PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/brahmani-tdp-lokesh9defb4fd-a31a-46bd-8633-2942c73db8bf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/brahmani-tdp-lokesh9defb4fd-a31a-46bd-8633-2942c73db8bf-415x250-IndiaHerald.jpgరాబోయే ఎన్నికల్లో నారా బ్రాహ్మణి ఎన్నికల్లో పోటీచేయాలని అనుకుంటున్నారా ? ఆమె అనుకుంటున్నదో లేదో తెలీదు కానీ ఎల్లోమీడియా మాత్రం విపరీతంగా హైప్ ఇస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబునాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబుతో పాటు కొడుకు లోకేష్ పైన కూడా కేసులు నమోదవుతాయని, ఆయన్ను కూడా జైలుకు పంపుతారనే ప్రచారం అందరికీ తెలిసిందే.brahmani tdp lokesh{#}Amaravati;Rajahmundry;bhuvaneshwari;Nara Brahmani;Nara Bhuvaneshwari;TDP;NTR;CBN;Yevaru;Lokesh;Lokesh Kanagarajఅమరావతి : బ్రాహ్మణి కీలకనిర్ణయం ?అమరావతి : బ్రాహ్మణి కీలకనిర్ణయం ?brahmani tdp lokesh{#}Amaravati;Rajahmundry;bhuvaneshwari;Nara Brahmani;Nara Bhuvaneshwari;TDP;NTR;CBN;Yevaru;Lokesh;Lokesh KanagarajTue, 19 Sep 2023 03:00:00 GMT


రాబోయే ఎన్నికల్లో నారా బ్రాహ్మణి ఎన్నికల్లో పోటీచేయాలని అనుకుంటున్నారా ? ఆమె అనుకుంటున్నదో లేదో తెలీదు కానీ ఎల్లోమీడియా మాత్రం విపరీతంగా హైప్ ఇస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబునాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబుతో పాటు కొడుకు లోకేష్ పైన కూడా కేసులు నమోదవుతాయని, ఆయన్ను కూడా జైలుకు పంపుతారనే ప్రచారం అందరికీ తెలిసిందే.





ఎందుకంటే స్కిల్ స్కామ్ లో చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా ఉన్నారని, ఇదే కాకుండా ఫైబర్ గ్రిడ్, అమరావతి భూ కుంభకోణం లాంటి కేసుల్లో లోకేష్ పాత్ర చాలా ఉందని సీఐడీ అనుమానిస్తోంది. తమ అనుమానాలకు ఆధారాలు కూడా దొరుకుతున్నట్లు సీఐడీ చీఫ్ సంజయ్ ఇప్పటికే చెప్పారు. కాబట్టి ఏదోరోజు లోకేష్ కూడా అరెస్టయ్యే అవకాశాలున్నాయని టీడీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు.





ఒకవేళ అదే జరిగితే రాబోయే ఎన్నికలవరకు చంద్రబాబు, లోకేష్ ఇద్దరు రిమాండులోనే ఉండే అవకాశాలున్నాయని తమ్ముళ్ళు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగానే లోకేష్ పాత్రను బ్రాహ్మణి పోషించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీలో చేర్చలు జరుగుతున్నాయి. చంద్రబాబు అరెస్టు నుండి భువనేశ్వరి, బ్రాహ్మణి రాజమండ్రిలోనే క్యాంపు వేసున్న విషయం అందరికీ తెలిసిందే. గతంలో ఎప్పుడూ అత్తా, కొడళ్ళిద్దరు రాజకీయాల్లో యాక్టివ్ పాల్గొన్న దాఖలాలు లేవు. హెరిటేజ్, ఎన్టీయార్ ట్రస్ట్ భవన్ కార్యక్రమాలకు మాత్రమే పరిమితమయ్యారు.





2019 ఎన్నికల్లో లోకేష్ తరపున మంగళగిరిలో బ్రాహ్మణి రోడ్డుషోలు  నిర్వహించారు. మళ్ళీ ఎప్పుడూ రాజకీయాల్లో కనబడలేదు. అలాంటిది రాబోయే ఎన్నికల్లో బ్రాహ్మణి పోటీచేసే అవకాశాలు ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. మరి మంగళగిరిలో పోటీచేస్తారా లేకపోతే ఇంకెక్కడైనా పోటీచేస్తారా అన్న విషయమై క్లారిటిలేదు. బ్రాహ్మణి పోటీచేస్తే మరి భువనేశ్వరి ఏమిచేస్తారు అనేది తెలీటంలేదు. ఈ ఇద్దరు పోటీచేస్తే ఎలాగుంటుంది అనే విషయమై ఎవరు ఏమీ చెప్పలేని స్ధితిలో ఉన్నారు. ఎందుకంటే కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో లోకేష్ గెలుపే అనుమానంగా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో వాళ్ళ ప్లేసులో వీళ్ళిద్దరు పోటీచేస్తే ఎలాగుంటుంది ? ఇదే ఇపుడు సస్పెన్సుగా మారింది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమరావతి : అప్పుడు కానీ పవన్ కు అర్ధంకాదా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>