HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health555d45f3-17c5-43b4-86b1-a2f6c08d773e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health555d45f3-17c5-43b4-86b1-a2f6c08d773e-415x250-IndiaHerald.jpgచాలా మంది కూడా మన పూర్వం నుంచి ఉపవాసం చేస్తూ ఉంటారు. ఏదో దైవ భక్తితో మూఢ నమ్మకంతో అనుకుంటున్నారా..? ఉపవాసం వాళ్ల మన జీర్ణ వ్యవస్థకు రెస్ట్ కలిగి చాలా మేలు కలుగుతుంది. ఈ విషయం ఉపవాసం చేసే వారికి కూడా తెలీదు.ఒబెసిటీ, డయాబెటిస్ లాంటి జబ్బులు పెరుగుతున్న ఈ కాలంలో ఉపవాసం అనేది చాలా మంచి మెడిసిన్.కొన్ని రకాల ఆహారపు అలవాట్ల వల్ల శరీరంలో సరిగా జీర్ణం కాకుండా హానికరమైన పదార్థాలనేవి తయారవుతాయి. ఇక వీటివల్ల ఫ్రీ రాడికల్స్ కూడా తయారవుతాయి. ఆయుర్వేదం ప్రకారం ఉపవాసం చేయడం వల్ల ఇలాంటి మలిన పదార్థాలు ఈజీగా తొలhealth{#}Sugar;Yevaru;Manamఉపవాసం ఆరోగ్యానికి ఎంత మంచిదంటే?ఉపవాసం ఆరోగ్యానికి ఎంత మంచిదంటే?health{#}Sugar;Yevaru;ManamTue, 19 Sep 2023 16:47:00 GMTచాలా మంది కూడా మన పూర్వం నుంచి ఉపవాసం చేస్తూ ఉంటారు. ఏదో దైవ భక్తితో మూఢ నమ్మకంతో  అనుకుంటున్నారా..? ఉపవాసం వాళ్ల మన జీర్ణ వ్యవస్థకు రెస్ట్ కలిగి చాలా మేలు కలుగుతుంది. ఈ విషయం ఉపవాసం చేసే వారికి కూడా తెలీదు.ఒబెసిటీ, డయాబెటిస్ లాంటి జబ్బులు పెరుగుతున్న ఈ కాలంలో ఉపవాసం అనేది చాలా మంచి మెడిసిన్.కొన్ని రకాల ఆహారపు అలవాట్ల వల్ల శరీరంలో సరిగా జీర్ణం కాకుండా హానికరమైన పదార్థాలనేవి తయారవుతాయి. ఇక వీటివల్ల ఫ్రీ రాడికల్స్ కూడా తయారవుతాయి. ఆయుర్వేదం ప్రకారం ఉపవాసం చేయడం వల్ల ఇలాంటి మలిన పదార్థాలు ఈజీగా తొలగిపోయి, ఫ్రీరాడికల్స్ తగ్గిపోతాయి.ఉపవాసం చేయడం వల్ల మన జీర్ణ వ్యవస్థకు ఖచ్చితంగా చక్కని ఆరోగ్యం చేకూరుతుంది. అలాగే అది మరింత చురుకుగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. జీర్ణ ప్రక్రియ చాలా వేగవంతం అవుతుంది. మనం తీసుకునే ఆహారం లోని ధాతువులు సక్రమంగా జీర్ణం కావడానికి మంచి బలం చేకూరుతుంది. సరిగా జీర్ణం కాలేనివి కూడా బాగా జీర్ణం అయ్యేట్టుగా ఇంకా మలినాలు తొలగిపోయేలా చేస్తుంది.చాలా సందర్భాల్లో మన ఆయుర్వేదంలో చెప్పిన విషయాలనే అల్లోపతి సైంటిస్టులు పరిశోధన చేసి చెప్తే గానీ మనం వాటిని నమ్మం. ఇక ఉపవాసం విషయంలో కూడా అలాగే జరిగింది. ఉపవాసం వల్ల జీర్ణ వ్యవస్థ చాలా చురుగ్గా పనిచేస్తుందని ఆధునిక శాస్త్ర పరిశోధనల్లో కూడా తేలింది. హానికరమైన టాక్సిక్ పదార్థాలను కూడా డైజెస్ట్ చేసి రీసైక్లింగ్  చేయొచ్చని కనుక్కున్నారు.


మనం ఉపవాసం చేయడం వల్ల ఆటోఫేజి ప్రక్రియ ద్వారా హానికర పదార్థాలను శరీరం చంపేస్తుందని ఈ పరిశోధనలో తేలింది.అయితే ఉపవాసం ఉండాలి కదా అని ఎప్పుడు పడితే అప్పుడు తిండి మానేయడం కాదు. దీనికీ కూడా ఓ పద్ధతి ఉంది. శరీర స్థితిగతులను బట్టి ఉపవాసం ఎలా చేయాలన్నది మనం నిర్ణయించుకోవాలి. ఆరోగ్య పరిస్థితులు బాగాలేకపోతే తిండి మానేయడం అస్సలు కరెక్ట్ కాదు. మరి ఈ ఉపవాసం ఎలా చేయాలి? అసలు ఎవరు చేయకూడదు? ఇప్పుడు మనం తెలుసుకుందాం.కడుపు మాడ్చుకోవడమే అసలు ఉపవాసం కాదు. దీన్ని కూడా ఒక క్రమ పద్ధతిలోనే చేయాలి. మన పరిమితికి మించని మేలు చేసే ఆహారం తీసుకోవాలని చెప్తుంది ఆయుర్వేదం. పంచేంద్రియాలు తృప్తిపడేలా మనం తీసుకునే ఆహారం అనేది ఉండాలి. రుచిగా ఉందని మాత్రం ఎక్కువగా తినొద్దు. అలాగే కడుపు మాడ్చుకోనూ వద్దు. ఫుడ్ తీసుకునే విషయంలో సమయపాలన ఖచ్చితంగా పాటించాలి. మన శరీర ఆరోగ్యం, పరిస్థితులను బట్టి ఉపవాసం చేయాలి. ఆరోగ్యంగా ఉన్నవాళ్లు వారానికి ఒకసారి ఉపవాసం ఉండడం వల్ల ఆరోగ్య ప్రయాజనాలు ఖచ్చితంగా ఉంటాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

యానిమల్: అప్పుడు సోషల్ మీడియా షేక్ అవ్వడం పక్కా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>