DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/kcr249b2edd-bdd5-475f-9072-e42ccec1fb9f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/kcr249b2edd-bdd5-475f-9072-e42ccec1fb9f-415x250-IndiaHerald.jpgవార్తలని వార్తల్లా వ్రాయకుండా, జరిగింది జరిగినట్లుగా చెప్పకుండా తమ యాజమాన్యానికి అనుకూలంగానే వార్తలు చూపించుకుంటూ వస్తున్నారు కొన్ని మీడియాల వాళ్ళు. తమ వాళ్ళు తప్పు చేస్తే దాన్ని కప్పిపుచ్చడం దానిని పక్క వాళ్ళపై రుద్దడం చేస్తూ ఉంటారు వీళ్ళు. అలాగే తమ వాళ్ళు ఎంత చిన్న మంచి పని చేసినా కూడా దానిని హైలైట్ చేసుకుంటూ అనితర సాధ్యం అన్నట్లుగా చూపించుకుంటూ వస్తారు. మీడియా అనేది నిజాన్ని నిక్కచ్చిగా చూపించే అద్దంలా ఉండాలి. అంతేగాని అప్పటికప్పుడు అల్లుకునే అబద్ధంలా ఉండకూడదు, మోసంలా మారకూడదు అని అంటునkcr{#}KCR;Telugu;Lokesh;Lokesh Kanagaraj;Congress;Telugu Desam Party;News;Telangana;Sakshi;CBN;mediaకేసీఆర్‌ చేస్తే గొప్ప.. జగన్ చేస్తే లైట్‌ తీస్కో?కేసీఆర్‌ చేస్తే గొప్ప.. జగన్ చేస్తే లైట్‌ తీస్కో?kcr{#}KCR;Telugu;Lokesh;Lokesh Kanagaraj;Congress;Telugu Desam Party;News;Telangana;Sakshi;CBN;mediaSun, 17 Sep 2023 11:00:00 GMTవార్తలని వార్తల్లా వ్రాయకుండా,  జరిగింది జరిగినట్లుగా చెప్పకుండా తమ  యాజమాన్యానికి అనుకూలంగానే వార్తలు చూపించుకుంటూ వస్తున్నారు కొన్ని మీడియాల వాళ్ళు. తమ వాళ్ళు తప్పు చేస్తే దాన్ని కప్పిపుచ్చడం దానిని పక్క వాళ్ళపై రుద్దడం చేస్తూ ఉంటారు వీళ్ళు.  అలాగే తమ వాళ్ళు ఎంత చిన్న మంచి పని చేసినా కూడా దానిని హైలైట్ చేసుకుంటూ అనితర సాధ్యం అన్నట్లుగా చూపించుకుంటూ వస్తారు.


మీడియా అనేది నిజాన్ని నిక్కచ్చిగా చూపించే అద్దంలా ఉండాలి.  అంతేగాని అప్పటికప్పుడు అల్లుకునే అబద్ధంలా ఉండకూడదు, మోసంలా మారకూడదు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఓ రెండు ప్రధాన తెలుగు పత్రికలు ఉన్నాయంటే చంద్రబాబు నాయుడుని, లోకేష్ లేదా తెలుగుదేశం అనుకూల వర్గానికి సంబంధించి గొప్పగా వ్రాస్తూ ఉంటాయి. అలాగే సాక్షి మీడియా వచ్చి  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని, ఆయన వర్గాన్ని హైలైట్ చేసుకుంటూ వస్తాయి.


పక్క వాళ్ళ తప్పులు ఉన్నా, లేకున్నా విమర్శించడం కూడా చేస్తుంటారు వీళ్ళు. అది ఎందుకంటే తమ వాళ్ళ తప్పును కప్పి పుచ్చుకోవడానికి. అయితే ఎల్లో మీడియా అయితే  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటాయి. అంతే కాకుండా వాళ్లు చేసిన పనిని  పొరపాటున కూడా  హైలెట్ చేయడం అనేది జరగదు . హైలెట్ చేయడం అనే విషయం పక్కన పెట్టినా, కనీసం న్యూస్ లో కనపడకుండా చేస్తారు అని అంటారు.


అటు తెలంగాణలో చూస్తే తెలంగాణ పత్రికలో ఐదు మెడికల్ కళాశాలల ఇనాగరేషన్ గురించి,  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పీచ్ గురించి హైలెట్ చేసుకుంటూ వచ్చారు. కానీ మన ఆంధ్ర ప్రాంతానికి వచ్చేసరికి ఎవరి పత్రికలో వాళ్ళ న్యూస్ హైలైట్ అవుతూ ఉంటాయి. ఆంధ్ర ప్రాంతంలో కూడా ఐదు ప్రభుత్వ కళాశాలలు సిద్ధమవుతున్నా కూడా ఆ విషయాన్ని పక్కన పెట్టి చంద్రబాబు గురించి ఆందోళనలు అనే విషయాన్ని చెప్పుకొస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

'జవాన్' లో గుండు తో కనిపించడం వెనక అసలు అసలు కారణం అదే : షారుక్ ఖాన్




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>