Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle4a8ffb5a-8cdb-4b38-a7bb-6f5803552aa7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle4a8ffb5a-8cdb-4b38-a7bb-6f5803552aa7-415x250-IndiaHerald.jpgఇవాళా,రేపూ సినిమాని నిర్మించటం ఒకెత్తు అయితే దాన్ని జనాల్లోకి తీసుకెళ్లి హిట్ కొట్టడం మరో ఎత్తు. సినిమా రిజల్ట్ పై కేవలం దర్శక,నిర్మాతలే కాదు నటీనటులు సైతం ఆశపెట్టుకుంటారు.ఈ క్రమంలో సినిమాని సరిగ్గా ప్రమోట్ చేయకపోయినా, డిజాస్టర్ అయినా బాధ కలుగుతుంది. ఇలాంటి అనుభవమే జగపతిబాబు కీ రోల్ లో చేసిన రుద్రంగి సినిమాకు జరిగింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. ఆయన మాటలో ఆవేదన, బాధ, జనాల్లోకి సరిగ్గా తీసుకెళ్లని నిర్మాతపై కోపం కనపడ్డాయి. జగపతిబాబు ప్రధాన పాత్రలో నటించిన రుద్రంగి సినిమా ఇటీవల థియేటsocialstars lifestyle{#}producer;Producer;MLA;Interview;Telangana;Cinemaఆ ప్రొడ్యూసర్ పై షాకింగ్ కామెంట్స్‌ చేసిన జగ్గు భాయ్...!!ఆ ప్రొడ్యూసర్ పై షాకింగ్ కామెంట్స్‌ చేసిన జగ్గు భాయ్...!!socialstars lifestyle{#}producer;Producer;MLA;Interview;Telangana;CinemaWed, 20 Sep 2023 10:15:02 GMTఇవాళా,రేపూ సినిమా ని నిర్మించటం ఒకెత్తు అయితే దాన్ని జనాల్లోకి తీసుకెళ్లి హిట్ కొట్టడం మరో ఎత్తు. సినిమా రిజల్ట్ పై కేవలం దర్శక,నిర్మాతలే కాదు నటీనటులు సైతం ఆశపెట్టుకుంటారు.ఈ క్రమంలో సినిమాని సరిగ్గా ప్రమోట్ చేయకపోయినా, డిజాస్టర్ అయినా బాధ కలుగుతుంది. ఇలాంటి అనుభవమే జగపతిబాబు కీ రోల్ లో చేసిన రుద్రంగి సినిమా కు జరిగింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. ఆయన మాట లో ఆవేదన, బాధ, జనాల్లోకి సరిగ్గా తీసుకెళ్లని నిర్మాత పై కోపం కనపడ్డాయి. జగపతిబాబు ప్రధాన పాత్ర లో నటించిన రుద్రంగి సినిమా ఇటీవల థియేటర్లలో రిలీజైంది. మమతామోహన్‌దాస్‌, విమలారామన్ ప్రధాన పాత్ర ల్లో నటించిన ఈ సినిమా ఫెయిల్యూర్‌గా నిలిచింది. రుద్రంగి సినిమాను తెలంగాణ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించారు. ఈ సినిమా రిజల్ట్‌ పై ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో జగపతిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జగపతిబాబు మాట్లాడుతూ.....రుద్రంగి కథ నచ్చడం తో రెమ్యునరేషన్ తగ్గించుకొని ఈ సినిమా చేశానని జగపతిబాబు అన్నాడు. సినిమా ప్రొడ్యూసర్ ఎమ్మెల్యే అయినా సరిగా ప్రమోషన్ చేయలేకపోయాడని చెప్పాడు. సినిమా బాగా రావాలనే తపన ప్రొడ్యూసర్‌ లో కనిపించలేదని జగపతిబాబు పేర్కొన్నాడు. అందువల్లే నాలుగు రోజుల్లోనే రుద్రంగి సినిమాను థియేటర్ల నుంచి ఎత్తేశారని జగపతిబాబు తెలిపాడు. దాంతో మంచి సినిమా అనాథగా మారిపోయిందని తెలిపాడు. దాదాపు ఏడు, ఎనిమిది కోట్ల బడ్జెట్‌తో రుద్రంగి సినిమాను తెరకెక్కించారని, నాకున్న మార్కెట్‌కు ఆ రేంజ్ బడ్జెట్‌ వర్కవుట్ కాదని ముందే ఊహించానని జగపతిబాబు అన్నాడు. రిలీజ్ డిలే అవుతుండటంతో డైరెక్ట్‌ గా ఓటీటీ లో విడుదల చేయమని ప్రొడ్యూసర్స్‌కు చెప్పానని, కానీ వినలేదని జగపతిబాబు అన్నాడు. రిజల్ట్ సంగతి పక్కనపెడితే రుద్రంగి తన కెరీర్‌ లో బెస్ట్ మూవీ అని జగపతిబాబు చెప్పాడు. జగపతిబాబు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పైటను పక్కకు జరిపి అందాల ప్రదర్శనతో కుర్రకారుకు హీట్ పెంచుతున్న శ్రద్దదాస్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>