MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahes-kajal835d196d-4628-443d-b6d9-89065282e0af-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahes-kajal835d196d-4628-443d-b6d9-89065282e0af-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే . భారీ మాస్ యాక్షన్ మూవీ గా వస్తున్న ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నట్లు ఇప్పటికే కన్ఫామ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మూడవ హీరోయిన్ కూడా ఉందని నెట్టింట ఒక వార్త చాలా వైరల్ గా మారుతోంది. అయితే కేవలం రెండు సన్నివేశాల కోసం మాత్రమే ఇంకో హీరోయిన్ తో సంప్రదింపులు జరుపుతున్నాMAHES;KAJAL{#}choudary actor;Rajamouli;trivikram srinivas;Guntur;Red chilly powder;Film Industry;BUSINESS;Makar Sakranti;Nijam;Heroine;mahesh babu;kajal aggarwal;Mass;sree;Cinema;January;India;CBNముచ్చటగా మూడోసారి ఆ హీరోయిన్ తో జతకట్టనున్న మహేష్ బాబు..!ముచ్చటగా మూడోసారి ఆ హీరోయిన్ తో జతకట్టనున్న మహేష్ బాబు..!MAHES;KAJAL{#}choudary actor;Rajamouli;trivikram srinivas;Guntur;Red chilly powder;Film Industry;BUSINESS;Makar Sakranti;Nijam;Heroine;mahesh babu;kajal aggarwal;Mass;sree;Cinema;January;India;CBNTue, 19 Sep 2023 14:00:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే . భారీ మాస్ యాక్షన్ మూవీ గా వస్తున్న ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నట్లు ఇప్పటికే కన్ఫామ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మూడవ హీరోయిన్ కూడా ఉందని నెట్టింట ఒక వార్త చాలా వైరల్ గా మారుతోంది.

అయితే కేవలం రెండు సన్నివేశాల కోసం మాత్రమే ఇంకో హీరోయిన్ తో సంప్రదింపులు జరుపుతున్నారని..  ఇక ఆమె ఎవరో కాదు కాజల్ అగర్వాల్ అని సమాచారం. ముఖ్యంగా ఆ పాత్రలో కాజల్ అయితేనే బాగుంటుందని మేకర్స్ ఆలోచనలో పడ్డారట.  అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. కాజల్ అగర్వాల్ ఈ వార్త నిజమయి ఇందులో నటిస్తే ముచ్చటగా మూడోసారి మహేష్ బాబు తో నటించినట్లు అవుతుంది.


ఇప్పటికే మహేష్ బాబు - కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో బ్రహ్మోత్సవం,  బిజినెస్ మ్యాన్ వంటి చిత్రాలు రాగా.. ఇప్పుడు గుంటూరు కారం లో కూడా ఈమె భాగం పంచుకుంటే ముచ్చటగా మూడోసారి మహేష్ బాబుతో నటించినట్లే అంటూ అభిమానుల సైతం కామెంట్లు చేస్తున్నారు . మరి కాజల్ అగర్వాల్ మహేష్ బాబు సినిమాలో నటిస్తుందా లేక ఇతర సినిమాల డేట్స్ కారణంగా ఈ సినిమాను మిస్ చేసుకుంటుందా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మరొకవైపు మహేష్ బాబు గుంటూరు కారం సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉండగా..  ఇప్పుడు రాజమౌళి మాత్రం మేడిన్ ఇండియా అనే ఫిలిం ఇండస్ట్రీ బయోపిక్ తో నిర్మాతగా మారనున్నారు.  మరి ఆయన ఈ సినిమా పూర్తి చేసి మహేష్ తో మూవీ చేస్తారా? లేక మహేష్ తో మూవీ ముందే చేస్తారా ? అన్నది ఇంకా సస్పెన్స్ గానే మిగిలింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

యానిమల్: అప్పుడు సోషల్ మీడియా షేక్ అవ్వడం పక్కా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>