HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthf653b9d4-c232-4fe1-befc-a2eff03f2e11-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthf653b9d4-c232-4fe1-befc-a2eff03f2e11-415x250-IndiaHerald.jpgమనం వెల్లుల్లిని తీసుకోవడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. వెల్లుల్లిని క్రమం తప్పకుండా రోజూ తీసుకోవడం వల్ల మనం చాలా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. నెల రోజుల పాటు క్రమం తప్పకుండా ప్రతి రోజూ వెల్లుల్లిని తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజూ ఒక వెల్లుల్లిని తీసుకోవడం వల్ల మనం రోగాల బారిన తక్కువగా పడతాము. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి ఈజీగా పెరుగుతుంది.ఎందుకంటే వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షHealth{#}garlic;Manam;Cholesterol;Shakti;Heart;Sugarప్రతి రోజు ఇది తింటే ఏ జబ్బు రాదు?ప్రతి రోజు ఇది తింటే ఏ జబ్బు రాదు?Health{#}garlic;Manam;Cholesterol;Shakti;Heart;SugarThu, 21 Sep 2023 20:46:00 GMTమనం వెల్లుల్లిని తీసుకోవడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. వెల్లుల్లిని క్రమం తప్పకుండా రోజూ తీసుకోవడం వల్ల మనం చాలా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. నెల రోజుల పాటు క్రమం తప్పకుండా ప్రతి రోజూ వెల్లుల్లిని తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజూ ఒక వెల్లుల్లిని తీసుకోవడం వల్ల మనం రోగాల బారిన తక్కువగా పడతాము. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి ఈజీగా పెరుగుతుంది.ఎందుకంటే వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి వైరస్, బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా కాపాడడంలో సహాయపడతాయి. ఈ వెల్లుల్లిని తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్ ప్లామేషన్ ఈజీగా తగ్గుతుంది.మన శరీరంలో ఇన్ ప్లామేషన్ తగ్గడం వల్ల మనం అనేక దీర్ఘకాలిక ఇంకా ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉంటాము.ఇంకా అలాగే ప్రతి రోజూ వెల్లుల్లి రెబ్బలను తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అలాగే అదిక రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. ఇంకా వెల్లుల్లిలో నైట్రిక్ ఆక్సైడ్ ఉంటుంది. అలాగే ఇది రక్తనాళాలు వ్యాకోచించేలా చేసి రక్తప్రసరణ సాఫీగా సాగేలా చేయడంలో సహాయపడుతుంది.


అందుకే అధిక రక్తపోటు సమస్యతో బాధపడే వారు ప్రతి రోజూ వెల్లుల్లిని తీసుకోవడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది.ఇంకా అంతేకాకుండా వెల్లుల్లిని తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఈజీగా అదుపులో ఉంటాయి.అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో వెల్లుల్లి మనకు ఎంతో సహాయపడుతుంది. ఈ వెల్లుల్లిని తీసుకోవడం వల్ల రక్తంలో ట్రై గ్లిజరాయిడ్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. ఇక వెల్లుల్లిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా సులభంగా అదుపులో ఉంటాయి. షుగర్ వ్యాధితో బాధపడే వారు రోజు రెండు నుండి మూడు నెలల పాటు వెల్లుల్లిని రోజూ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. ఇంకా అలాగే వెల్లుల్లిని తీసుకోవడం వల్ల శారీరక సామర్థ్యం పెరుగుతుంది. రోజంతా చాలా ఉత్సాహంగా పని చేసుకోగలుగుతాము. శరీరంలో ఉండే వ్యర్థాలను, మలినాలు, విష పదార్థాలను బయటకు పంపించడంలో, రక్తాన్ని శుభ్రంగా ఉంచడంలో  వెల్లుల్లి  ఉపయోగపడుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎద అందాలతో విందు చేస్తున్న ఫరియా అబ్దుల్లా...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>