MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-devarakondacf4860ba-5a0f-4e6a-9a04-9c50993f1cba-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-devarakondacf4860ba-5a0f-4e6a-9a04-9c50993f1cba-415x250-IndiaHerald.jpgప్రస్తుత టాలీవుడ్ యంగ్ హీరోలలో అతికొద్ది కాలంలోనే స్టార్ గా మారిన హీరో విజయ్ దేవరకొండ. 'పెళ్లి చూపులు', 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం'.. ఇలా సినిమా సినిమాకి తన మార్కెట్ ని ఇంకా క్రేజ్ ని పెంచుకుంటూ వచ్చాడు.అయితే కొంత కాలంగా విజయ్ వరుసగా దారుణమైన పరాజయాలు ఎదుర్కొంటున్నాడు. ఆయన రీసెంట్ మూవీ 'ఖుషి' సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని కూడా చివరికి 10 కోట్ల పైగా నష్టంతో బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గా మిగిలింది.దానికి ప్రధాన కారణం మితిమీరిన బిజినెస్ అనే అభిప్రాయం ట్రేడ్ నుంచి, ఇంకా అభిమానుల నుంచి వినిపిస్తోందిVijay Devarakonda{#}vegetable market;Joseph Vijay;Love Story;Cinema;Tollywood;Heroవిజయ్ వరుస ప్లాపులకి అదే కారణం?విజయ్ వరుస ప్లాపులకి అదే కారణం?Vijay Devarakonda{#}vegetable market;Joseph Vijay;Love Story;Cinema;Tollywood;HeroSun, 17 Sep 2023 17:16:00 GMTప్రస్తుత టాలీవుడ్ యంగ్ హీరోలలో అతికొద్ది కాలంలోనే స్టార్ గా మారిన హీరో విజయ్ దేవరకొండ. 'పెళ్లి చూపులు', 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం'.. ఇలా సినిమా సినిమాకి తన మార్కెట్ ని ఇంకా క్రేజ్ ని పెంచుకుంటూ వచ్చాడు.అయితే కొంత కాలంగా విజయ్ వరుసగా దారుణమైన పరాజయాలు ఎదుర్కొంటున్నాడు. ఆయన రీసెంట్ మూవీ 'ఖుషి' సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని కూడా చివరికి 10 కోట్ల పైగా నష్టంతో బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గా మిగిలింది.దానికి ప్రధాన కారణం మితిమీరిన బిజినెస్ అనే అభిప్రాయం ట్రేడ్ నుంచి, ఇంకా అభిమానుల నుంచి వినిపిస్తోంది. 2018 లో వచ్చిన 'టాక్సీవాలా' సినిమా తర్వాత విజయ్ హిట్ ముఖం చూడలేదు.'డియర్ కామ్రేడ్', 'వరల్డ్ ఫేమస్ లవర్', 'లైగర్' ఇలా ఒక దానిని మించి ఒకటి పెద్ద డిజాస్టర్స్ గా నిలిచాయి.అసలు ఈ సినిమాలు బయ్యర్లకు భారీ నష్టాలను మిగిల్చి, బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయాలుగా మిగలడానికి ప్రధాన కారణం ఏంటంటే బిజినెస్ కావాల్సిన దానికంటే ఎక్కువ జరగడం. ముఖ్యంగా 'లైగర్' సినిమా అయితే యంగ్ హీరోలలో రికార్డ్ స్థాయిలో బిజినెస్ చేసిందని చెప్పొచ్చు.


జరిగిన బిజినెస్ కి తగ్గ కంటెంట్ సినిమాలో కొంచెం కూడా లేకపోవడంతో బయ్యర్లు చాలా ఘోరంగా నష్టపోయారు. ఇక విజయ్ రీసెంట్ మూవీ 'ఖుషి' అయితే పాజిటివ్ టాక్ తెచ్చుకుని కూడా, బయ్యర్లకు పది కోట్లకు పైగా నష్టాలను మిగిల్చి, బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా మిగలడానికి కూడా ఈ ఓవర్ బిజినెస్సే కారణం. విజయ్ ఫ్లాప్స్ లో ఉన్నప్పటికీ,ఇంకా లవ్ స్టోరీ అయినప్పటికీ, వారానికే 'జవాన్' వంటి భారీ సినిమా విడుదల ఉన్నప్పటికీ.. 'ఖుషి' సినిమా ఏకంగా రూ.50 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసింది.కానీ ఈ సినిమా రూ.40 కోట్ల షేర్ కి మాత్రమే పరిమితమైంది. నిజానికి విజయ్ లాంటి యంగ్ హీరోల సినిమాలకు రూ.40 కోట్ల షేర్ అనేది మంచి వసూళ్ళే. కానీ హై బిజినెస్ కారణంగా ఈ సినిమా కూడా ఫ్లాప్ లిస్టులో చేరిపోయింది. ఎంత పెద్ద హీరో అయినా వరుస ఫ్లాప్స్ వస్తే, ఖచ్చితంగా డౌన్ ఫాల్ చూస్తాడు. కాబట్టి విజయ్ ఈ పరిస్థితిని అర్ధం చేసుకొని మూవీకి జరిగే బిజినెస్ లో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కిరణ్ అబ్బవరం అందుకే ట్రోల్ అవుతున్నాడు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>