EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/china05024139-3cea-4557-96c8-a874f3313ee2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/china05024139-3cea-4557-96c8-a874f3313ee2-415x250-IndiaHerald.jpgజిన్ పింగ్ చైనాను ఏకఛత్రాధిపత్యంతో పాలిస్తున్న నియంత. చైనాను తను ఉన్నంత కాలం శాశ్వతంగా పాలించేందుకు ఆ దేశ అధ్యక్ష పదవిపై చట్ట సవరణలు చేశాడు. తనకు అడ్డు తగిలిన వారందరినీ జైలుకు పంపిచడం, లేదా ఉరి తీయడం వంటివి చేస్తుంటారు. క్రమక్రమంగా చైనా నుంచి ప్రపంచంపై కూడా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇప్పటివరకు చైనాలో అతను చెప్పిందే వేదం. అతని మాటకు తిరుగులేదు. ఉన్నట్టుండి చైనాలో అంతర్గత యుద్ధం నడుస్తున్నట్లు తెలుస్తోంది. జిన్ పింగ్ వ్యతిరేక శక్తులన్నీ ఏకం అవుతున్నట్లు సమాచారం. అCHINA{#}American Samoa;News;Uri;Cabinet;war;Ministerచైనాలో ఏకంగా మంత్రులు మిస్సింగ్‌.. ఏమవుతోంది?చైనాలో ఏకంగా మంత్రులు మిస్సింగ్‌.. ఏమవుతోంది?CHINA{#}American Samoa;News;Uri;Cabinet;war;MinisterThu, 21 Sep 2023 07:00:00 GMTజిన్ పింగ్ చైనాను ఏకఛత్రాధిపత్యంతో పాలిస్తున్న నియంత. చైనాను తను ఉన్నంత కాలం శాశ్వతంగా పాలించేందుకు  ఆ దేశ అధ్యక్ష పదవిపై చట్ట సవరణలు చేశాడు. తనకు అడ్డు తగిలిన వారందరినీ జైలుకు పంపిచడం, లేదా ఉరి తీయడం వంటివి చేస్తుంటారు.  క్రమక్రమంగా చైనా నుంచి ప్రపంచంపై కూడా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని ఉవ్విళ్లూరుతున్నాడు.  ఇప్పటివరకు చైనాలో అతను చెప్పిందే వేదం. అతని మాటకు తిరుగులేదు.  


ఉన్నట్టుండి చైనాలో అంతర్గత యుద్ధం నడుస్తున్నట్లు తెలుస్తోంది.  జిన్ పింగ్ వ్యతిరేక శక్తులన్నీ ఏకం అవుతున్నట్లు సమాచారం. అక్కడ ఉన్నదంతా కమ్యూనిస్టులే. అందులోనే అధికార, ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి. ప్రతిపక్షాన్ని నోరు మూయించడంలో జిన్ పింగ్
 క్రూరత్వంగా వ్యవహరించేవారు.  పార్టీలో తన ప్రత్యర్థులను సైతం అణచివేశాడు.  ఫలితంగా అతడిని ఎదురించే వారే లేకుండా చేశారు. ఇప్పుడిప్పుడే అక్కడ ఆర్థిక వ్యవస్థ  అస్తవ్యస్తం అవుతోంది. పలు రాష్ట్రాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. దీంతో జిన్ పింగ్ పై ప్రజాగ్రహం కట్టలు తెచ్చుకుంటోంది.  


దీని నుంచి దృష్టి మరల్చేందుకు జినిపింగ్ కొత్త క్యాబినెట్ ను ఏర్పాటు చేశాడు.  ఆ తర్వాత కొత్త విదేశాంగ మంత్రి అకస్మాత్తుగా మాయమైపోయాడు. అతడిపై ఏదో విచారణ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వాటిని ఎవరూ ధ్రువీకరించలేదు.  కొన్ని రోజులకు కొత్త వ్యక్తి విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో అతని అంశం పక్కకు వెళ్లింది. అతడిని జైలులో వేశారన్నది కొంత అర్థం అవుతోంది.


ఇప్పుడు మళ్లీ కొత్త సమస్య వచ్చింది. ఆ దేశ రక్షణ మంత్రి లీ షాంగ్ ఫూ కొద్ది వారాలుగా కనిపించడం లేదు.  ఏకంగా దేశ రక్షణ శాఖ మంత్రి కే రక్షణ కరవైంది. 'అతడిని పదవి నుంచి తొలగించారు.  నిర్భందించి విచారిస్తున్నారు' అని అమెరికా అభిప్రాయపడింది.  చైనా ఇంత వరకు ఈ అంశంపై స్పందించలేదు. మా అంతర్గత వ్యవహారాలు మేం చూసుకుంటాం అని కూడా బయటకు చెప్పడం లేదు. చూడాలి ఈ అంశం ఏమవుతుందో.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

13 రోజుల్లో "జవాన్" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>