MoneyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money-konchem-pettubaditho-bhaaree-adayam6bc6d341-7c81-4653-a761-e2ced4d7fd87-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money-konchem-pettubaditho-bhaaree-adayam6bc6d341-7c81-4653-a761-e2ced4d7fd87-415x250-IndiaHerald.jpgప్రస్తుత కాలంలో మహిళలు కూడా వ్యాపారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే అలాంటి వారికోసం ఒక చక్కటి బిజినెస్ ఐడియాతో మీ ముందుకు రావడం జరిగింది. ఇక ఈ బిజినెస్ ఐడియా మీకు మంచి ఆదాయాన్ని అందివ్వడమే కాదు సమాజంలో మీకు గౌరవాన్ని కూడా అందజేస్తుందని చెప్పవచ్చు. ఇక ప్రతి నెల మీరు రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు సంపాదించే అద్భుతమైన అవకాశం అని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే ఈ బిజినెస్ గురించి పూర్తి విషయాలు మనం ఒకసారి చదివి తెలుసుకుందాం.. MONEY{#}Manam;IdeaMoney: కొంచెం పెట్టుబడితో భారీ ఆదాయం..!Money: కొంచెం పెట్టుబడితో భారీ ఆదాయం..!MONEY{#}Manam;IdeaTue, 19 Sep 2023 11:00:00 GMTప్రస్తుత కాలంలో మహిళలు కూడా వ్యాపారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే అలాంటి వారికోసం ఒక చక్కటి బిజినెస్ ఐడియాతో మీ ముందుకు రావడం జరిగింది. ఇక ఈ బిజినెస్ ఐడియా మీకు మంచి ఆదాయాన్ని అందివ్వడమే కాదు సమాజంలో మీకు గౌరవాన్ని కూడా అందజేస్తుందని చెప్పవచ్చు.  ఇక ప్రతి నెల మీరు రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు సంపాదించే అద్భుతమైన అవకాశం అని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే ఈ బిజినెస్ గురించి పూర్తి విషయాలు మనం ఒకసారి చదివి తెలుసుకుందాం..

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఉండే మహిళల కోసం ఈ బిజినెస్ ను ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది.  ప్రస్తుతం మార్కెట్లో ఆర్గానిక్ కోడిగుడ్లు తినడానికి జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న  నేపథ్యంలో ఆర్గానిక్ కోడిగుడ్లు ఎటువంటి రసాయనాలు లేకుండా సేకరించి వాటిని మార్కెట్లో విక్రయించి భారీ డబ్బును సొంతం చేసుకోవచ్చు. సాధారణంగా సామాన్య కోడిగుడ్ల కంటే నాటు గుడ్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. కాబట్టి ఈ వ్యాపారం మీకు మంచి ఆదాయాన్ని అందిస్తుంది. అయితే ఇందుకోసం మీరు రెండు రకాలుగా ఆదాయాన్ని పొందవచ్చు.నాటు కోళ్లను పెంచడం.. తద్వారా వచ్చిన గుడ్లను అమ్మడం.. రెండూ కూడా మీకు మంచి ఆదాయాన్ని అందిస్తాయి.

మీ ఇంటి వెనుక భాగంలో కొంచెం స్థలం ఉంటే చాలు నాటు కోళ్ల పెంపకాన్ని ప్రారంభించవచ్చు. ఇక పెద్ద ఎత్తున మీరు ఈ పెంపకాన్ని ఏర్పాటు చేయాలి అనుకున్నట్లయితే చిన్న షెడ్డు నిర్మించుకోవాల్సి ఉంటుంది. అనంతరం షెడ్డులో డ్రిప్పు పద్ధతిలో పైపులను ఏర్పాటు చేయాలి. రైతుల నుండి నాటు కోడి పిల్లలను సేకరించి సాంప్రదాయ పద్ధతుల్లో కోళ్ల ఫారంలో కాకుండా ఫీల్డ్ లో తిరిగేలా పెంచినట్లయితే కోళ్లు ఆరోగ్యంగా పెరుగుతాయి. ఇక పగలు ఫీల్డ్ లో తిరిగిన తరువాత రాత్రిళ్ళు షెడ్డులో విశ్రాంతి తీసుకునేలా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే కొన్ని వారాల్లోనే మీరు నాణ్యమైన నాటు కోళ్లతో పాటు వాటి గుడ్లను కూడా పొందవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

11 రోజుల్లో "జవాన్" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>