EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pawan2c8792f9-8da1-44bd-ae59-a36fe5bf752f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pawan2c8792f9-8da1-44bd-ae59-a36fe5bf752f-415x250-IndiaHerald.jpgఓ వ్యక్తి తప్పు చేశాడని చెప్పడానికి కారణాలు కావాలి . ఆధారాలు చూపాలి. అదే ఏ తప్పు చేయలేదని చెప్పడానికి ఏ కారణాలు చూపనక్కర్లేదు. ఉదాహరణకు ఏపీ సీఎం జగన్ అరెస్టు చేసేటప్పుడు, బెయిల్ కోసం అప్పీల్ చేసినప్పుడు బోలెడు లెక్కలు చూపి లోపలే ఉంచారు. రాష్ట్ర విభజన జరిగాక ఏపీలో పరిస్థితులు మారిపోయాయని భావించిన కాంగ్రెస్ అధిష్ఠానం ప్రజాగ్రహాన్ని తప్పంచుకునేందుకు.. జగన్ కు బెయిల్ ఇస్తే బయట సాక్ష్యులను ప్రభావితం చేస్తారని చెప్పిన సీబీఐ ఒక్కసారిగా ప్లేట్ మార్చి మాకు ఏ అభ్యంతరం లేదు అని చెప్పింది. సమైక్యాంధ్ర నిPAWAN{#}YCP;media;March;Jagan;Andhra Pradesh;CBI;TDP;Rajahmundry;CBN;Congressపవన్‌.. బాబును జైలు నుంచి బయటకు రప్పిస్తారా?పవన్‌.. బాబును జైలు నుంచి బయటకు రప్పిస్తారా?PAWAN{#}YCP;media;March;Jagan;Andhra Pradesh;CBI;TDP;Rajahmundry;CBN;CongressMon, 18 Sep 2023 09:00:00 GMTఓ వ్యక్తి తప్పు చేశాడని చెప్పడానికి కారణాలు కావాలి . ఆధారాలు చూపాలి. అదే ఏ తప్పు చేయలేదని చెప్పడానికి ఏ కారణాలు చూపనక్కర్లేదు. ఉదాహరణకు ఏపీ సీఎం జగన్ అరెస్టు చేసేటప్పుడు, బెయిల్ కోసం అప్పీల్ చేసినప్పుడు బోలెడు లెక్కలు చూపి లోపలే ఉంచారు. రాష్ట్ర విభజన జరిగాక ఏపీలో పరిస్థితులు మారిపోయాయని భావించిన కాంగ్రెస్ అధిష్ఠానం ప్రజాగ్రహాన్ని తప్పంచుకునేందుకు.. జగన్ కు బెయిల్ ఇస్తే బయట సాక్ష్యులను ప్రభావితం చేస్తారని చెప్పిన సీబీఐ ఒక్కసారిగా ప్లేట్ మార్చి మాకు ఏ అభ్యంతరం లేదు అని చెప్పింది.


సమైక్యాంధ్ర  నిరసనల మధ్య జగన్ బయటకు వచ్చారు. ఈ విధంగా కొంతమేర జనాగ్రహాన్ని కాంగ్రెస్ కొంతమేర పక్కదోవ పట్టించింది. ఇప్పుడు చంద్రబాబు విషయంలోను ఇదే జరగుతుంది.  చంద్రబాబు అరెస్టు తదనంతర పరిస్థితులపై జగన్ ఓ అవగాహనకు వచ్చారు. టీడీపీ కకలావికలం అయింది. సమ్మెకు నామమాత్ర  స్పందన లభించిందనే భావనలో జగన్ ఉన్నారు.  ఇంకా కొన్ని కేసులు నమోదు చేసి మరొకొన్ని రోజులు జైలులో ఉంచే ప్రయత్నం చేయాలని చూశారు.


కానీ అనూహ్యంగా పవన్ చంద్రబాబుతో రాజమండ్రి జైలులో భేటీ అయి ఇక నుంచి టీడీపీ జనసేన కలిసే పోటీ చేస్తాయి అని ప్రకటించి షాక్ ఇచ్చారు.  దీంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. చంద్రబాబు అరెస్టు విషయంలో పవన్ కొంత సానుభూతిని ప్రజల్లోకి తీసుకెళితే ఇది రాజకీయంగా తనకు దెబ్బే అని భావించి అతడిని విడుదల చేయవచ్చు. తద్వారా పవన్ దూకుడును టీడీపీ నియంత్రిస్తుంది. పవన్ మద్దతు కావాలి కానీ అతని సారథ్యంలో పనిచేయడానికి టీడీపీ నేతలు ఆసక్తి చూపరు.  


చంద్రబాబుతో భేటీ తర్వాత లోకేశ్‌, బాలయ్యలు చెరోవైపు ఉండగా పవన్ మీడియా సమావేశం నిర్వహించారు.  ఇది కొంత వరకు జనసేనకు సానుకూలాంశమే. పవన్ వల్ల టీడీపీ, జనసేనకు మైలేజ్ వస్తోందని వైసీపీ భావిస్తే వెంటనే చంద్రబాబును బయటకు తీసుకువచ్చి ఈ అంశాన్ని పక్కదోవ పట్టించే అవకాశం ఉంది.  టీడీపీ కూడా పవన్ ను ముందుపెట్టి చంద్రబాబు ని బయటకు తేవాలని  చూస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హాట్ లుక్ ఉన్న డ్రెస్లో హాట్ స్టిల్స్ తో కుర్రకారును రెచ్చగొడుతున్న మీనాక్షి చౌదరి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>