NRIpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/tiktoka243c171-cae5-4369-b472-4ebc8dad4573-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/tiktoka243c171-cae5-4369-b472-4ebc8dad4573-415x250-IndiaHerald.jpgటిక్ టాక్.. ఈ యాప్ గురించి ఇండియాలో ఇంటర్నెట్ జనాలకు కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ఇప్పుడైతే రీల్స్ చేయడం లేదా యూట్యూబ్లో షార్ట్ వీడియోలు చేయడం చేస్తూ ఉన్నారు ఎంతోమంది. కానీ ఇవేవీ అందుబాటులో లేనప్పుడే టిక్ టాక్ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ను అందించింది. ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పటికీ కూడా టిక్ టాక్ ను చూసి ఇంస్టాగ్రామ్ యూట్యూబ్ వాళ్ళు ఇలా రీల్స్ షార్ట్ వీడియోలు టిక్ టాక్ నుండి కాపీ కొట్టారు అని కొంతమంది ఇంటర్నెట్ జనాలు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పటివరకు ఎక్కడా లేని వినూత్నమైన ఎంటర్టైన్మెTiktok{#}Ireland;central government;Instagramటిక్ టాక్ కు భారీ షాక్.. 3000 కోట్ల జరిమానా?టిక్ టాక్ కు భారీ షాక్.. 3000 కోట్ల జరిమానా?Tiktok{#}Ireland;central government;InstagramSat, 16 Sep 2023 13:00:00 GMTటిక్ టాక్.. ఈ యాప్ గురించి ఇండియాలో ఇంటర్నెట్ జనాలకు కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ఇప్పుడైతే రీల్స్ చేయడం లేదా యూట్యూబ్లో షార్ట్ వీడియోలు చేయడం చేస్తూ ఉన్నారు ఎంతోమంది. కానీ ఇవేవీ అందుబాటులో లేనప్పుడే టిక్ టాక్ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ను అందించింది. ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పటికీ కూడా టిక్ టాక్ ను చూసి ఇంస్టాగ్రామ్ యూట్యూబ్ వాళ్ళు ఇలా రీల్స్ షార్ట్ వీడియోలు టిక్ టాక్ నుండి  కాపీ కొట్టారు అని కొంతమంది ఇంటర్నెట్ జనాలు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పటివరకు ఎక్కడా లేని వినూత్నమైన ఎంటర్టైన్మెంట్ను అందించింది టిక్ టాక్. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతిఒకరిని తనకు ఎడిక్ట్ చేసుకుంది అని చెప్పాలి.


 ఒక రకంగా చెప్పాలంటే ఇండియాలోని ఇంటర్నెట్ జనాలను ఒక ఊపు ఊపేసింది. దీంతో టాప్ యాప్ గా మారిపోయింది. కానీ ఆ తర్వాత చైనాతో ఉన్న వైరం కారణంగా ఇక భద్రతా కారణాల దృశ్య ఈ యాప్ పై కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎంతో మంది టిక్ టాక్ లేకపోవడంతో ఎంతగానో బాధపడిపోయారు. ప్రస్తుతం ఇండియాలో టిక్ టాక్ పై నిషేధం కొనసాగుతూ ఉన్నప్పటికీ కొన్ని దేశాలలో మాత్రం ఈ యాప్ వినియోగిస్తూనే ఉన్నారు. కానీ ఒక్కో దేశం టిప్ టాక్ పై ఇక బ్యాన్ విధిస్తూ వస్తూ ఉండడం కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది.


 అయితే ఇటీవలే టిక్ టాక్ కి భారీ షాక్ తగిలింది  చిన్నారుల ప్రైవసీ నిబంధనలు ఉల్లంఘించిన ఈ కంపెనీకి యూరోపియన్ యూనియన్ దాదాపు 3000 కోట్ల జరిమానా విధించింది. చైనాకు చెందిన ఈ యాప్ పై ఇప్పటికే భారత పలు దేశాల్లో నిషేధం కొనసాగగా.. భారీ నష్టాల పాలవుతుంది టిక్ టాక్. ఇక ఇప్పుడు యూరోపియన్ యూనియన్ భారీ మొత్తంలో జరిమానా విధించింది. అయితే చిన్నారులు టీనేజర్ల వీడియోలను అందరూ వీక్షించేందుకు కామెంట్ చూసేందుకు టిక్ టాక్ అనుమతిస్తూ ఉన్నట్లు ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ గుర్తించింది. ఈ క్రమంలోనే యూరోపియన్ యూనియన్ ఇలాంటి నిర్ణయం తీసుకుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

షారుఖ్ ఖాన్: ఒకే ఏడాది 2 సినిమాలతో సూపర్ రికార్డ్స్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>