MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood80fc3dd6-7d81-42bc-9130-84c32fb43542-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood80fc3dd6-7d81-42bc-9130-84c32fb43542-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నాని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల దసరా సినిమాతో పాన్ ఇండియా విజయాన్ని సొంతం చేసుకున్న నాని ప్రస్తుతం హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శౌర్యువ్ అనే నూతన దర్శకుడు ఈ మూవీతో వెండితెరకి అరంగేట్రం చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాని డిసెంబర్ 21 న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే 'హాయ్ నాన్న' తర్వాత నాని ఎవరితో సినిమా tollywood{#}Nani;atreya;chakravarthy;vivek;Comedy;Darsakudu;srikanth;Dussehra;Vijayadashami;Father;December;News;lord siva;Shiva;Success;India;Cinema;Director;Tamilనాని కోసం ముగ్గురు దర్శకుల ఎదురుచూపులు..!?నాని కోసం ముగ్గురు దర్శకుల ఎదురుచూపులు..!?tollywood{#}Nani;atreya;chakravarthy;vivek;Comedy;Darsakudu;srikanth;Dussehra;Vijayadashami;Father;December;News;lord siva;Shiva;Success;India;Cinema;Director;TamilWed, 20 Sep 2023 12:09:48 GMTన్యాచురల్ స్టార్ గా  గుర్తింపు తెచ్చుకున్న నాని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల దసరా సినిమాతో పాన్ ఇండియా విజయాన్ని సొంతం చేసుకున్న నాని ప్రస్తుతం హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  శౌర్యువ్ అనే నూతన దర్శకుడు ఈ మూవీతో వెండితెరకి అరంగేట్రం చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాని డిసెంబర్ 21 న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే 'హాయ్ నాన్న' తర్వాత నాని ఎవరితో సినిమా చేస్తాడనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే నాని కోసం ఏకంగా ముగ్గురు దర్శకులు వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. 

వారిలో మొదటగా వివేక్ ఆత్రేయతో ఓ క్రైమ్ కామెడీ మూవీని చేయాల్సి ఉంది. ఆపై దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా కూడా ఉన్నట్లు సమాచారం. ఇక ఈమధ్య తమిళ దర్శకుడు శిబి చక్రవర్తి తో కూడా నాని సినిమా చేస్తున్నాడని వార్తలు వినిపించాయి. తమిళంలో శివ కార్తికేయన్ తో 'డాన్'(Don) సినిమా తీసి భారీ సక్సెస్ అందుకున్న ఈ దర్శకుడు తన నెక్స్ట్ మూవీని నానితో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ముగ్గురిలో నాని తన నెక్స్ట్ మూవీ ఎవరితో చేస్తాడు? ఏ సినిమాని ముందు అనౌన్స్ చేస్తాడు? అనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. 

నిజానికి నాని వివేక్ ఆత్రేయ మూవీని వినాయక చవితి సందర్భంగా అనౌన్స్ చేయాలని భావించినప్పటికీ అది జరగలేదు. అటు 'దసరా' తర్వాత డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా సైలెంట్ అయిపోయాడు. కాబట్టి ప్రస్తుతానికి ఈ దర్శకుడుతో నాని సినిమా ఉండే అవకాశం లేదు. మరి 'హాయ్ నాన్న' తర్వాత నాని ఎవరితో సినిమా చేస్తాడు అనేది చూడాలి. 'హాయ్ నాన్న' విషయానికొస్తే.. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ నేపథ్యంలో ఈ మూవీ ఉండబోతోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ అనౌన్స్మెంట్ టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. 





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రవితేజ తో రొమాన్స్ కి రెడీ అయిన రష్మిక మందన.. ఏ సినిమాలో అంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>