EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chinaf5a252da-7419-4991-a07f-dd54468e42eb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chinaf5a252da-7419-4991-a07f-dd54468e42eb-415x250-IndiaHerald.jpgపాకిస్థాన్ సైన్యం నేరుగా యుద్ధానికి వస్తే శవాల్ని నేరుగా పార్సిల్ చేసే శక్తి భారత్ కు ఉంది. దీంతో పాక్ నేరుగా భారత్ తో యుద్దం చేయడానికి రెడీ గా ఉండదు. అందుకే ఎప్పుడూ తీవ్రవాదులకు శిక్షణ ఇచ్చి భారత్ లోని కశ్మీర్ ప్రాంతంలోని అనంత్ నాగ్ జిల్లా, ఇతర సమస్యాత్మక ప్రాంతాల్లో ఎప్పుడు దాడులకు తెగబడుతుంది. కానీ నరేంద్ర మోదీ వచ్చాక ఎక్కడ దాడి చేసినా దానికి సరిపడా సర్జికల్ స్ట్రైక్ చేయడం పాక్ లోని అంతర్గత ప్రాంతాల్లో రహస్యంగా తీవ్రవాదులు దాక్కున్న ప్రాంతాలను టార్గెట్ చేసుకుని దాడులు చేసి వారిని మట్టుబెట్టడంCHINA{#}Tawang;Pakistan;Army;contract;Gharshana;Dookudu;Anant Nag;Narendra Modi;Shakti;Indiaయుద్ధం: మళ్లీ నాటకాలు మొదలుపెట్టిన చైనా?యుద్ధం: మళ్లీ నాటకాలు మొదలుపెట్టిన చైనా?CHINA{#}Tawang;Pakistan;Army;contract;Gharshana;Dookudu;Anant Nag;Narendra Modi;Shakti;IndiaTue, 19 Sep 2023 05:00:00 GMTపాకిస్థాన్ సైన్యం నేరుగా యుద్ధానికి వస్తే శవాల్ని నేరుగా పార్సిల్ చేసే శక్తి భారత్ కు ఉంది. దీంతో పాక్ నేరుగా భారత్ తో యుద్దం చేయడానికి రెడీ గా ఉండదు. అందుకే ఎప్పుడూ తీవ్రవాదులకు శిక్షణ ఇచ్చి భారత్ లోని కశ్మీర్ ప్రాంతంలోని అనంత్ నాగ్ జిల్లా, ఇతర సమస్యాత్మక ప్రాంతాల్లో ఎప్పుడు దాడులకు తెగబడుతుంది. కానీ నరేంద్ర మోదీ వచ్చాక ఎక్కడ దాడి చేసినా దానికి సరిపడా సర్జికల్ స్ట్రైక్ చేయడం పాక్ లోని అంతర్గత ప్రాంతాల్లో రహస్యంగా తీవ్రవాదులు దాక్కున్న ప్రాంతాలను టార్గెట్ చేసుకుని దాడులు చేసి వారిని మట్టుబెట్టడం మన ఆర్మీకి అలవాటు అయిపోయింది.


అయితే ఇప్పుడు తాజాగా చైనా మాట్లాడుతూ.. చైనాలోని కొన్ని భూభాాగాల్లోకి భారత్ సైన్యం చొచ్చుకువచ్చిందని ప్రకటించింది. చైనా ఇచ్చిన ప్రకటనను హిందూస్థాన్ టైమ్స్ ప్రచురించింది. అక్రమంగా తమ ప్రాంతాలను ఆక్రమించుకుందని, తమ సైనికులను తరిమివేసిందని ఆరోపించింది. గాల్వాన్, తవాంగ్ లాంటి ప్రాంతాల్లో చైనా గతంలో ఆక్రమణలను చేస్తుందని భారత్ ప్రకటిస్తూ వచ్చేది. ప్రస్తుతం సీన్ రీవర్స్ అయింది. ఎప్పుడూ భారత్ ప్రకటలను చేస్తుండేది. కానీ ప్రస్తుతం చైనా ఆరోపణలు చేయడం విచిత్రంగా మారింది. ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తుంది. గతంలో గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో చాలా మంది చనిపోయిన విషయం తెలిసిందే.


డొక్లామ్, గాల్వాన్, తవాంగ్ లాంటి ప్రాంతాల్లో ప్రస్తుతం ఆయుధాలు వాడకున్నా.. అక్కడ ఘర్షణ జరిగితే ముష్టి యుద్దం జరిగినట్లే ఉంటుంది. కర్రలు, రాళ్లు, రప్పలతో ఫైట్ చేస్తుంటారు. రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం.. ఆయుధాలు సరిహద్దు ప్రాంతాల్లో వాడకూడదు. అయితే చైనా చేస్తున్న వాదనలు చూస్తుంటే ఈ మధ్య మళ్లీ సరిహద్దుల్లో వాతావరణం వేడేక్కినట్లే కనిపిస్తోంది.  భారత్ ఏకంగా దూకుడు మంత్రం ఉచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. కాబట్టి రాబోయే రోజుల్లో చైనా, భారత్ సరిహద్దులు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమరావతి : అప్పుడు కానీ పవన్ కు అర్ధంకాదా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>