LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/beauty-tips0015ef4d-d045-47e2-8f41-5a99392d0e1e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/beauty-tips0015ef4d-d045-47e2-8f41-5a99392d0e1e-415x250-IndiaHerald.jpgజుట్టు రాలడం, జుట్టు పెరగకపోవడం, జుట్టు చిట్లడం ఇంకా అలాగే తెల్ల బడటం, చుండ్రు రావడం వంటి సమస్యలతో బాధపడే వారు నేటి కాలంలో చాలా అంటే చాలా ఎక్కువవుతున్నారు. అసలు వయసుతో సంబంధం లేకుండా అందరూ కూడా ఈ సమస్యల బారిన పడుతున్నారు. ఈ సమస్యలన్నింటిని నుండి బయట పడి జుట్టు పొడవుగా, నల్లగా ఇంకా ఒత్తుగా పెరగాలని చాలా మంది చాలా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.అందుకోసం వారు రకాల నూనెలను, షాంపులను వాడుతూ ఉంటారు. అయినా కూడా ఎలాంటి ఫలితం లేకపోవడం చేత తీవ్ర నిరాశకు గురి అవుతూ ఉంటారు. ఇక అలాంటి వారు మన ఇంట్లోనే సహజ సBeauty tipsవారంలో ఒక రోజు ఇలా చేస్తే జుట్టు సమస్యలు మాయం?వారంలో ఒక రోజు ఇలా చేస్తే జుట్టు సమస్యలు మాయం?Beauty tipsThu, 21 Sep 2023 21:55:00 GMTజుట్టు రాలడం, జుట్టు పెరగకపోవడం, జుట్టు చిట్లడం ఇంకా అలాగే తెల్ల బడటం, చుండ్రు రావడం వంటి సమస్యలతో బాధపడే వారు నేటి కాలంలో చాలా అంటే చాలా ఎక్కువవుతున్నారు. అసలు వయసుతో సంబంధం లేకుండా అందరూ కూడా ఈ సమస్యల బారిన పడుతున్నారు. ఈ సమస్యలన్నింటిని నుండి బయట పడి జుట్టు పొడవుగా, నల్లగా ఇంకా ఒత్తుగా పెరగాలని చాలా మంది చాలా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.అందుకోసం వారు రకాల నూనెలను, షాంపులను వాడుతూ ఉంటారు. అయినా కూడా ఎలాంటి ఫలితం లేకపోవడం చేత తీవ్ర నిరాశకు గురి అవుతూ ఉంటారు. ఇక అలాంటి వారు మన ఇంట్లోనే సహజ సిద్దంగా లభించే పదార్థాలతో పేస్ట్ ను తయారు చేసుకుని వాడడం వల్ల చాలా సులభంగా జుట్టు సమస్యలన్నింటి నుండి చాలా ఈజీగా బయట పడవచ్చు. ఈ టిప్ ని కేవలం వారానికి ఒకసారి వాడితే చాలు జుట్టు రాలడం తగ్గడంతో పాటు జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. జుట్టు సమస్యలని తగ్గించే ఆ చిట్కా ఏమిటి.. ఇంకా దీనిని ఎలా తయారు చేసుకోవాలి.. ఎలా వాడాలి.. వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి గానూ ముందుగా ఒక గిన్నెలో మూడు టీ స్పూన్ల బృంగరాజ్ పౌడర్ ( గుంటగలగరాకు పొడి)ని మీరు తీసుకోవాలి.ఆ తరువాత ఇందులో రెండు టీ స్పూనన్ల ఉసిరికాయ పొడి వేసి బాగా కలపాలి. ఆ తరువాత రెండు టీ స్పూన్ల ఆలివ్ నూనె, నాలుగు టీ స్పూన్ల పెరుగు వేసి పేస్ట్ లాగా కలుపుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివరి దాకా బాగా పట్టించాలి. దీనిని ఒక గంట పాటు అలాగే ఉంచిన తరువాత కుంకుడుకాయలతో శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా ఇంకా పొడవుగా పెరుగుతుంది. జుట్టు చిట్లడం, చుండ్రు వంటి సమస్యలు కూడా ఈజీగా తగ్గుతాయి. ఈ పేస్ట్ తయారీలో వాడిన ప్రతి పదార్థం కూడా జుట్టు పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. వీటిలో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్లను బాగా బలంగా మార్చడంలో సహాయపడతాయి. ఇలా పేస్ట్ ను తయారు చేసుకుని వారానికి ఒకసారి వాడడం వల్ల జుట్టు నల్లగా, పొడవుగా  ఇంకా అలాగే కాంతివంతంగా మారుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎద అందాలతో విందు చేస్తున్న ఫరియా అబ్దుల్లా...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>