Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle64021765-7c34-487b-b6f5-df8f173ac042-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle64021765-7c34-487b-b6f5-df8f173ac042-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య అండ్ కార్తీ తమిళంతో పాటు తెలుగు ఆడియన్స్ లో కూడా భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. కమల్ హాసన్, రజినీకాంత్ తరువాత టాలీవుడ్ ఆడియన్స్ అంత దగ్గర చేసుకున్నది ఈ బ్రదర్స్ ని మాత్రమే.వీరిద్దరి సినిమాలను మాత్రమే కాదు పుట్టినరోజు వేడుకలను కూడా ఇక్కడ హీరోలతో సమానంగా చేస్తారు తెలుగు అభిమానులు. కాగా టాలీవుడ్ టు కోలీవుడ్ ప్రతి ఒక్క అభిమాని.. వీరిద్దరి కలయికలో ఒక మల్టీస్టారర్ కోసం ఎదురు చూస్తున్నారు.దీని గురించి ఎప్పటి నుంచి చర్చ కూడా నడుస్తుంది. తాజాగా ఈ విషయం గురించి కార్తీ ఒకsocialstars lifestyle{#}Good news;Khaidi.;Khaidi new;Good Newwz;Lokesh Kanagaraj;Kollywood;surya sivakumar;Rajani kanth;Tollywood;Cinema;Telugu;Audienceమల్టీ స్టారర్ మూవీకి రెడీ అవుతున్న కోలీవుడ్ బ్రదర్స్....!!మల్టీ స్టారర్ మూవీకి రెడీ అవుతున్న కోలీవుడ్ బ్రదర్స్....!!socialstars lifestyle{#}Good news;Khaidi.;Khaidi new;Good Newwz;Lokesh Kanagaraj;Kollywood;surya sivakumar;Rajani kanth;Tollywood;Cinema;Telugu;AudienceTue, 19 Sep 2023 20:19:00 GMTకోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య  అండ్ కార్తీ  తమిళంతో పాటు తెలుగు ఆడియన్స్ లో కూడా భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. కమల్ హాసన్, రజినీకాంత్ తరువాత టాలీవుడ్ ఆడియన్స్ అంత దగ్గర చేసుకున్నది ఈ బ్రదర్స్ ని మాత్రమే.వీరిద్దరి సినిమాలను మాత్రమే కాదు పుట్టినరోజు వేడుకలను కూడా ఇక్కడ హీరోలతో సమానంగా చేస్తారు తెలుగు అభిమానులు. కాగా టాలీవుడ్ టు కోలీవుడ్ ప్రతి ఒక్క అభిమాని.. వీరిద్దరి కలయికలో ఒక మల్టీస్టారర్ కోసం ఎదురు చూస్తున్నారు.దీని గురించి ఎప్పటి నుంచి చర్చ కూడా నడుస్తుంది. తాజాగా ఈ విషయం గురించి కార్తీ ఒక ఇంటర్వ్యూలో గుడ్ న్యూస్ చెప్పాడు. 

మొదటిలో సూర్యతో కలిసి నటించడానికి భయపడినట్లు, కానీ ఇప్పుడు మాత్రం అన్నయ్యతో కలిసి సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ఇద్దరి కలయికలో ఒక మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకు రావడానికి ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నాడు. త్వరలోనే ఇద్దర్ని కలిసి ఒక సినిమాలో చూస్తారని వెల్లడించాడు.
అలాగే ప్రస్తుతం ఖైదీ 2 సినిమా స్క్రిప్ట్ వర్క్ పనులు జరుగుతున్నాయని కూడా చెప్పుకొచ్చాడు. అయితే ఈ మూవీలోనే సూర్య అండ్ కార్తీ కలిసి నటించబోతున్నారని తమిళనాట టాక్ వినిపిస్తుంది. ఇటీవల 'విక్రమ్' సినిమాలో సూర్య గెస్ట్ రోల్ లో కనిపిస్తే, కార్తీ వాయిస్ తో కనిపించి థ్రిల్ చేశాడు. ఖైదీ 2 లో ఢిల్లీ, రోలెక్స్ పాత్రలు కలవనున్నాయని కొన్నిరోజుల నుంచి టాక్ వినిపిస్తుంది.


ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో కార్తీ ఇలా మాట్లాడంతో ఈ వార్త నిజమయ్యే ఛాన్స్ ఉందని అభిమానులు సంబర పడుతున్నారు.కాగా లోకేష్ కానగరాజ్ తన తదుపరి ప్రాజెక్ట్ రజినీకాంత్ తో చేయాల్సి ఉంది. అది పూర్తి అయిన తరువాత ఖైదీ 2 పట్టాలు ఎక్కనుందని తెలుస్తుంది. కార్తీ కూడా ఈ గ్యాప్ లో తన కమిట్‌మెంట్స్ పూర్తి చేయనున్నాడు. ప్రస్తుతం కార్తీ నటించిన 'జపాన్' రిలీజ్ కి సిద్దమవుతుంది. దీపావళికి ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఫ్రెండ్ పార్టీలో రెచ్చిపోయిన ప్రగ్యా జైస్వాల్.. అందం చూస్తే అంతే..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>