DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/chandrababu9a271329-8bb7-41c6-bf71-22449aa8f07b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/chandrababu9a271329-8bb7-41c6-bf71-22449aa8f07b-415x250-IndiaHerald.jpgములాఖత్ బాబు అరెస్టుకు ముందు అంతగా ప్రాచుర్యం లేని పదం. ములాఖత్ అంటే జైలులో ఉన్న ఖైదీని కలవడం. గతంలో వారానికి మూడు రోజులు ములాఖత్ కు అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. కానీ జైలు అధికారులు రెండే సార్లు అని తేల్చి చెప్పారు. చంద్రబాబుని కలిసేందుకు తొలిసారి లోకేశ్, భువనేశ్వరి, బ్రాహ్మణి వెళ్లారు. రెండోసారి పవన్ కల్యాణ్, లోకేశ్, బాలకృష్ణ లు వెళ్లారు. మళ్లీ మూడోసారి కలిసేందుకు భువనేశ్వరి ప్రయత్నించగా జైలు అధికారులు నిరాకరించారు. దీంతో ఆమెను మానసికంగా వేధిస్తున్నారు.. ఆమె భర్తను కలిసేందుకు జైలు అధికారులుCHANDRABABU{#}bhuvaneshwari;Smart phone;Nara Brahmani;Nara Bhuvaneshwari;Coronavirus;News;Jagan;TDP;CBN;Balakrishnaబాబు సానుభూతి రాజకీయం తిప్పికొడుతుందా?బాబు సానుభూతి రాజకీయం తిప్పికొడుతుందా?CHANDRABABU{#}bhuvaneshwari;Smart phone;Nara Brahmani;Nara Bhuvaneshwari;Coronavirus;News;Jagan;TDP;CBN;BalakrishnaMon, 18 Sep 2023 10:00:00 GMTములాఖత్ బాబు అరెస్టుకు ముందు అంతగా ప్రాచుర్యం లేని పదం.  ములాఖత్ అంటే జైలులో ఉన్న ఖైదీని కలవడం. గతంలో వారానికి మూడు రోజులు ములాఖత్ కు అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. కానీ  జైలు అధికారులు రెండే సార్లు అని తేల్చి చెప్పారు. చంద్రబాబుని కలిసేందుకు తొలిసారి లోకేశ్, భువనేశ్వరి, బ్రాహ్మణి వెళ్లారు. రెండోసారి పవన్ కల్యాణ్, లోకేశ్, బాలకృష్ణ లు వెళ్లారు. మళ్లీ మూడోసారి కలిసేందుకు భువనేశ్వరి ప్రయత్నించగా జైలు అధికారులు నిరాకరించారు. దీంతో ఆమెను మానసికంగా వేధిస్తున్నారు.. ఆమె భర్తను కలిసేందుకు జైలు అధికారులు అంగీకరించడం లేదంటూ ఎల్లో మీడియాతో పాటు, మరికొన్ని పత్రికా సంస్థలు వార్తలు ప్రచారం చేశాయి. జైలులో  చంద్రబాబుకు భద్రత లేదు. సరైన సౌకర్యాలు లేవు అనేది ఆమె ఆరోపణ.

 
అసలు విషయానికి వస్తే సెంట్రల్ జైలు నిర్మాణం చంద్రబాబు హయాంలోనే జరిగింది.  భారతదేశంలోనే  రెండో అతిపెద్ద జైలు. బయట మీడియాలో ప్రచారం చేస్తున్నట్లుగా 30 ఎకరాల్లో నిర్మాణం, లోపల వసతులు లేవు అనేది అంతా బూటకమే. ఎందుకంటే జైలు అధికారులు లోపలికి ఎవరినీ అనుమతించరు. అంతేకాకుండా 130 ఎకరాల్లో నిర్మించి, నిరంతరం సీసీ కెమెరాల భద్రత నడుమ ఒక బ్యారెక్ మొత్తం చంద్రబాబుకు కేటాయించారు.


గతంలో ములాఖత్ ఎలా ఉండేదంటే ఒక హాలు ఏర్పాటు చేసి అందులో మాట్లాడుకునేచ్చేవారు. కరోనా అనంతరం ఒక అద్దం ఏర్పాటు చేసి ఫోన్ మాట్లాడుకునే సౌకర్యం కల్పించారు. వీఐపీ వ్యక్తులకు అయితే డీఎస్పీ, సూపరింటిండెంట్ రూముల్లో మాట్లాడుకునే ఏర్పాటు చేస్తారు. చంద్రబాబుకు డీఎస్పీ రూమ్ ఏర్పాటు చేశారనే ప్రచారం జరగుతోంది. కానీ చంద్రబాబుకి కల్పించిన వీఐపీ సౌకర్యాలు జగన్ కి కల్పించలేదు. ఒకవేళ చంద్రబాబు కు భద్రత రీత్యా వేరే ఏ జైలుకు మార్చినా ఇక్కడ ఉన్న రక్షణ తెలంగాణలో ఉన్న జైళ్లలో గానీ, ఆంధ్రాలో గానీ ఎక్కడా లేవు. ఏదో ఒకరకంగా సానుభూతి పొందాలి అని తప్పుడు ప్రచారం చేస్తే మొదటికే మోసం వస్తుంది. దీనిని టీడీపీ శ్రేణులు గుర్తించాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

10 రోజుల్లో "జవాన్" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>