MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpg సంక్రాంతి పండుగ రావడానికి ఇంకా నాలుగు నెలల సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే అనేక భారీ సినిమాలు తమ రిలీజ్ డేట్స్ ను చాల ముందుగానే ప్రకటించుకుని తమకు ఎటువంటి పోటీ లేకుండా చూసుకోవాలని అనేక వ్యూహాలు రచిస్తున్నాయి. మహేష్ ‘గుంటూరు కారం’ తో పాటు రవితేజా విజయ్ దేవరకొండ నాగార్జున సినిమాలు కూడ సంక్రాంతి రేస్ కు రాబోతున్నాయి. అయితే ఇన్ని భారీ సినిమాల మధ్య ఒక చిన్న సినిమా కేవలం హనుమంతుడి సెంటిమెంట్ ను నమ్ముకుని భారీ సినిమాల మధ్య విడుదల అవుతూ ఉండటం ఎవరికీ అర్థంకాని విషయంగా మారింది.చిన్న హీరో తేజ సజ్జ హీరోగhanumman{#}trivikram srinivas;Makar Sakranti;January;Joseph Vijay;Ayodhya;Devarakonda;Ravi;INTERNATIONAL;festival;Hero;News;Telugu;India;Cinemaబయటపడ్డ హనుమాన్ స్ట్రాటజి !బయటపడ్డ హనుమాన్ స్ట్రాటజి !hanumman{#}trivikram srinivas;Makar Sakranti;January;Joseph Vijay;Ayodhya;Devarakonda;Ravi;INTERNATIONAL;festival;Hero;News;Telugu;India;CinemaWed, 20 Sep 2023 08:00:00 GMT
సంక్రాంతి పండుగ రావడానికి ఇంకా నాలుగు నెలల సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే అనేక భారీ సినిమాలు తమ రిలీజ్ డేట్స్ ను చాల ముందుగానే ప్రకటించుకుని తమకు ఎటువంటి పోటీ లేకుండా చూసుకోవాలని అనేక వ్యూహాలు రచిస్తున్నాయి. మహేష్ ‘గుంటూరు కారం’ తో పాటు రవితేజా విజయ్ దేవరకొండ నాగార్జున సినిమాలు కూడ సంక్రాంతి రేస్ కు రాబోతున్నాయి. అయితే ఇన్ని భారీ సినిమాల మధ్య ఒక చిన్న సినిమా కేవలం హనుమంతుడి సెంటిమెంట్ ను నమ్ముకుని భారీ సినిమాల మధ్య విడుదల అవుతూ ఉండటం ఎవరికీ అర్థంకాని విషయంగా మారింది.



చిన్న హీరో తేజ సజ్జ హీరోగా నటించిన ‘హనుమాన్’ జనవరి 12న రిలీజ్ చేయడం ఖాయం అంటూ వరసపెట్టి ప్రతినెలా ఒక ప్రకటన ఇస్తూనే ఉన్నారు. లేటెస్ట్ గా వినాయకచవితి పండుగరోజున కూడ ఈమూవీని సంక్రాంతిని టార్గెట్ చేస్తూ విడుదల చేయబోతున్నట్లు మళ్ళీ ప్రకటించారు. దీనితో ఈ చిన్న సినిమా సాహసం వెనుక కారణం ఏమిటి అంటూ చర్చలు జరుగుతున్నాయి.



ఈమూవీ సాహసం వెనుక ఒక ఆశక్తికర కారణం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మహేష్ త్రివిక్రమ్ ల ‘గుంటూరు కారం’ మూవీకి అదేవిధంగా రవితేజా నాగార్జున విజయ్ దేవరకొండల మూవీలకు కేవలం తెలుగు రాష్ట్రాలలో క్రేజ్ ఉంటుంది కాని మిగతా రాష్ట్రాలలో పెద్దగా ఉండడు. దీనికితోడు జనవరి 1న అయోధ్య రామ మందిరం ప్రారంభం జరుగుతున్న నేపధ్యంలో దేశం యావత్తు ఆనెల అంతా ఆధ్యాత్మిక వాతావరణంతో మారుమ్రోగి పోతుంది.



ఇలాంటి పరిస్థితులలో హనుమంతుడి కథకు పాన్ ఇండియా ఇమేజ్ ఉంటుంది కాబట్టి పెద్ద హీరోల సినిమాలతో పోటీ తమ సినిమాను ఏమాత్రం ప్రభావితం చేయలేదని ‘హనుమాన్’ నిర్మాతల అభిప్రాయం అని అంటున్నారు. దీనికితోడు ఈమూవీకి సంబంధించినా గ్రాఫిక్ వర్క్స్ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయి అని వార్తలు వస్తున్న నేపధ్యంలో చిన్న సినిమా అయినప్పటికీ తమ ‘హనుమాన్’ సంచలనాలు సృష్టిస్తుందని ఈమూవీ నిర్మాతల నమ్మకం అని అంటున్నారు..  





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అందుకే ప్రభాస్ కి పెళ్లి కావట్లేదు.. షాకింగ్ విషయం చెప్పిన జక్కన్న?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>