Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleaa09ffc5-a324-4221-ada9-7ac77b40e50a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleaa09ffc5-a324-4221-ada9-7ac77b40e50a-415x250-IndiaHerald.jpgతాజాగా అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకలకు టాలీవుడ్ లో పలువురు ప్రముఖులు సెలబ్రిటీలు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఈ వేడుకలకు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సైతం హాజరయ్యారు. స్టూడియోలో ఏర్పాటుచేసిన ఏఎన్నార్ నిలువెత్తు కాంస్య విగ్రహానికి నివాళులు అర్పించిన తరవాత కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అలాగే నాగేశ్వరరావుతో తనకు ఉన్న అనుభవాలను, జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావు గురించి మాట్లాడాలి అsocialstars lifestyle{#}dasari narayana rao;Kanna Lakshminarayana;Konakalla Narayana Rao;S V Rangarao;mohan babu;Tollywood;king;King;CBN;Makeup;Jayanthi;Akkineni Nageswara Rao;annapurna;Cinemaఏఎన్నార్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కలెక్షన్ కింగ్ మెహన్ బాబు....!!ఏఎన్నార్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కలెక్షన్ కింగ్ మెహన్ బాబు....!!socialstars lifestyle{#}dasari narayana rao;Kanna Lakshminarayana;Konakalla Narayana Rao;S V Rangarao;mohan babu;Tollywood;king;King;CBN;Makeup;Jayanthi;Akkineni Nageswara Rao;annapurna;CinemaThu, 21 Sep 2023 22:02:19 GMTజయంతి వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకలకు టాలీవుడ్ లో పలువురు ప్రముఖులు సెలబ్రిటీలు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఈ వేడుకలకు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సైతం హాజరయ్యారు. స్టూడియోలో ఏర్పాటుచేసిన ఏఎన్నార్ నిలువెత్తు కాంస్య విగ్రహానికి నివాళులు అర్పించిన తరవాత కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అలాగే నాగేశ్వరరావుతో తనకు ఉన్న అనుభవాలను, జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావు గురించి మాట్లాడాలి అంటే నేను ఒక పెద్ద పుస్తకాన్ని రాయొచ్చు. మా ఇద్దరికి ఉన్నటువంటి బంధం, అనుబంధం అలాంటిది.

నేను తిరుపతిలో చదువుకునేటప్పుడు నాగేశ్వరరావు గారి సినిమా 100 రోజుల ఫంక్షన్ జరుగుతుంది అంటే అక్కడికి వెళ్లి ఆయన్ని చూద్దామని ప్రయత్నించి చొక్కా చించుకుని రూముకి వెళ్లినవాడిని. మళ్లీ ఆ చొక్కా కుట్టించుకోవడానికి కూడా డబ్బుల్లేవు. అటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారితో సినిమా పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసే అవకాశం నాకు దక్కింది. నాగేశ్వరరావు గారు, ఎస్వీ రంగారావు గారు పనిచేసిన మరపురాని మనిషి సినిమాకు నేను అసోసియేట్‌గా పనిచేశాను అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.అలాగే ఒక సందర్భం గురించి మాట్లాడుతూ.. అన్నపూర్ణ స్టూడియోలోనే సినిమా చేస్తున్నప్పుడు నా కంటే ముందుగానే నాగేశ్వరరావు సెట్‌కు వెళ్లి కూర్చున్నారు.నా కన్నా ముందే వెళ్లి ఫ్లోర్ ముందు నాగేశ్వరరావు గారు కూర్చున్నారు.నేను లేటుగా వెళ్లాను. నమస్కారం సర్ అన్నాను. ఏంటయ్యా అలా ఉన్నావు అన్నారు. నాకొక కోరిక ఉంది సర్ అన్నాను.

దాసరి నారాయణరావు లోపల ఉన్నారు, మీరేమో బయట ఉన్నారు. ప్రతిసారీ మీరొస్తే నేను లేచి నిలబడాలా? నేనొస్తే మీరు లేచి నిలబడాలని కోరిక కోరుకుంటున్నాను సర్ అన్నాను. అమ్మ లమ్మిడీ కొడకా నీకు అంత కోరిక ఉందా అన్నారు.మరుసటి రోజు ఇదే ఫస్ట్ ఫ్లోర్‌లో నాగేశ్వరరావు గారు, దాసరి నారాయణరావు గారు బయట ఉన్నారు. నేను మేకప్ వేసుకుని వెళ్లాను. ఇద్దరూ లేచి నిలబడ్డారు. ఇదేంటి సర్ ఇద్దరూ లేచి నిలబడ్డారు అని అడిగాను.లేదులే.. నీ కోరిక కదా, అందుకే మేమిద్దరం లేచి నిలబడ్డాం అన్నారు. అలాంటి చమత్కారాలు నాగేశ్వరరావు గారిదో ఎన్నో ఉన్నాయి అని మోహన్ బాబు నవ్వుతూ వెల్లడించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎద అందాలతో విందు చేస్తున్న ఫరియా అబ్దుల్లా...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>