PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/purandewswari-bjp-tdp10d08965-6abb-4edb-9c87-f2cce077c3ee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/purandewswari-bjp-tdp10d08965-6abb-4edb-9c87-f2cce077c3ee-415x250-IndiaHerald.jpgఇక్కడ గమనించాల్సింది ఏమంటే తమతో మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత బీజేపీతో కాకుండా చంద్రబాబుతో అంటకాగుతున్నారు. బీజేపీతో పొత్తులో ఉంటు టీడీపీతో కలిసి రాబోయే ఎన్నికల్లో పోటీచేస్తామని ప్రకటించేశారు. పురందేశ్వరికి కూడా బావ చంద్రబాబుతో కలిసిపోవాలని ఉన్నట్లే ఉంది చూస్తుంటే. అయితే ఈ విషయాన్ని డిసైడ్ చేయాల్సింది నరేంద్రమోడీ, అమిత్ షా మాత్రమే. వాళ్ళేమో చంద్రబాబును ఎంతవీలుంటే అంత దూరంగా ఉంచుతున్నారు. purandewswari bjp tdp{#}Amith Shah;Daggubati Venkateswara Rao;Daggubati Purandeswari;advertisement;Narendra Modi;Party;central government;TDP;Elections;Janasena;Jagan;CBN;Venkatesh;Bharatiya Janata Partyఅమరావతి : పురందేశ్వరికి దిక్కుతోచటంలేదా ?అమరావతి : పురందేశ్వరికి దిక్కుతోచటంలేదా ?purandewswari bjp tdp{#}Amith Shah;Daggubati Venkateswara Rao;Daggubati Purandeswari;advertisement;Narendra Modi;Party;central government;TDP;Elections;Janasena;Jagan;CBN;Venkatesh;Bharatiya Janata PartyTue, 19 Sep 2023 07:00:00 GMT


రాష్ట్రరాజకీయాల్లో ఏమి జరుగుతోందో దగ్గుబాటి పురందేశ్వరికి దిక్కుతోచటంలేదా ? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానంగా ఉంది. బీజేపీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి పార్టీని సొంతంగా నడపటానికి కాకుండా చంద్రబాబునాయుడుకు మద్దతుగానే నిలస్తున్నారు. చంద్రబాబుకు మద్దతుగాను జగన్మోహన్ రెడ్డికి పూర్తి వ్యతిరేకంగాను ఆమె వ్యవహరిస్తున్న విషయాన్ని అందరు చూస్తున్నదే.




ఇక్కడ గమనించాల్సింది ఏమంటే తమతో మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత బీజేపీతో కాకుండా చంద్రబాబుతో అంటకాగుతున్నారు. బీజేపీతో పొత్తులో ఉంటు టీడీపీతో కలిసి రాబోయే ఎన్నికల్లో పోటీచేస్తామని ప్రకటించేశారు. పురందేశ్వరికి కూడా బావ చంద్రబాబుతో కలిసిపోవాలని ఉన్నట్లే ఉంది చూస్తుంటే. అయితే ఈ విషయాన్ని డిసైడ్ చేయాల్సింది నరేంద్రమోడీ, అమిత్ షా మాత్రమే. వాళ్ళేమో చంద్రబాబును ఎంతవీలుంటే అంత దూరంగా ఉంచుతున్నారు.





ఇదే సమయంలో జగన్ ప్రభుత్వంపై పురందేశ్వరి ఎన్ని ఆరోపణలు చేసినా కేంద్రమంత్రులు వాటికి విరుద్ధంగా ప్రకటనలు ఇస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏమిచేయాలో పురందేశ్వరికి దిక్కుతోస్తున్నట్లు లేదు. సొంతంగా పార్టీ లైను తీసుకునేందుకు లేదు. కేంద్ర నాయకులు ఏమో ఈమె ఆలోచనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. తమ మిత్రపక్ష పార్టీయేమో టీడీపీతో కలిసి ఎన్నికల్లో పాల్గొంటామని ప్రకటించేసింది. ఈ పరిస్ధితిల్లో బీజేపీని ఎలా ముందుకు నడిపించాలో పురందేశ్వరికి అర్ధంకావటంలేదు. ఇదే సమయంలో చంద్రబాబు అరెస్టు, రిమాండు విషయంలో కూడా పురందేశ్వరి తన సొంత ఆలోచనలను అమలుచేయలేక, పార్టీ విధానానికి కట్టుబడి ఉండలేక అవస్తలు పడుతున్నారు.





ఒకవైపు ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి, మరోవైపు రాజకీయంగా సరైన క్లారిటి రావటంలేదు. చంద్రబాబు, టీడీపీ విషయంలో జగన్ తనపని తాను చేసుకుపోతున్నారు. నరేంద్రమోడీ ఏమో ఏమీ పట్టన్నట్లు చూస్తు కూర్చున్నారు. వీళ్ళ వైఖరి కూడా పురందేశ్వరికి అర్ధమవుతున్నట్లు లేదు. టీడీపీ సినియర్ నేతలేమో చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ పెద్దల పాత్రుందని పదేపదే బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నారు. దాన్ని ఎలా ఖండించాలో అర్ధంకాక పురందేశ్వరి తల పట్టుకుని కూర్చున్నారు. ఏదో తప్పదు కాబట్టి బయటకు బీజేపీ పాత్రలేదని మొహమాటానికి ఖండిస్తున్నారంతే.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

11 రోజుల్లో "జవాన్" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>