HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/munagaku-uses25edcb7b-9bae-45cf-a600-3d363f9ada9f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/munagaku-uses25edcb7b-9bae-45cf-a600-3d363f9ada9f-415x250-IndiaHerald.jpgమన చుట్టూ పరిసరాలలో దొరికేటువంటి ఆకులలో మునగాకు కూడా ఒకటి. మునక్కాయలు నిత్యం మనం తినే ఆహారంలో ఒకటని కూడా చెప్పవచ్చు. మునగ చెట్టు నుంచి వచ్చేటువంటి కాయలే కాకుండా ఆకుల వల్ల కూడా అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలో తెలియజేయడం జరిగింది. మునగాకులలో ముఖ్యంగా విటమిన్స్ పుష్కలంగా లభిస్తాయి.. ఇందులో లభించే అటువంటి విటమిన్స్ ఏ ఆకుకూరలలో కూడా ఎక్కువగా లభించదట.. అలాగే క్యాల్షియం, ఫాస్పరస్, ఐరన్ వంటివి కూడా ఎక్కువగా మునగాకులలోనే లభిస్తాయి. దాదాపుగా మన పూర్వీకులు కూడా మునగాకును ఒక మెడిసిన్ తయారీలో ఉపయోగMUNAGAKU;USES{#}Iron;Drumstick;Sugar;Ancestral;Vitamin;Calcium;Manamపైసా ఖర్చు లేకుండా దొరికే ఈ ఆకుతో ఎన్నో సమస్యలకు చెక్..!!పైసా ఖర్చు లేకుండా దొరికే ఈ ఆకుతో ఎన్నో సమస్యలకు చెక్..!!MUNAGAKU;USES{#}Iron;Drumstick;Sugar;Ancestral;Vitamin;Calcium;ManamThu, 21 Sep 2023 06:00:00 GMTమన చుట్టూ పరిసరాలలో దొరికేటువంటి ఆకులలో మునగాకు కూడా ఒకటి. మునక్కాయలు నిత్యం మనం తినే ఆహారంలో ఒకటని కూడా చెప్పవచ్చు. మునగ చెట్టు నుంచి వచ్చేటువంటి కాయలే కాకుండా ఆకుల వల్ల కూడా అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలో తెలియజేయడం జరిగింది. మునగాకులలో ముఖ్యంగా విటమిన్స్ పుష్కలంగా లభిస్తాయి.. ఇందులో లభించే అటువంటి విటమిన్స్ ఏ ఆకుకూరలలో కూడా ఎక్కువగా లభించదట.. అలాగే క్యాల్షియం, ఫాస్పరస్, ఐరన్ వంటివి కూడా ఎక్కువగా మునగాకులలోనే లభిస్తాయి.


దాదాపుగా మన పూర్వీకులు కూడా మునగాకును ఒక మెడిసిన్ తయారీలో ఉపయోగించుకునే వారట. అంతేకాకుండా ఆయుర్వేదంలో కూడా ఎన్నో రకాల వ్యాధులను నయం చేయడానికి ఈ మునగాకును ఉపయోగిస్తూ ఉంటారని తెలుస్తోంది. మునగాకులో ఉండే యాసిడ్స్, మినరల్స్ అనేక రకాల వ్యాధులను కూడా నయం చేస్తాయి. పాల నుంచి లభించే కాల్షియం ఈ మునగాకుల చాలా అధికంగా లభిస్తుంది. అలాగే పెరుగు నుంచి లభించే ప్రోటీన్లు కూడా అధిక మొత్తంలో మునగాకుల లభిస్తుందట. మహిళలు బ్లడ్ తక్కువగా ఉన్నవారు ఈ మునగాకు పొడిని ప్రతిరోజు గోరువెచ్చని నీటిలో తీసుకున్నట్లు అయితే బ్లడ్ శాతం అమాంతం పెరుగుతుందట. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్ కూడా తగ్గిపోతోందని ఒక పరిశోధనలో తేలింది.


మునగాకులు ఉండే క్లోరోజనిక్ యాసిడ్ బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. మునగాకు రసం పాలలో కలిపి పిల్లలకు తాపినట్లు అయితే ఎముకలకు చాలా దృఢంగా ఉండేలా చేస్తాయట. బాలింతల కు అవసరమయ్యే క్యాల్షియం ,ఐరన్, విటమిన్లు వంటివి ఇందులో పుష్కలంగా లభిస్తాయి. పాలిచ్చే తల్లులకు ఎక్కువగా మునగాకు కూరను వండి పెడితే చాలా మంచిది. మునగాకు రసాన్ని కాస్త తీసుకొని కొబ్బరి నీళ్లలో కలిపి తాగినా సరే విరోచనాల నుంచి విముక్తి పొందవచ్చు. మునగాకు రసంలో కాస్త నిమ్మకాయ కలుపుకొని ముఖానికి రాస్తే బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

13 రోజుల్లో "జవాన్" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>