MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kiranabavaram-movie8bca22b4-96ec-44f8-a139-7e562d6e1051-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kiranabavaram-movie8bca22b4-96ec-44f8-a139-7e562d6e1051-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరోలలో కిరణ్ అబ్బవరం కూడా ఒకరు.. తాజాగా రూల్స్ రంజన్ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని రత్నం కృష్ణ దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్గా నేహా శెట్టి నటించిన ఇప్పటివరకు విడుదలైన ట్రైలర్, పాటలు కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఈ సినిమా విడుదల దగ్గర పడుతూ ఉండడంతో కిరణ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు విషయాలను తెలియజేశారు. కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ చిన్నతనం నుంచే తను ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని స్కూల్లో ఎవరైనా తనని తక్కువ చేసి మాట్KIRANABAVARAM ;MOVIE{#}kiran;neha shetty;rani;krishna;job;Hero;Success;Cinemaహీరోగా సక్సెస్ అవ్వడం అంటే చాలా కష్టం .. కిరణ్ అబ్బవరం కామెంట్స్ వైరల్..!!హీరోగా సక్సెస్ అవ్వడం అంటే చాలా కష్టం .. కిరణ్ అబ్బవరం కామెంట్స్ వైరల్..!!KIRANABAVARAM ;MOVIE{#}kiran;neha shetty;rani;krishna;job;Hero;Success;CinemaSun, 17 Sep 2023 07:30:00 GMTటాలీవుడ్ యంగ్ హీరోలలో కిరణ్ అబ్బవరం కూడా ఒకరు.. తాజాగా రూల్స్ రంజన్ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని రత్నం కృష్ణ దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్గా నేహా శెట్టి నటించిన ఇప్పటివరకు విడుదలైన ట్రైలర్, పాటలు కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఈ సినిమా విడుదల దగ్గర పడుతూ ఉండడంతో కిరణ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు విషయాలను తెలియజేశారు.


కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ చిన్నతనం నుంచే తను ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని స్కూల్లో ఎవరైనా తనని తక్కువ చేసి మాట్లాడితే చాలా బాధగా అనిపించేదని రాను రాను వాటిని చాలా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వచ్చానని తెలిపారు.. జాబ్ వదిలేసి మరి సినిమాలలోకి రావాలనుకున్న సమయంలో నువ్వు హీరో అవుతావా అంటూ చాలామంది విమర్శించారట ..ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎలాగైనా సక్సెస్ కావాలనుకున్నాను అలాంటి సమయంలోనే రాజావారు రాణి గారు తో ఎంట్రీ ఇచ్చానని.. కానీ ఎస్ఆర్ కళ్యాణమండపంతో అందరికీ పరిచయమయ్య ఆ తర్వాత అవకాశాలు భారీగానే వచ్చాయని తెలిపారు.

ఆ తర్వాత గ్యాప్ లేకుండా సినిమాలు చేసే నాలుగేళ్లలో ఏడు సినిమాలు చేశాను అందులో కొన్ని ఫ్లాపులు అయ్యాయి.. ఇలాంటి సమయంలో ఆన్లైన్లో తనని చాలామంది ట్రోల్స్ చేయడం జరిగింది. ఇవన్నీ చూసి చాలా బాధపడ్డాను అని కూడా తెలిపారు.కానీ ఈ మధ్యకాలంలో అసలు వీటిని పట్టించుకోవడం మానేశానని విమర్శలు చేసే వారు చేస్తూ ఉంటారు వారందరికీ నా వర్క్ తో సమాధానం ఇవ్వాలనుకున్నాను గతంలో చేసిన సినిమాలు వరుసగా స్క్రిప్టులు ఎంచుకోవడంలో చాలా తప్పులు జరిగాయి. ఇకపైన ఆ తప్పులు లేకుండా ప్రేక్షకులను అలరించే సినిమాలను తీయాలనుకుంటున్నానని తెలియజేశారు కిరణ్ అబ్బవరం.


అంతేకాకుండా గత రెండేళ్లలో ఒకేసారి మూడు చిత్రాల షూటింగ్లో పాల్గొన్నారు పనిచేస్తున్నానో తెలియక చాలా గందరగోళానికి గురయ్యాను.. దీంతో నిద్రలేని రాత్రులు గడిపాను.. అందుకే ప్రేక్షకులను మెప్పించే సినిమాలను మాత్రమే చేస్తానని.. స్క్రిప్టు విషయంలో ఇప్పుడు జాగ్రత్తగా వహిస్తున్నానని తెలియజేశారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

టైట్ బ్లాక్ డ్రెస్లో హాట్ స్టిల్స్ తో రెచ్చగొడుతున్న తమన్నా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>