PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/lokeshe98f3f47-8405-43c8-bf02-fe6ff5a454fd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/lokeshe98f3f47-8405-43c8-bf02-fe6ff5a454fd-415x250-IndiaHerald.jpgఆంధ్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఎలక్షన్లలో, సినిమాలోని ప్రీ క్లైమాక్స్ లాంటిది ఒకటి నెలకొంది. చంద్రబాబు నాయుడు అరెస్టుతో రాజకీయాల్లో కొత్త సమీకరణాలు రాబోతున్నాయని అంటున్నారు కొంతమంది. ఈ మాట నిజం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి కొంత మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు తెలుగుదేశం పార్టీ వైపుగా చూస్తున్నట్లుగా తెలుస్తుంది. 8 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు లోకేష్ తో టచ్ లో ఉన్నారని అంటున్నారు. వీళ్ళు ఎవరో మాకు తెలుసు కానీ మేము ఇప్పుడు చెప్పమని అంటుందట తెలుగు దేశం అధిష్టానం. అయితే ఇLOKESH{#}Sridevi Kapoor;Telugu Desam Party;Y. S. Rajasekhara Reddy;Purighalla Raghuram;Balakrishna;Nara Lokesh;Nijam;kalyan;Elections;CBN;Lokesh;Lokesh Kanagaraj;MP;Congress;Partyఆ వైసీపీ ఎంపీలు లోకేష్‌తో టచ్‌లో ఉన్నారా?ఆ వైసీపీ ఎంపీలు లోకేష్‌తో టచ్‌లో ఉన్నారా?LOKESH{#}Sridevi Kapoor;Telugu Desam Party;Y. S. Rajasekhara Reddy;Purighalla Raghuram;Balakrishna;Nara Lokesh;Nijam;kalyan;Elections;CBN;Lokesh;Lokesh Kanagaraj;MP;Congress;PartySat, 16 Sep 2023 22:29:00 GMTఆంధ్ర రాజకీయాల్లో ఇప్పుడు  ఒక రకంగా చెప్పాలంటే  ఎలక్షన్లలో, సినిమాలోని ప్రీ క్లైమాక్స్ లాంటిది ఒకటి నెలకొంది. చంద్రబాబు నాయుడు అరెస్టుతో రాజకీయాల్లో కొత్త సమీకరణాలు రాబోతున్నాయని అంటున్నారు కొంతమంది. ఈ మాట నిజం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి కొంత మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు తెలుగుదేశం పార్టీ వైపుగా చూస్తున్నట్లుగా తెలుస్తుంది. 8 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు  లోకేష్ తో టచ్ లో ఉన్నారని అంటున్నారు.


వీళ్ళు ఎవరో మాకు తెలుసు కానీ మేము ఇప్పుడు చెప్పమని అంటుందట తెలుగు దేశం అధిష్టానం. అయితే ఇదంతా జైల్లో నుండి చంద్ర బాబు ఆడిస్తున్న రాజకీయ చదరంగం అని కొంత మంది అంటున్నారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు దగ్గరికి అవతల ఎమ్మెల్యేలు  పదిమంది వస్తే 20 నుండి 50 మంది ఎమ్మెల్యేలు వచ్చారని చెప్పడం జరిగింది. ఈ విధంగా లేనిది ఉన్నట్టుగా చెప్పడం వల్ల అదే  నిజం అనుకుని,ఆ హై పబ్లిసిటీ వల్ల మరి కొంతమంది నిజంగానే  వచ్చారట.


అంతే కాకుండా పవన్ కళ్యాణ్ కూడా ఈ పోరాటంలో టిడిపికి తోడుగా ఉంటున్నారు. నారా లోకేష్ కి వాళ్ళ మామగారు బాలయ్య బాబు ఎలాగూ తోడుగానే ఉంటారు. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఇదే విధమైన వ్యూహం అమలు చేస్తుందేమో అని సందేహిస్తున్నారు కొంత మంది. అయితే ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు నిజంగానే రావడం జరిగితే అది వాళ్లే డైరెక్ట్ గా చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయం లో ఈ క్లారిటీ ఇవ్వడంలో తప్పేం లేదు.


కోటం రెడ్డి, ఆనం నారాయణరెడ్డి, శ్రీదేవి ఈ రకంగానే బయటకు వచ్చేసిన నాయకులే కదా. అంతెందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి రఘురాం కృష్ణంరాజు కూడా బయటికి వచ్చేయడం జరిగింది కదా అని అంటున్నారు. అయితే నిజంగానే ఎమ్మెల్యేలు ఎంపీలు వస్తూ ఉంటే టిడిపికి అది శుభపరిణామమే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సైమా వేడుకలలో మెరిసిన హీరోయిన్స్ వీళ్ళే..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>