Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricet33f4ab13-63dd-49d7-adb9-01b645882ac0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricet33f4ab13-63dd-49d7-adb9-01b645882ac0-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో అంతర్జాతీయ క్రికెట్లో టి20 ఫార్మాట్కు ఉన్న క్రేజ్ అంతకంతకు పెరిగిపోతూ ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే టీ20 ఫార్మాట్ కు ప్రేక్షకాదరణ పెరిగిపోతున్న నేపథ్యంలో టెస్ట్ ఫార్మాట్ తో పాటు వన్డే ఫార్మాట్ కూడా కాస్త ప్రమాదంలో పడిపోతున్నాయి అని చెప్పాలి. అయితే టి20 ఫార్మాట్ ప్రేక్షకులకు ఎక్కువగా నచ్చడానికి కారణం ఇక ఈ ఫార్మాట్లో ఉండే మెరుపు ఇన్నింగ్స్ లే. ప్రేక్షకులు ఎలా అయితే తమకు నచ్చిన బ్యాట్స్మెన్ బాటింగ్ చేయాలి అని కోరుకుంటారో.. టి20 ఫార్మాట్లో అలాంటి బ్యాటింగ్ చూసేందుకు అవకాశం ఉంటుంది. Cricet{#}Cricket;Indonesia;Mongolia;Sri Lanka;Audience;INTERNATIONAL;ICC T20చెత్త రికార్డ్ : అంతర్జాతీయ టి20.. 15 పరుగులకే ఆలౌట్?చెత్త రికార్డ్ : అంతర్జాతీయ టి20.. 15 పరుగులకే ఆలౌట్?Cricet{#}Cricket;Indonesia;Mongolia;Sri Lanka;Audience;INTERNATIONAL;ICC T20Wed, 20 Sep 2023 10:28:00 GMTఇటీవల కాలంలో అంతర్జాతీయ క్రికెట్లో టి20 ఫార్మాట్కు ఉన్న క్రేజ్ అంతకంతకు పెరిగిపోతూ ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే టీ20 ఫార్మాట్ కు ప్రేక్షకాదరణ పెరిగిపోతున్న నేపథ్యంలో టెస్ట్ ఫార్మాట్ తో పాటు వన్డే ఫార్మాట్  కూడా కాస్త ప్రమాదంలో పడిపోతున్నాయి అని చెప్పాలి. అయితే టి20 ఫార్మాట్ ప్రేక్షకులకు ఎక్కువగా నచ్చడానికి కారణం ఇక ఈ ఫార్మాట్లో ఉండే మెరుపు ఇన్నింగ్స్ లే. ప్రేక్షకులు ఎలా అయితే తమకు నచ్చిన బ్యాట్స్మెన్ బాటింగ్ చేయాలి అని కోరుకుంటారో.. టి20 ఫార్మాట్లో అలాంటి బ్యాటింగ్ చూసేందుకు అవకాశం ఉంటుంది. సాధారణంగా అయితే క్రిజులోకి వచ్చిన బ్యాట్స్మెన్ కుదురుకోవడానికి కాస్త సమయం తీసుకుంటూ ఉంటాడు.


 కానీ పొట్టి ఫార్మాట్లో అలా కాదు క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా మొదటి బంతి నుంచే సిక్సర్లు ఫోర్ లతో చెలరేగిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. దీంతో ఇక ఈ మెరుపు ఇన్నింగ్స్ ని చూసి అటు ప్రేక్షకులు కూడా మంత్రముగ్ధుల అవుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే మామూలుగా పొట్టి ఫార్మాట్లో ఇలా బ్యాట్స్మెన్లు విధ్వంసం సృష్టించడం గురించి ఎక్కువగా వింటూ ఉంటాం. కానీ కొన్ని కొన్ని సార్లు కొన్ని టీమ్స్ భారీగా పరుగులు చేయాలనే తొందరపాటులో చివరికి అతి తక్కువ పరుగులు చేసిన చెత్త రికార్డును కూడా మూటగట్టుకుంటూ ఉంటాయి అని చెప్పాలి.


 ఇటీవల ఇదే జరిగింది. మొన్నటికి మొన్న శ్రీలంక టీం ఆసియా కప్ లో 50 పరుగులకు ఆల్ అవుట్ అయింది అన్న విషయం గురించి మర్చిపోకముందే ఇక ఇప్పుడు మరో టీం 15 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ టి20 లో మంగోలియా జట్టు ఒక చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఏషియన్ గేమ్స్ ఉమెన్స్ క్రికెట్ లో ఇటీవలే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఇండోనేషియా నాలుగు వికెట్లు కోల్పోయి  187 పరుగులు చేయగా.. ఆ తర్వాత భారీ లక్ష్య చేదనకు బరిలోకి దిగిన మంగోలియా 15 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అందుకే ప్రభాస్ కి పెళ్లి కావట్లేదు.. షాకింగ్ విషయం చెప్పిన జక్కన్న?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>