Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjun76fb28ae-9e17-48e0-8350-264a22754a39-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjun76fb28ae-9e17-48e0-8350-264a22754a39-415x250-IndiaHerald.jpgఅల్లు వారి వారసుడు.. మెగా ఇంటి మేనల్లుడు అల్లు అర్జున్ పేరు గత కొంతకాలం నుంచి వార్తల్లో తెగ హాట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పాలి. మొన్నటి వరకు కేవలం టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ గా కొనసాగిన అల్లు అర్జున్ ఇక పుష్పా సినిమాతో పాన్ ఇండియా హీరో రేంజ్ ను సంపాదించాడు అన్న విషయం తెలిసిందే. అన్ని భాషల్లోనూ పుష్పా సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం తర్వాత ఐకానిక్ స్టార్ గా మారిపోయిన అల్లు అర్జున్ ఇక ఇప్పుడు పుష్ప సినిమాకి సీక్వెల్ లో నటిస్తూ ఉన్నాడు. ఇక ఈ మూAlluarjun{#}london;Allu Arjun;bollywood;Tollywood;Telugu;Cinema;history;Indiaమొన్నే జాతీయ అవార్డు.. ఇప్పుడు బన్నీకి మరో అరుదైన గౌరవం?మొన్నే జాతీయ అవార్డు.. ఇప్పుడు బన్నీకి మరో అరుదైన గౌరవం?Alluarjun{#}london;Allu Arjun;bollywood;Tollywood;Telugu;Cinema;history;IndiaTue, 19 Sep 2023 16:15:00 GMTఅల్లు వారి వారసుడు.. మెగా ఇంటి మేనల్లుడు అల్లు అర్జున్ పేరు గత కొంతకాలం నుంచి వార్తల్లో తెగ హాట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పాలి. మొన్నటి వరకు కేవలం టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ గా కొనసాగిన అల్లు అర్జున్ ఇక పుష్పా సినిమాతో పాన్ ఇండియా హీరో రేంజ్ ను సంపాదించాడు అన్న విషయం తెలిసిందే. అన్ని భాషల్లోనూ పుష్పా సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం తర్వాత ఐకానిక్ స్టార్ గా మారిపోయిన అల్లు అర్జున్ ఇక ఇప్పుడు పుష్ప సినిమాకి సీక్వెల్ లో నటిస్తూ ఉన్నాడు.


 ఇక ఈ మూవీపై కూడా అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి అని చెప్పాలి. అంతేకాదు ఇక పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటనకు గాను ఇటీవలే జాతీయ ఉత్తమ నటుడి అవార్డులు అందుకున్నాడు అని చెప్పాలి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ అవార్డు సొంతం చేసుకున్న మొదటి హీరోగా చరిత్ర సృష్టించాడు ఐకానిక్ స్టార్. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ కు మరో అరుదైన గౌరవం దక్కబోతోంది అన్నది తెలుస్తుంది. చిత్ర పరిశ్రమలో ఎనలేని సేవలు చేసిన సెలబ్రిటీల విగ్రహాలను లండన్ లోని మేడం ట్యూస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.



 ఇప్పటివరకు టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, దీపికా పదుకొనే, బాలీవుడ్ గ్రీన్ బాడ్ హృతిక్ రోషన్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్యరాయ్ లకు సంబంధించి మైనపు విగ్రహాలు మేడం ట్యూస్సాడ్స్ లో ఏర్పాటు చేశారు. అయితే ఇక ఇప్పుడు మొన్నటికి మొన్న జాతీయ అవార్డును దక్కించుకున్న అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని కూడా ఇక మేడం ట్యూస్సాడ్స్ లో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే త్వరలోనే అల్లు అర్జున్ కొలతల కోసం యూకే వెళ్ళబోతున్నాడట. ఈ విషయం తెలిసి అటు అల్లు అర్జున్ అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది .



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

యానిమల్: అప్పుడు సోషల్ మీడియా షేక్ అవ్వడం పక్కా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>