MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna-movie4217dbe4-bf59-42bc-a5ff-fb259b873341-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna-movie4217dbe4-bf59-42bc-a5ff-fb259b873341-415x250-IndiaHerald.jpg టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన నాగార్జున గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్నారు. వరుసగా ఫెయిల్యూర్ తో అభిమానులను కూడా నిరాశ పరుస్తున్న నాగార్జున ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలని భావించి.. ఈ క్రమంలోనే రీసెంట్గా ఆయన ఒక కొత్త సినిమాని ప్రకటించారు. ఆ సినిమానే నా సామిరంగ.. ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్, టీజర్ లో నాగార్జున చూడడానికి చాలా క్లాసు గా ఉన్నారు. మాస్ రోల్స్ లో కూడా అదరగొట్టేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే ఈసారి ఆయన తనకు కరెక్ట్ గా సూట్ అయ్యే మాస్ పాత్రలో ఉండే సినిమాని ఎంచుకున్నటNAGARJUNA;MOVIE{#}Akkineni Nagarjuna;m m keeravani;Cinema;king;Car;King;Success;Joseph Vijay;Posters;Mass;Chitramఅక్కినేని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఆరోజే నా సామిరంగ రిలీజ్..!!అక్కినేని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఆరోజే నా సామిరంగ రిలీజ్..!!NAGARJUNA;MOVIE{#}Akkineni Nagarjuna;m m keeravani;Cinema;king;Car;King;Success;Joseph Vijay;Posters;Mass;ChitramTue, 19 Sep 2023 06:44:40 GMT
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన నాగార్జున గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్నారు. వరుసగా ఫెయిల్యూర్ తో అభిమానులను కూడా నిరాశ పరుస్తున్న నాగార్జున ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలని భావించి.. ఈ క్రమంలోనే రీసెంట్గా ఆయన ఒక కొత్త సినిమాని ప్రకటించారు. ఆ సినిమానే నా సామిరంగ.. ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్, టీజర్ లో నాగార్జున చూడడానికి చాలా క్లాసు గా ఉన్నారు. మాస్ రోల్స్ లో కూడా అదరగొట్టేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే ఈసారి ఆయన తనకు కరెక్ట్ గా సూట్ అయ్యే మాస్ పాత్రలో ఉండే సినిమాని ఎంచుకున్నట్లుగా అభిమానులు భావిస్తూ ఉన్నారు.


డైరెక్టర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కించారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పలు రకాల అప్డేట్లు కూడా బాగానే ఆకట్టుకుంటున్నాయి త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. గ్లింప్స్ చూసిన తర్వాత ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని ధీమాతో అక్కినేని అభిమానులు ఉన్నారు. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా నుంచి తాజాగా ఒక పోస్టర్ని సైతం విడుదల చేశారు చిత్ర బృందం.


ఈ పోస్టర్లో నాగార్జున పంచకట్టులో మరొకసారి ఆకట్టుకుంటున్నారు. చేతిలో బీడీ కాలుస్తూ మరోచేతో పంచపట్టుకోని నిలబడ్డారు..ఆయన పక్కనే ఒక కారు కూడా ఉంది. ఆ కారు మీద కింగ్ అని రాసి ఉంది.. అదేవిధంగా ఆ కారు మీద రక్తపు మరకలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నాగార్జున వెనుక కొందరు డబ్బులతో వాయిస్తున్నట్లుగా కనిపిస్తోంది.. పోస్టర్ తోనే చిత్ర బృందం మరొక అప్డేట్ ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ వచ్చే ఏడాది 2024లో సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ చిత్రానికి సంగీతాన్ని కీరవాణి అందిస్తూ ఉన్నారు బెజవాడ ప్రసన్నకుమార్ సంభాషణలు అందిస్తున్నట్లుగా తెలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

11 రోజుల్లో "జవాన్" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>