిమాకు గాను ఫిలింఫేర్ అవార్డ్, నేషనల్ అవార్డు, నంది అవార్డు కూడా దక్కడం విశేషం. పైగా ఈ సినిమాలో నాగార్జున చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు. ఇంతకీ అక్కినేని తీసిన ఆ గొప్ప సినిమా ఏమిటి ! దానికి సంబంధించిన విశేషాల గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.1968 జూన్ 28 న అక్కినేని నటించిన సుడిగుండాలు అనే చిత్రం విడుదల అయింది.

సినిమా లో జడ్జ్ చంద్రశేఖర్ పాత్రలు అక్కినేని ఎంతో బాగా నటించారు. అక్కినేని నటించిన అనేక సినిమాలకు అవార్డులు వచ్చాయి అందులో ఎక్కువగా హిట్ అయిన సినిమాలకే అవార్డులు దక్కాయి. ఇక అదే దోవలో సుడి గుండాలు కూడా ఒక కల్ట్ క్లాసిక్ సినిమాగా వచ్చి మంచి విజయాన్ని సాధించడంతో పాటు అవార్డుల పంట కూడా పండించింది. ఈ సినిమాకు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించగా కళాతపస్వి కే విశ్వనాథ్ స్క్రీన్ ప్లేను అందించడం విశేషం.

ఇక ఈ సినిమాలోనే నాగార్జున చైల్డ్ ఆర్టిస్ట్ గా కొంతసేపు కనిపిస్తారు. అయితే ఈ సినిమా అప్పట్లోనే సంచలన విజయం నమోదు చేసుకోగా మూడు ప్రతిష్టాత్మక అవార్డులను కూడా దక్కించుకుంది.  మొట్టమొదట ఉత్తమ ప్రాంతీయ (తెలుగు) చిత్రంగా నేషనల్ అవార్డు సంపాదించుకున్న సుడి గుండాలు సినిమా బెస్ట్ ఫీచర్ ఫిలిం గా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నుంచి నంది అవార్డును సైతం దక్కించుకుంది. వీటితో పాటు ఫిలింఫేర్( సౌత్ పురస్కారం) అవార్డులు కూడా దక్కించుకోవడం విశేషం. ఇక మరొక చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ఈ సినిమాకి నిర్మాతగా ఈ చిత్ర దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుతో పాటు అక్కినేని కూడా సంయుక్తంగా వ్యవహరించడం. ఏదైనా సినిమా విజయం సాధిస్తుంది అంటే అక్కినేని నిర్మాతగా మారడానికి వెనుకాడరు అని ఈ సినిమా నిరూపించింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

లియో: రిలీజ్ కి నెలముందే భారీగా ఏర్పాట్లు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>