EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/tamilnadua08ea2da-ee1d-4707-924c-ba9815272a8b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/tamilnadua08ea2da-ee1d-4707-924c-ba9815272a8b-415x250-IndiaHerald.jpgకేంద్రం రాష్ట్రానికి నిధులు విడుదల చేయాలంటే ఎక్కువ లోక్ సభ స్థానాలు కలిగి ఉండాలి. ఆ రాష్ట్రంలోని ఎంపీలంతా సమష్టిగా ఉంటే మరింత జాగ్రత్తగా జాతీయ పార్టీలు వ్యవహరించి తగు గౌరవం ఇస్తాయి. ఉదాహరణకు 2014కు ముందు దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్ ఎక్కువ 42 లోక్ సభ స్థానాలు కలిగి ఉండేది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి 25, తెలంగాణకు 17 గా విడిపోయాయి. ఆ తర్వాత కేంద్రంపై మన పెత్తనం తగ్గింది. ప్రస్తుతం మన ఉమ్మడి ఏపీ పార్టీలు ఏ కూటమిలో లేవు. ఇక్కడ రెండు చోట్ల ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుండటంతో కేంద్రం చిన్నచూపు చూస్తోందTAMILNADU{#}jayalalitha;udhayanidhi stalin;Bharatiya Janata Party;Palani;Andhra Pradesh;Anand Annamalai;Congress;MP;Tamilnadu;Elections;local language;Stalin;Party;Chennaiతమిళనాడులో బీజేపీకి అంత సీన్ ఉందా?తమిళనాడులో బీజేపీకి అంత సీన్ ఉందా?TAMILNADU{#}jayalalitha;udhayanidhi stalin;Bharatiya Janata Party;Palani;Andhra Pradesh;Anand Annamalai;Congress;MP;Tamilnadu;Elections;local language;Stalin;Party;ChennaiThu, 21 Sep 2023 06:00:00 GMTకేంద్రం రాష్ట్రానికి నిధులు విడుదల చేయాలంటే ఎక్కువ లోక్ సభ స్థానాలు కలిగి ఉండాలి. ఆ రాష్ట్రంలోని ఎంపీలంతా సమష్టిగా ఉంటే మరింత జాగ్రత్తగా జాతీయ పార్టీలు వ్యవహరించి తగు గౌరవం ఇస్తాయి.  ఉదాహరణకు 2014కు ముందు దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్ ఎక్కువ 42 లోక్ సభ స్థానాలు కలిగి ఉండేది.  రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి 25, తెలంగాణకు 17 గా విడిపోయాయి. ఆ తర్వాత కేంద్రంపై మన పెత్తనం తగ్గింది. ప్రస్తుతం మన ఉమ్మడి ఏపీ పార్టీలు ఏ కూటమిలో లేవు. ఇక్కడ రెండు చోట్ల ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుండటంతో కేంద్రం చిన్నచూపు చూస్తోంది.


ఇప్పుడు తమిళనాడు 39 ఎంపీ సీట్లతో దక్షిణాన అత్యధిక సీట్లు కలిగిన రాష్ట్రంగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని డీఎంకే అధికారంలో ఉంది. ఒకప్పుడు బీజేపీని తమిళనాడులో ఏ పార్టీ దగ్గరకి రానివ్వలేదు. ప్రస్తుతం ప్రతిపక్ష అన్నాడీఎంకే కలిసి బీజేపీ పని చేస్తోంది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీకి అక్కడ ఎప్పుడు మెజారిటీ స్థానాలు రావు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి.


ఓ పక్క  అన్నామలై రాష్ట్రంలో ర్యాలీలు, సభలు, పాదయాత్రలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తోంది. జయలలిత మరణాంతరం ఏఐడీఎంకే పగ్గాలు చేపట్టాలని శశికళ, పన్నీర్ సెల్వం, పళని స్వామి పోటీ పడ్డారు. దీనిని ఆసరాగా చేసుకొని బీజేపీ తమిళనాడులో రాజకీయంగా బలపడింది. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో మూడో స్థానానికి చేరుకుంది. చెన్నై కార్పొరేషన్ లో రెండో స్థానానికి ఎగబాకింది. ఏఐడీఎంకే ని మూడో స్థానానికి నెట్టేసింది.


ఏఐడీఎంకే నాయకత్వ లేమిని అవకాశంగా మలచుకొని 20 లోక్ సభ సీట్లు అడిగి నాయకత్వం వహించడానికి బీజేపీ సిద్ధం అవుతోంది. దీంతో పాటుగా కూటమిలోని మిగతా పక్షాలకు సీట్ల పంపకాన్ని కూడా మేమే చూసుకుంటాం అంటోంది.  ఇప్పుడు ఏఐడీఎంకే ఏం చేస్తుందో చూడాలి. ఒకవేళ బీజేపీ నుంచి బయటకి వస్తే స్టాలిన్ కు లాభం చేకూరే అవకాశం ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పైటను పక్కకు జరిపి అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన అనన్య పాండే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>