Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle371dfa67-a7e7-49e8-b845-b242954968b4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle371dfa67-a7e7-49e8-b845-b242954968b4-415x250-IndiaHerald.jpgమన టాలీవుడ్ లో లవ్ స్టోరీస్ విభాగం లో ఎన్నో కల్ట్ క్లాసిక్ చిత్రాలు ఉన్నాయి. వాటిల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన 'తొలిప్రేమ' సినిమా కూడా ఒకటి.అప్పటి వరకు ఒక మామూలు రేంజ్ హీరో గా కొనసాగిన పవన్ కళ్యాణ్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లి స్టార్ హీరోని చేసింది ఈ చిత్రం. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ లో ఈ సినిమా ప్రభావం ఆరోజుల్లో మామూలు రేంజ్ లో ఉండేది కాదు. ఇప్పుడు చూసినా కూడా ఈ చిత్రం ఎదో కొత్త సినిమాని చూస్తున్న అనుభూతిని కలుగుతుంది. పవన్ కళ్యాణ్ అద్భుతమైన నటనకి తోడు కరుణాకరన్ టేకింగ్ మరియు దేవా అsocialstars lifestyle{#}Kareena Kapoor;Tusshar Kapoor;karunakaran;kalyan;Hyderabad;RTC;Tollywood;Tamil;producer;king;Kannada;Love;Hindi;Audience;Producer;Pawan Kalyan;Remake;Hero;Chitram;Telugu;Cinemaబాలీవుడ్ హీరో ను స్టార్ హీరోగా చేసిన పవర్ స్టార్ రీమేక్ మూవీ...!!బాలీవుడ్ హీరో ను స్టార్ హీరోగా చేసిన పవర్ స్టార్ రీమేక్ మూవీ...!!socialstars lifestyle{#}Kareena Kapoor;Tusshar Kapoor;karunakaran;kalyan;Hyderabad;RTC;Tollywood;Tamil;producer;king;Kannada;Love;Hindi;Audience;Producer;Pawan Kalyan;Remake;Hero;Chitram;Telugu;CinemaThu, 21 Sep 2023 13:00:00 GMTమన టాలీవుడ్ లో లవ్ స్టోరీస్ విభాగం లో ఎన్నో కల్ట్ క్లాసిక్ చిత్రాలు ఉన్నాయి. వాటిల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన 'తొలిప్రేమ' సినిమా కూడా ఒకటి.అప్పటి వరకు ఒక మామూలు రేంజ్ హీరో గా కొనసాగిన పవన్ కళ్యాణ్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లి స్టార్ హీరోని చేసింది ఈ చిత్రం. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ లో ఈ సినిమా ప్రభావం ఆరోజుల్లో మామూలు రేంజ్ లో ఉండేది కాదు. ఇప్పుడు చూసినా కూడా ఈ చిత్రం ఎదో కొత్త సినిమాని చూస్తున్న అనుభూతిని కలుగుతుంది. పవన్ కళ్యాణ్ అద్భుతమైన నటనకి తోడు కరుణాకరన్ టేకింగ్ మరియు దేవా అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ చిత్రానికి కల్ట్ క్లాసిక్ స్టేటస్ ని తెచ్చి పెట్టింది.అప్పట్లోనే ఈ సినిమా దాదాపుగా 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.ఇక హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సంవత్సరం రోజులు ఆడిన మొట్టమొదటి మరియు చివరి సినిమా ఇదే. అలాంటి సెంటర్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి చాలానే ఉన్నాయి. రీసెంట్ గానే ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తే కోటి 65 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఎలాంటి అకేషన్ లేకుండా, అసలు ఎలాంటి ప్లాన్స్ చెయ్యకుండా ఈ రేంజ్ వసూళ్లు రావడాన్ని చూస్తుంటే ఈ సినిమాకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

అంతే కాదు హైదరాబాద్ సిటీ లో అత్యధికసార్లు రీ రిలీజ్ అయిన చిత్రం ఇదే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాకి నైజాం డిస్ట్రిబ్యూషన్ చేసాడు. ఆయనకీ డబ్బులు అవసరమైనప్పుడల్లా ఈ సినిమాని రీ రిలీజ్ చేసుకునేవాడట. అంతటి క్రేజ్ ఉన్న సినిమా ఇది, పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు రీ రిలీజ్ అయ్యుంటే కచ్చితంగా పది కోట్ల రూపాయిల గ్రాస్ కొల్లగొట్టి ఉండేది.  అయితే ఈ చిత్రాన్ని తమిళం లో దబ్ చేసి విడుదల చెయ్యగా, అక్కడ పెద్ద హిట్ అయ్యింది. అలాగే ఈ సినిమాని హిందీ మరియు కన్నడ భాషల్లో రీమేక్ చేసారు.కన్నడలో రవిచంద్రన్ హీరో గా 'ప్రీత్సు తప్పెనిల్లా' పేరుతో రీమేక్ అయ్యింది. అలాగే హిందీ లో తుషార్ కపూర్ హీరో గా 'ముజ్ సే కుచ్ కెహెనా హై' పేరు తో రీమేక్ అయ్యింది. కరీనా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది. తుషార్ కపూర్ ని హీరో గా నిలబెట్టింది.అలాగే ఈ సినిమాకి ఆయన ఫిలిం ఫేర్ అవార్డుని కూడా అందుకున్నాడు. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది కదా అని , పవన్ కళ్యాణ్ మరో సూపర్ హిట్ చిత్రం 'బద్రి' ని రీమేక్ చేసాడు. ఇది మాత్రం కమర్షియల్ గా అక్కడ పెద్ద ఫ్లాప్ అయ్యింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

లియో: రిలీజ్ కి నెలముందే భారీగా ఏర్పాట్లు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>