DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/chandrababu9663789d-2e78-4628-aff7-ae6355e31ff4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/chandrababu9663789d-2e78-4628-aff7-ae6355e31ff4-415x250-IndiaHerald.jpgమధ్యతరగతి మహిళ తన కుటుంబాన్ని తప్ప సాధారణంగా బయట రాజకీయాలను పట్టించుకోదు. ఎందుకంటే తనకు తన కుటుంబమే ముఖ్యం అనుకుంటుంది కాబట్టి. అయితే మొన్న చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో హైదరాబాదులో ఐటి స్టూడెంట్స్ ఆందోళనలకు దిగిన పరిస్థితి చూసాం. ఆ తర్వాత బెంగళూరులో కూడా ఇదే రకంగా ఐటి స్టూడెంట్స్ ఆందోళన చేయడం కూడా తెలుసుకున్నాం. అయితే చంద్రబాబు నాయుడు యొక్క విశేషం ఏమిటంటే రాజకీయాలను పట్టించుకోని మధ్యతరగతి మహిళలను కూడా తన గురించి పట్టించుకునేలా చేశారు ఆయన. విజయవాడలో చెన్నుపాటి ఉషారాణి తెలుగుదేశం పార్టీకిchandrababu{#}Pinnamaneni Babji;WhatsApp;Telugu Desam Party;House;CBNచంద్రబాబు అరెస్టుపై మహిళల స్పందన ఏంటి?చంద్రబాబు అరెస్టుపై మహిళల స్పందన ఏంటి?chandrababu{#}Pinnamaneni Babji;WhatsApp;Telugu Desam Party;House;CBNThu, 21 Sep 2023 06:29:00 GMTమధ్యతరగతి మహిళ తన కుటుంబాన్ని తప్ప సాధారణంగా బయట రాజకీయాలను పట్టించుకోదు. ఎందుకంటే తనకు తన కుటుంబమే ముఖ్యం  అనుకుంటుంది కాబట్టి. అయితే మొన్న చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో హైదరాబాదులో ఐటి స్టూడెంట్స్ ఆందోళనలకు దిగిన పరిస్థితి చూసాం. ఆ తర్వాత బెంగళూరులో కూడా ఇదే రకంగా ఐటి  స్టూడెంట్స్ ఆందోళన చేయడం కూడా తెలుసుకున్నాం.


అయితే చంద్రబాబు నాయుడు యొక్క విశేషం ఏమిటంటే రాజకీయాలను పట్టించుకోని మధ్యతరగతి మహిళలను కూడా తన గురించి పట్టించుకునేలా చేశారు ఆయన. విజయవాడలో చెన్నుపాటి ఉషారాణి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన  కార్పొరేటర్. ఆవిడ తన స్నేహితురాళ్లకు సంబంధించిన వాట్స్అప్ గ్రూపుల్లో మంచి వ్యూహాత్మకంగా ఈ విషయంలో ముందుకు వెళ్లినట్లుగా తెలుస్తుంది. కిట్టి పార్టీలకు సంబంధించిన వాట్సాప్ గ్రూపులో చంద్రబాబు నాయుడు అరెస్టు గురించి మొన్నటి వరకు వాళ్లు ఆందోళన చెందారట.


తాజాగా ట్రెండ్ సెట్ మాల్ దగ్గర వీళ్ళు ఒకసారిగా అటెండ్ అవ్వాలని అనుకున్నారట. అలా అనుకుని ట్రెండ్ సెట్ మాల్ నుండి పిన్నమనేని స్ట్రీట్ వరకూ ర్యాలీగా వెళ్లి చంద్రబాబు నాయుడు అరెస్టు పై ఆందోళన వ్యక్తం చేశారు అని తెలుస్తుంది. ఒక్కసారిగా ఇలా గేదర్ అయితే ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోనక్కర్లేదని,  ఎవరూ తమను అరెస్టు చేయలేరని వాళ్లు భావించారట. మధ్య తరగతి మహిళలు మామూలుగా అయితే రాజకీయాలను పట్టించుకోరు.  


అలాంటి వాళ్ళని కూడా చంద్రబాబు నాయుడు అరెస్టు కుదిపేసింది అని తెలుస్తుంది. ఎవరి కోసం రోడ్డెక్కి ఆందోళనలు చేయని ఎబౌ మిడిల్ క్లాస్ మహిళలని ఆందోళనల పేరుతో రోడ్డు పైకి తీసుకొచ్చారు చంద్రబాబు. ఈ మిడిల్ క్లాస్ మహిళల్లో కూడా టీచర్లు, డాక్టర్లు ఇలా రకరకాల వృత్తులు చేసే వాళ్ళు, హౌస్ వైఫ్ లు అందరు కూడా ఉన్నారట. అయితే ఆ సమయంలో తమ పనులు మానుకొని మరీ చంద్రబాబు  కోసం రోడ్డు ఎక్కిన  విషయం ఇప్పుడు ప్రత్యేకతను సంతరించుకుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పైటను పక్కకు జరిపి అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన అనన్య పాండే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>