MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgబర్నింగ్ స్టార్ గా తలుగు ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న సంపూర్ణేష్ బాబు ‘హృదయ కాలేయం’ ‘కొబ్బరిమట్ట’ సినిమాల తరువాత పాపులర్ హీరోగా మారాడు. అయితే ఆతరువాత అతడు నటించిన సినిమాలు వరసగా పరాజయం చెందడంతో అతడి మార్కెట్ పూర్తిగా పడిపోయింది. దీనితో అతడితో సినిమాలు తీయడానికి చాలమంది నిర్మాతలు వెనకడుగు వేశారు. ఇలాంటి పరిస్థితులలో అతడు లేటెస్ట్ గా నటిస్తున్న ‘మార్టిన్ లూథర్ కింగ్’ మూవీ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. సినిమా తీశారు. పూజా కొల్లూరు అనే యంగ్ డైరెక్టర్ sampoornesh babu{#}vegetable market;Athadu;Pooja Hegde;sampoornesh babu;Remake;Tollywood;Elections;Venkatesh;October;Tamil;Director;Cinemaసంపూర్ణేష్ బాబుకు పరీక్షలు పెడుతున్న మార్టిన్ లూథర్ కింగ్ !సంపూర్ణేష్ బాబుకు పరీక్షలు పెడుతున్న మార్టిన్ లూథర్ కింగ్ !sampoornesh babu{#}vegetable market;Athadu;Pooja Hegde;sampoornesh babu;Remake;Tollywood;Elections;Venkatesh;October;Tamil;Director;CinemaWed, 20 Sep 2023 15:36:35 GMTబర్నింగ్ స్టార్ గా తలుగు ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న సంపూర్ణేష్ బాబు ‘హృదయ కాలేయం’ ‘కొబ్బరిమట్ట’ సినిమాల తరువాత పాపులర్ హీరోగా మారాడు. అయితే ఆతరువాత అతడు నటించిన సినిమాలు వరసగా పరాజయం చెందడంతో అతడి మార్కెట్ పూర్తిగా పడిపోయింది. దీనితో అతడితో సినిమాలు తీయడానికి చాలమంది నిర్మాతలు వెనకడుగు వేశారు.



ఇలాంటి పరిస్థితులలో అతడు లేటెస్ట్ గా నటిస్తున్న ‘మార్టిన్ లూథర్ కింగ్’ మూవీ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. సినిమా తీశారు. పూజా కొల్లూరు అనే యంగ్ డైరెక్టర్ ఈసినిమాను తీస్తుంటే ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ వెంకటేష్ మహా ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడంతో పాటు ఒక ముఖ్య పాత్ర కూడా చేసినట్లు తెలుస్తోంది



వాస్తవానికి సంపూర్ణేష్ బాబు నటిస్తున్న ‘మార్టిన్ లూథర్ కింగ్’ స్ట్రెయిట్ మూవీ కాదు. తమిళంలో సూపర్ హిట్టయిన ‘మండేలా’ మూవీకి ఇది ఒక రీమేక్ ఈకథ అంతా ఒక బార్బర్ చుట్టూ తిరుగుతుంది. పంచాయితీ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఆపల్లెటూరులో పోటీ విపరీతంగా మారిపోవడంతో ఒక బార్బర్ ఓటు అత్యంత కీలకంగా మారుతుంది. అప్పటి వరకు ఆ గ్రామంలో చిన్నచూపు చూసిన బార్బర్ ఓటు కీలకం కావడంతో అతడి ఓటు కోసం అతడిని ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్ధులు మహారాజుల చూడటం మొదలుపెడతారు.



పూర్తి వినోదాత్మకంగా సాగే ఈకథ చివరిలో ప్రేక్షకుల హృదయాలకు కనెక్ట్ అయ్యే ఒక సెంటిమెంట్ సీన్ ఉంటుంది. ఈమధ్య కాలంలో తమిళంలో వచ్చిన సినిమాలలో గొప్ప సినిమాగా ఈసినిమా పై అనేకమంది ప్రసంశలు కురిపించారు. తమిళ హాస్య నటుడుడు యోగిబాబు అద్భుతమైన నటనకు విపరీతమైన ప్రశంసలు వచ్చాయి. అయితే ఇలాంటి ఉదాత్తమైన పాత్రను సంపూర్ణేష్ పోషిస్తే సగటు ప్రేక్షకుడు ఎంతవరకు కనెక్ట్ అవుతారు అన్న సస్పెన్స్ కు ఈసినిమా విడుదలయ్యే అక్టోబర్ 27న సమాధానం దొరుకుతుంది..





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రవితేజ తో రొమాన్స్ కి రెడీ అయిన రష్మిక మందన.. ఏ సినిమాలో అంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>