Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntrcf6234f1-d9b7-460f-889d-74b88d315e19-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntrcf6234f1-d9b7-460f-889d-74b88d315e19-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్. ఇద్దరు కూడా భారీ బ్యాగ్రౌండ్ నుంచి ఇండస్ట్రీకి పరిచయమైన వారె. ఆ తర్వాత తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుని.. ఇక ఇప్పుడు స్టార్ హీరోలుగా కొనసాగుతూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో అటు అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ హీరోగా మారిపోతే ఇక జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు అని చెప్పాలి. అయితే ఈ ఇద్దరు స్టార్ హీరోలు మధ్యNtr{#}Janhvi Kapoor;Sridevi Kapoor;koratala siva;rashmika mandanna;Samantha;Arjun;Jr NTR;NTR;Rajamouli;Heroine;Allu Arjun;Cinema;Indiaఎన్టీఆర్ కు హీరోయిన్.. బన్నీకి మాత్రం ఐటమ్ గర్ల్?ఎన్టీఆర్ కు హీరోయిన్.. బన్నీకి మాత్రం ఐటమ్ గర్ల్?Ntr{#}Janhvi Kapoor;Sridevi Kapoor;koratala siva;rashmika mandanna;Samantha;Arjun;Jr NTR;NTR;Rajamouli;Heroine;Allu Arjun;Cinema;IndiaTue, 19 Sep 2023 17:30:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్. ఇద్దరు కూడా భారీ బ్యాగ్రౌండ్ నుంచి ఇండస్ట్రీకి పరిచయమైన వారె. ఆ తర్వాత తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుని.. ఇక ఇప్పుడు స్టార్ హీరోలుగా కొనసాగుతూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో అటు అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ హీరోగా మారిపోతే ఇక జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు అని చెప్పాలి.


 అయితే ఈ ఇద్దరు స్టార్ హీరోలు మధ్య ఎంత బలమైన స్నేహబంధం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా ఒకరిని ఒకరు బావ అంటే బావ అని పిలుచుకుంటూ ఉంటారు. ఒకరి సక్సెస్ను ఒకరు సెలబ్రేట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఈ ఇద్దరు హీరోలకు సంబంధించిన ఒక వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. తారక్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ఒక హీరోయిన్ అల్లు అర్జున్ మూవీలో ఐటెం సాంగ్ చేయబోతుందట.



 జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ దేవర అనే మూవీ చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ రూపొందుతుంది. అయితే ఈ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉంది అని చెప్పాలి. ఇదే ఆమెకు తెలుగులో మొదటి సినిమా. కాగా 2024 ఏప్రిల్ 5వ తేదీన దేవర సినిమా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే పుష్ప 2 లో అటు రష్మిక హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా 2024 ఆగస్టు 15వ తేదీన రాబోతుంది. అయితే తొలి భాగంలో సమంత స్పెషల్ సాంగ్ హైలెట్గా నిలిచినట్టే.. సెకండ్ పార్ట్ లోను ఐటమ్ సాంగ్ సినిమాకు ఏసెట్ గా మారనుందట. ఇక ఈ పాటలో జాన్విని ఫిక్స్ చేశారని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతుందట.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

యానిమల్: అప్పుడు సోషల్ మీడియా షేక్ అవ్వడం పక్కా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>