Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/arrest4c036765-4eca-45f5-9b74-432bbdc35680-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/arrest4c036765-4eca-45f5-9b74-432bbdc35680-415x250-IndiaHerald.jpgపెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ఘట్టం అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నచ్చిన వారిని పెళ్లి చేసుకొని జీవితాంతం సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొంతమంది ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటే మరి కొంతమంది పెద్దలు కుదురిచిన వివాహాలు చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఇక కొన్ని కొన్ని సార్లు పెళ్లి తంతు జరుగుతున్న సమయంలో అచ్చం సినిమా తరహాలోనే విచిత్రమైన ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎవరో ఒకరు వచ్చి పెళ్లి ఆపేయడం లేదంటే వరుడు లేదా వధువు ఇక పెళ్లి ఇష్టం లేదు అని చెArrest{#}Letter;police;Tammudu;Thammudu;prema;Love;marriage;Cinemaమండపంపైనే వరుడు అరెస్ట్.. పెళ్లి ఆగడం ఎందుకని వధువు ఏం చేసిందంటే?మండపంపైనే వరుడు అరెస్ట్.. పెళ్లి ఆగడం ఎందుకని వధువు ఏం చేసిందంటే?Arrest{#}Letter;police;Tammudu;Thammudu;prema;Love;marriage;CinemaSat, 16 Sep 2023 11:00:00 GMTపెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ఘట్టం అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నచ్చిన వారిని పెళ్లి చేసుకొని జీవితాంతం సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొంతమంది ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటే మరి కొంతమంది పెద్దలు కుదురిచిన వివాహాలు చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఇక కొన్ని కొన్ని సార్లు పెళ్లి తంతు జరుగుతున్న సమయంలో అచ్చం సినిమా తరహాలోనే విచిత్రమైన ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎవరో ఒకరు వచ్చి పెళ్లి ఆపేయడం లేదంటే వరుడు లేదా వధువు ఇక పెళ్లి ఇష్టం లేదు అని చెప్పి లెటర్ రాసి వెళ్లిపోవడం జరుగుతూ ఉంటుంది. లేదంటే ఇక వరుడు ఏదో చేశాడు అంటూ భావిస్తూ పోలీసులు.. పెళ్లి పీటల మీద నుంచి అరెస్టు చేయడం లాంటి ఘటనలు కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి.


 ఇక ఇలాంటివి జరిగినప్పుడు ఇలాంటివి సినిమాల్లోనే అనుకున్నాం. నిజ జీవితంలో కూడా జరుగుతాయా అని ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. ఏకంగా వరుడు నేరం చేసాడు అని అరెస్టు చేశారు పోలీసులు. అయితే పెళ్లి ఆగిపోయింది. ఇక ఇంత ఖర్చు వృధాగా పోతుంది అనుకుందో లేదా ఇంకేం ఆలోచించిందో కానీ వధువు పెళ్లి క్యాన్సిల్ చేసుకోకుండా ఏకంగా అతని సోదరుడిని  పెళ్లి చేసుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని అలీగడ్ లో వెలుగులోకి వచ్చింది.


 మద్యం షాపు, క్యాంటీన్ నుంచి 35 డబ్బాల్లో ఉన్న మద్యం సీసాలు ఇతర వస్తువులు చోరీ అయ్యాయి. అయితే ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారూ. ఈ క్రమంలోనే ఇక చోరీకి పాల్పడిన నిందితుడిని పైజల్ గా గుర్తించారు. అయితే మరోవైపు అతనికి యువతీతో పెళ్లి జరుగుతుంది. దీంతో పెళ్లి మండపానికి చేరుకున్న పోలీసులు పెళ్లి తంతు మధ్యలోనే పైజల్ ని అరెస్టు చేశారు  అతను కూడా నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు  అయితే ఈ గందరగోళ పరిస్థితుల్లో పెళ్లి వేదిక వద్ద వధువు ఒంటరిగా ఉంది. ఈ క్రమంలోనే యువతిని పెళ్లి చేసుకున్నందుకు వరుడు తమ్ముడు ముందుకు వచ్చాడు. దీంతో ఇరు కుటుంబాలు దీనికి అంగీకరించగా పెళ్లి తంతు పూర్తయింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారును రెచ్చగొడుతున్న అనన్య పాండే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>